అన్వేషించండి

Honda Elevate: కొత్త కారు కొనాలనుకుంటే సెప్టెంబర్ 4 వరకు ఆగండి - అదిరిపోయే కారు దించుతున్న హోండా!

హోండా ఎలివేట్ కారు త్వరలో మార్కెట్లో లాంచ్ కానుంది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

Honda Elevate Launch: హోండా తన సరికొత్త ఎస్‌యూవీ ఎలివేట్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీకి చెందిన రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇది ఇప్పటికే మార్కెట్లో అద్భుతమైన స్పందనను పొందుతోంది. దీని వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. హోండా ఎలివేట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 25,000 డౌన్‌పేమెంట్‌ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు దీన్ని ఆన్‌లైన్‌లో లేదా హోండా డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 4న లాంచ్
హోండా ఎలివేట్ అధికారిక ధరలు సెప్టెంబర్ 4వ తేదీన లాంచ్ సందర్భంగా వెల్లడికానున్నాయి. అయితే, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఎస్‌వీ, వీ, వీఎక్స్, జెడ్ఎక్స్ అనే నాలుగు విభిన్న ట్రిమ్‌లలో హోండా ఎలివేట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ రెండింటితో సహా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

హోండా ఎలివేట్ అడ్వాన్స్‌డ్ కంపాటిబిలిటీ ఇంజనీరింగ్ బాడీ ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది అధిక నాణ్యత గల స్టీల్‌తో తయారు అయినందున ఎక్కువ బలాన్ని అందిస్తుంది. దీని పొడవు 4,312 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1,790 మిల్లీమీటర్లు గానూ, ఎత్తు 1,650 మిల్లీమీటర్లు గానూ ఉంది. దీని వీల్‌బేస్ 2,650 మిల్లీమీటర్లుగా ఉండటం విశేషం. అలాగే ఇది 458 లీటర్ల భారీ బూట్ స్పేస్, ఆకర్షణీయమైన R17 అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.

ఫీచర్లు ఇలా?
ఎస్‌యూవీ వెలుపలి భాగంలో క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్స్, బాడీ క్లాడింగ్, వీల్ ఆర్చ్‌లు, సిల్వర్ ఫినిషింగ్‌తో కూడిన రూఫ్ రెయిల్‌లు వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు అందించారు. రియర్‌వ్యూ మిర్రర్‌లపై క్రోమ్ యాక్సెంట్‌లు, ఎల్ ఆకారపు టెయిల్ ల్యాంప్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. హోండా ఎలివేట్ అనేక ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్, మోనోటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డ్రైవర్ కోసం ఏడు అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అందించారు. ఇందులో సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. టాప్ వేరియంట్‌లో ఏడీఏఎస్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ లభిస్తాయి.

హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 6,600 ఆర్‌పీఎమ్ వద్ద 119 హార్స్‌పవర్, 4,300 ఆర్‌పీఎమ్ వద్ద 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా CVT ఆటోమేటిక్ ఎంపికను పొందుతుంది. దీని మాన్యువల్ వేరియంట్ లీటరు పెట్రోలుకు సుమారు 15 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ 16 కిలోమీటర్ల మైలేజిని పొందుతుంది.

వేటితో పోటీ ఉంటుంది?
ఈ ఎస్‌యూవీ లాంచ్ కానున్న సెగ్మెంట్‌లో మార్కెట్‌లో చాలా పోటీ ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. ధర రూ.11.80 లక్షలు.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే!
టాటా ఏరిస్ iCNG కొనబోతున్నారా? ముందు ఈ 2 మైనస్‌ల గురించి తప్పక తెలుసుకోండి
Tata Aeris CNG కారు కొనొచ్చా, లేదా? ప్లస్‌లు, మైనస్‌లు తెలిస్తే నిర్ణయం ఈజీ
నెలకు రూ.2500 EMIతో TVS Apache RTR 160 4V కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, లోన్‌ ఎంత వస్తుంది?
TVS Apache RTR 160 4V కొనడానికి రూ.25,000 ఉంటే చాలు, మిగిలిన డబ్బును బ్యాంక్‌ లోన్‌గా ఇస్తుంది!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget