అన్వేషించండి

Honda Electric Bike 500cc: యూత్‌కు గుడ్‌న్యూస్‌, 500cc పవర్‌తో హోండా మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ - ధర ఎంతంటే?

Honda First Electric Bike India: హోండా తొలి ఎలక్ట్రిక్ బైక్ పేరును ఇంకా వెల్లడించలేదు, కానీ కంపెనీ సెప్టెంబర్ 2న అధికారికంగా దీనిని లాంచ్ చేయవచ్చని సమాచారం.

Honda Upcoming Electric Bike Price And Features: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా, ఇటీవలే, తన ఎలక్ట్రిక్ స్కూటర్ Honda Activa e ని భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో, ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ను కూడా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్‌ బైక్ టీజర్ సోషల్ మీడియాలో విడుదలైంది, సంచలనంగా మారింది. ఆ టీజర్‌లో కనిపించిన హోండా ఎలక్ట్రిక్‌ బైక్‌ రూపం & డిజైన్‌ జనాన్ని, ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది.

హోండా మొదటి ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఎప్పుడు లాంచ్‌ చేస్తారు?
ఈ బైక్ పేరును హోండా కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ దీని అధికారిక లాంచ్ సెప్టెంబర్ 2, 2025న జరగనుంది. అంటే, ఇంకో నెలలో ఈ బైక్‌ లాంచ్‌ అవుతుంది. గత సంవత్సరం ఇటలీలోని మిలాన్‌లో జరిగిన EICMA మోటార్‌ సైకిల్ షోలో ప్రదర్శించిన కంపెనీ EV Fun Concept ఆధారంగా ఈ బైక్ ఉంటుందని భావిస్తున్నారు.

500cc బైక్‌ డిజైన్ & ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆ టీజర్‌లో, బైక్ TFT డాష్‌ బోర్డ్, LED DRL, LED టర్న్ ఇండికేటర్లు & షార్ప్‌ డిజైన్‌ను చూపించారు. చిన్న టెయిల్‌ & స్పోర్టీ స్టైల్ దీనికి ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ రూపాన్ని ఆపాదించాయి. మెకానికల్ సెటప్‌లో.. సింగిల్-సైడెడ్ స్వింగ్‌ఆర్మ్, USD ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం, వెనుక చక్రానికి పెద్ద డిస్క్ బ్రేక్ & Pirelli Rosso 3 టైర్లతో 17-అంగుళాల వీల్స్‌ను దీనికి ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, కంపెనీ టీజర్‌లో బైక్ హమ్మింగ్ సౌండ్‌ను కూడా షేర్‌ చేసింది, ఇది ఎలక్ట్రిక్ మోటారు నుంచి వచ్చే సౌండ్ కావచ్చు.

బైక్ పనితీరు ఎలా ఉంటుంది? 
ఈ బైక్, EV ఫన్ కాన్సెప్ట్‌కు చెందిన ప్రొడక్షన్ వెర్షన్ అయితే, దీనికి స్థిరమైన బ్యాటరీ సెటప్ ఉంటుంది. కంపెనీ ప్రకారం, దీని పనితీరు 500cc పెట్రోల్ బైక్‌తో సమానంగా ఉంటుంది. అంటే ఇది బుల్లెట్‌ వేగం & ఆక్సిలరేషన్‌ను ఇస్తుంది.

ఈ బైక్ రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ & ఇతర పనితీరును పెంచే సాంకేతికతల గురించి ఇంకా పూర్తిగా తెలీదు. అయితే, అన్ని అంశాల్లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. స్మూత్ టర్నింగ్ & మెరుగైన బ్రేకింగ్ కోసం చాలా కొత్త సాంకేతికతలను ఉపయోగించినట్లు గత సంవత్సరం EICMAలో, హోండా EV ఫన్ కాన్సెప్ట్‌లో ఈ కంపెనీ తెలిపింది.

ఛార్జింగ్ & బ్యాటరీ
ఈ బైక్‌లో CCS2 క్విక్ ఛార్జర్ ఉంది, ఇది కార్లలో ఉపయోగించే ఛార్జింగ్‌ సెటప్‌ను పోలి ఉంటుంది. అయితే, ఈ కొత్త బైక్‌ రైడింగ్‌ రేంజ్‌ & బ్యాటరీ సామర్థ్యం గురించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. లీక్స్‌ను బట్టి, సుదీర్ఘ రైడింగ్‌ రేంజ్‌ ఇచ్చేలా కంపెనీ ఈ బండిలో శక్తిమంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుందని భావిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
PM Modi in Somnath: గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
India vs New Zealand 1st ODI: కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
The Raja Saab Cast Fees : 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!

వీడియోలు

Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
MI vs DC WPL 2026 Highlights | ముంబై ఘన విజయం
Vaibhav Suryavanshi India vs Scotland U19 | వార్మప్ మ్యాచ్‌లో అదరొట్టిన వైభవ్!
India vs New Zealand 1st ODI Preview | నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
Virat Kohli Records Ind vs NZ | కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
PM Modi in Somnath: గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
India vs New Zealand 1st ODI: కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
The Raja Saab Cast Fees : 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
Cheapest Automatic 7 Seater Car: అతి చవకైన ఆటోమేటిక్ 7 సీటర్ కారు.. బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కొనేయండి
అతి చవకైన ఆటోమేటిక్ 7 సీటర్ కారు.. బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కొనేయండి
Pawan Kalyan : పవన్ కల్యాణ్ అరుదైన ఘనత - 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' టైటిల్... పవర్ స్టార్ రికార్డు హిస్టరీ
పవన్ కల్యాణ్ అరుదైన ఘనత - 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' టైటిల్... పవర్ స్టార్ రికార్డు హిస్టరీ
Rishabh Pant Ruled Out: వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్
వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్
Puri Sethupathi Movie Story : పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
Embed widget