అన్వేషించండి

కొత్త ప్లాట్‌ఫామ్‌, తక్కువ బరువు, ఈజీ ఫీచర్లు - బజాజ్‌ చేతక్‌ C25 ఎంతవరకు ఉపయోగపడుతుంది?

కొత్త Bajaj Chetak C25 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిజైన్‌, రేంజ్‌, పనితీరు, ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకోండి. నగర ప్రయాణాలకు ఇది ఎంతవరకు సరైన ఎంపికో తెలుసుకునేందుకు పూర్తి రివ్యూ ఇది.

Bajaj Chetak C25 Review: బజాజ్‌ చేతక్‌ కుటుంబంలో తాజాగా చేరిన చేతక్‌ C25 కేవలం ఎంట్రీ లెవల్‌ మోడల్‌ మాత్రమే కాదు. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చిన్న సైజ్‌, తక్కువ బరువు, ఈజీ రైడింగ్‌ ఫీల్‌ ఇచ్చేలా డిజైన్‌ చేశారు. ముఖ్యంగా, సిటీల్లో డైరీ ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక ప్రాక్టికల్‌ ఆప్షన్‌గా కనిపిస్తోంది.

డిజైన్‌ & క్వాలిటీ

చేతక్‌ C25 కొత్త చాసిస్‌ మీద వచ్చినా, డిజైన్‌ చూస్తే వెంటనే ఇది చేతక్‌ అనే గుర్తింపును చూపిస్తుంది. ప్రతి ప్యానెల్‌ కొత్తగా డిజైన్‌ చేశారు. సైడ్‌, రియర్‌ భాగాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముందూ వెనకా LED లైటింగ్‌ ఇచ్చారు.
రైడర్‌ ముందుగా కనిపించే రివర్స్‌ LCD డిస్‌ప్లే చాలా సింపుల్‌గా ఉంటుంది. బ్యాటరీ ఛార్జ్‌, రేంజ్‌, స్పీడ్‌, రైడింగ్‌ మోడ్‌ వంటి అవసరమైన సమాచారం స్పష్టంగా చూపిస్తుంది. ఎండలో కూడా డిస్‌ప్లే చదవడానికి ఇబ్బంది ఉండదు.

ఈ స్కూటర్‌ ముందు భాగంలో రెండు ఓపెన్‌ స్టోరేజ్‌ క్యూబీలు, బ్యాగ్‌ హుక్‌ ఉన్నాయి. వీల్‌బేస్‌ తగ్గించడంతో అండర్‌సీట్‌ స్టోరేజ్‌ 25 లీటర్లకు పరిమితమైంది. అయినా కూడా ఒక పెద్ద ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్‌ సులభంగా సరిపోతుంది. మొత్తం బిల్డ్‌ క్వాలిటీ బాగుంది, ధర తగ్గించారనే భావన రాదు.

పనితీరు & రిఫైన్‌మెంట్‌

చేతక్‌ C25లో కొత్త హబ్‌ మోటార్‌ ఉంది. ఇది 2.2kW పీక్‌ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం 55 కిలోమీటర్లు. కాగితాల మీద చూసుకుంటే ఇది పెద్ద సంఖ్య కాదు. కానీ నగర ట్రాఫిక్‌లో మాత్రం స్కూటర్‌ చురుకుగా స్పందిస్తుంది.
యాక్సిలరేటర్‌ ట్యూనింగ్‌ స్మూత్‌గా ఉంటుంది. తక్కువ శబ్దంతో నడుస్తుంది. ఫ్లైఓవర్లు ఎక్కేటప్పుడు కూడా ఇబ్బంది అనిపించదు.

బ్యాటరీ & రేంజ్‌

ఈ స్కూటర్‌లో 2.5kWh బ్యాటరీ ఇచ్చారు. కంపెనీ తెలిపిన IDC రేంజ్‌ 113 కిలోమీటర్లు. వాస్తవ వినియోగంలో దాదాపు 90 కిలోమీటర్ల వరకు రేంజ్‌ వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ 15 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు స్కూటర్‌ ఆటోమేటిక్‌గా ఎకో సెట్టింగ్‌కు మారుతుంది. 750 వాట్‌ పోర్టబుల్‌ ఛార్జర్‌తో 3 గంటల 45 నిమిషాల్లో పూర్తి ఛార్జ్‌ అవుతుంది. సీట్‌ కింద ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉండటం సౌకర్యంగా ఉంటుంది.

కంఫర్ట్‌ & హ్యాండ్లింగ్‌

చేతక్‌ C25 బరువు కేవలం 108 కిలోలు మాత్రమే. ఇది మిగతా చేతక్‌ మోడళ్లతో పోలిస్తే 20 కిలోలకుపైగా తక్కువ. సీట్‌ ఎత్తు 763 మిల్లీమీటర్లు కావడంతో చిన్న ఎత్తు ఉన్న రైడర్లకు కూడా నమ్మకంగా అనిపిస్తుంది. రియర్‌ సస్పెన్షన్‌ బంప్స్‌ను బాగా గ్రహిస్తుంది. ముందు భాగం కొంచెం సాఫ్ట్‌గా అనిపించినా, నగర రోడ్లకు సరిపోతుంది. ముందు డిస్క్‌ బ్రేక్‌ ఇవ్వడం మంచి విషయం.

ధర & ఫీచర్లు

చేతక్‌ C25లో LED లైట్స్‌, రివర్స్‌ మోడ్‌, బూట్‌ ఓపెనింగ్‌, పార్కింగ్‌ లాక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్‌, కాల్‌ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ వంటి ఫీచర్ల కోసం రూ.3,000 విలువైన టెక్‌ప్యాక్‌ ఆప్షన్‌ ఉంది. టెక్‌ప్యాక్‌తో కలిపి ఈ స్కూటర్‌ ధర రూ.94,399 (ఎక్స్‌-షోరూమ్‌ ధర). నడపడానికి సింపుల్‌గా ఉండి, నమ్మకమైన, తక్కువ ఖర్చుతో నగర ప్రయాణాలకు ఒక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కావాలనుకునే వారికి చేతక్‌ C25 మంచి ఎంపికగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!
టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!
మారుతి, హ్యుందాయ్‌ బాటలోనే టాటా.. సెప్టెంబర్‌ నుంచి ధరల మోత
Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget