అన్వేషించండి

ఇంజిన్‌, ఫీచర్లు, ధర నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్‌ రేట్ల వరకు - Honda SP160 పూర్తి వివరాలు

Honda SP160 కొనుగోలు ముందు తప్పక తెలుసుకోవాల్సిన 5 కీలక అంశాలు. ఇంజిన్‌ పవర్‌, ఫీచర్లు, బరువు, సీట్‌ హైట్‌, హైదరాబాద్‌, విజయవాడ ఆన్‌రోడ్‌ ధరల పూర్తి వివరాలు.

Honda SP160 Review: భారత కమ్యూటర్‌ బైక్‌ మార్కెట్‌లో హోండాకు మంచి పేరు ఉంది. దీనికి కొనసాగింపుగా కంపెనీ తీసుకొచ్చిన మోడల్‌ Honda SP160. ఇది హోండా యూనికోర్న్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందినప్పటికీ, లుక్‌, ఫీచర్ల విషయంలో మరింత ఆధునికంగా కనిపిస్తుంది. SP125 నుంచి తీసుకున్న డిజైన్‌ టచ్‌లు దీనికి యూత్‌ ఫ్రెండ్లీ అప్పీల్‌ను ఇస్తాయి. మీరు ఈ బైక్‌ను కొనాలనుకుంటే, ముందుగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు ఇవే.

1. Honda SP160 ఇంజిన్‌ పవర్‌ ఎంత?

Honda SP160లో 162.7cc సామర్థ్యం గల, ఎయిర్‌-కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్‌ 7,500rpm వద్ద 13.2hp పవర్‌ను, 5,250rpm వద్ద 14.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. నగర ప్రయాణాలకు సరిపోయేలా స్మూత్‌ పవర్‌ డెలివరీ ఉండటం ఈ బైక్‌ ప్రత్యేకత.

2. Honda SP160 బరువు ఎంత?

SP160 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సింగిల్‌ డిస్క్‌ వేరియంట్‌ బరువు 138 కిలోలు కాగా, డబుల్‌ డిస్క్‌ వేరియంట్‌ బరువు 140 కిలోలు. అదే ఇంజిన్‌, ప్లాట్‌ఫామ్‌ ఉన్న హోండా యూనికోర్న్‌ బరువు 139 కిలోలు. అంటే, SP160 బరువు పరంగా సులభంగా హ్యాండిల్‌ చేయగలిగే బైక్‌గా చెప్పుకోవచ్చు.

3. సీట్‌ హైట్‌ & రైడింగ్‌ కంఫర్ట్‌

Honda SP160 సీట్‌ హైట్‌ 796mm. ఇది ఎక్కువ మంది తెలుగు రైడర్లకు సౌకర్యంగా ఉంటుంది. కమ్యూటర్‌ బైక్‌గా డిజైన్‌ చేసినందున, ఇందులో పొడవైన సింగిల్‌ పీస్‌ సీట్‌ ఇచ్చారు. దీని వల్ల రైడర్‌, పిలియన్‌ ఇద్దరికీ సరిపడా స్థలం లభిస్తుంది. రోజువారీ ఆఫీస్‌ ప్రయాణాలు, కుటుంబంతో చిన్న ట్రిప్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది.

4. Honda SP160లో ఉన్న ఫీచర్లు

ఫీచర్ల విషయంలో SP160 ఆకట్టుకుంటుంది. ఇందులో TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంది. దీనికి బ్లూటూత్‌ కనెక్టివిటీ అందించారు. కాల్‌, మ్యూజిక్‌ కంట్రోల్స్‌ ఈ డిస్‌ప్లే ద్వారా ఉపయోగించుకోవచ్చు. అలాగే LED హెడ్‌ల్యాంప్స్‌, LED టెయిల్‌ ల్యాంప్‌, USB Type-C ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉన్నాయి. భద్రత కోసం సింగిల్‌ ఛానల్‌ ABS‌ను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు.

5. Honda SP160 ధర & ఆన్‌రోడ్‌ ఖర్చు

Honda SP160 ధరలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర - ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ):
• సింగిల్‌ డిస్క్‌ వేరియంట్‌ - రూ.1.15 లక్షలు
• డబుల్‌ డిస్క్‌ వేరియంట్‌ - రూ.1.21 లక్షలు

డబుల్‌ డిస్క్‌ వేరియంట్‌లో రియర్‌ డ్రమ్‌ బ్రేక్‌ స్థానంలో డిస్క్‌ బ్రేక్‌ ఇస్తారు.

హైదరాబాద్‌లో Honda SP160 సింగిల్‌ డిస్క్‌ ఆన్‌రోడ్‌ ధర:
ఎక్స్‌-షోరూమ్‌ ధర - రూ.1,15,018
RTO - రూ.18,725
ఇన్సూరెన్స్‌ - రూ.12,230
ఎక్స్‌టెండెడ్‌ వారంటీ - రూ.1,114
TR - రూ.995
మొత్తం ఆన్‌రోడ్‌ ధర - రూ.1,48,082

విజయవాడలో Honda SP160  సింగిల్‌ డిస్క్‌ ఆన్‌రోడ్‌ ధర:
ఎక్స్‌-షోరూమ్‌ ధర - రూ.1,15,018
RTO - రూ.15,302
ఇన్సూరెన్స్‌ - రూ.11,530
మొత్తం ఆన్‌రోడ్‌ ధర - రూ.1,41,850

మొత్తం మీద, రోజువారీ ప్రయాణాలకు నమ్మకమైన ఇంజిన్‌, ఆధునిక ఫీచర్లు, హోండా విశ్వసనీయత కావాలనుకునే వారికి Honda SP160 ఒక మంచి ఎంపిక. నగరంతో పాటు హైవేలోనూ స్మూత్‌ రైడ్‌ కోరుకునే వారికి ఇది సరైన కమ్యూటర్‌ బైక్‌గా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌
KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?
KTM 390 Duke వర్సెస్‌ Guerrilla 450.. పెద్ద ఇంజిన్‌ ఉన్నా తక్కువ ధరలో RE బైక్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget