Honda Vehicles Engine Software Issue: ఇంజిన్‌లో సాంకేతిక లోపం- సుమారు మూడు లక్షల వాహనాలను రికాల్ చేసిన హోండా
Honda Vehicles Engine Software Issue: హోండా వాహనాల్లో ఇంజన్ సమస్య తలెత్తిందని దాదాపు మూడు లక్షల వాహనాలను సర్వీస్ సెంటర్‌కు రప్పించారు.

Honda Recall Vehicles: హోండా వాహనాల్లో అమర్చిన ఇంజన్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో దాదాపు 2.95 లక్షల వాహనాలను వాపస్ తీసుకుంది సంస్థ. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్‌లో సాఫ్ట్‌వేర్ లోపం తలెత్తింది. దీని వల్ల ఇంజిన్ పవర్ తగ్గుతోంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ రాంగ్ ప్రోగ్రామింగ్‌పై చాలా మంది ఫిర్యాదులు చేశారు. దీంతో హోండా సంస్థ జనవరి 29, 2025 బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
పత్రికా ప్రకటనలో ఏం చెప్పింది అంటే..
కార్లలో ఇంజన్ వైఫల్యం కారణంగా థొరెటల్‌లో అకస్మాత్తుగా మార్పు వస్తోంది. దీని కారణంగా ఇంజిన్ డ్రైవ్ పవర్ తగ్గిపోతోంది. ఇంజిన్ అడపాదడపా పని చేయకపోవచ్చు. లేదా అకస్మాత్తుగా వాహనం ఆగిపోవచ్చు అని హోండా పత్రికా ప్రకటనలో తెలియజేసింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఇంజిన్ ఫెయిల్ అయితే అది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది వివరించింది.
ఈమెయిల్ ద్వారా వినియోగదారులకు సమాచారం
ఇంజిన్‌లో సమస్య ఉన్న అన్ని మోడళ్ల యజమానులను మార్చిలో మెయిల్ ద్వారా సంప్రదిస్తామని హోండా తెలిపింది. ఈ మెయిల్‌లో, ఆ కారు యజమానులు తమ వాహనాలను అధీకృత హోండా లేదా అకురా డీలర్ వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ FI-ECU సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయమని చెబుతారు. దీనికి కార్ల యజమానులు ఎలాంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు అదిరిపోయే మైలేజీ, ఫీచర్లు ఉండే బైక్‌లు ఇవే
ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు
హోండా కార్ ఓనర్ల కోసం కస్టమర్ సర్వీస్ నంబర్‌ను కూడా జారీ చేసింది. కారు యజమానులు ఈ నంబర్‌కు 1-888-234-2138కి కాల్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. ఈ రీకాల్ కోసం హోండా EL1, AL0 నంబర్‌లను ఇచ్చింది. ఇది కాకుండా కారు యజమానులు NHTSA వాహన భద్రత హాట్‌లైన్‌కు 1-888-327-4236కు కాల్ చేయడం ద్వారా లేదా nhtsa.gov వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చని పేర్కొంది.
Also Read: రూ.7 లక్షల బడ్జెట్‌లో కారు కోసం చూస్తున్నారా? ఈ లిస్ట్ ఒక్కసారి పరిశీలించండి !





















