అన్వేషించండి

GST తగ్గింపు తర్వాత Honda Amaze కొత్త ధర ఎంత? ఏ కార్లను ఛాలెంజ్ చేస్తుందో తెలుసా?

భారతదేశంలో కొత్త GST 2.0 రేటు అమలుతో, ADAS ఫీచర్లతో కూడిన హోండా అమేజ్ మరింత తక్కువ ధరలోకి మారింది. ఇది మారుతి డిజైర్‌కు టఫ్‌ ఫైట్‌ ఇస్తుంది.

Honda Amaze GST Price Cut: మన మార్కెట్‌లో, ADAS టెక్నాలజీతో వచ్చిన అత్యంత అందుబాటు ధర కారు 'హోండా అమేజ్', ఇప్పుడు ఇంకా అందుబాటులోకి వచ్చింది. కొత్త GST 2.0 రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత దీని ధరలు ₹1,20,000 వరకు తగ్గాయి. గతంలో ₹7,62,800 కి రిటైల్ జరిగిన బేస్ వేరియంట్ S MT (Old Gen) ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు కేవలం ₹6,97,700 మాత్రమే. ఈ కారు, మునుపటి ధరతో పోలిస్తే ఇప్పుడు నేరుగా ₹65,100 పొదుపు చేస్తుంది. 

ఇంటీరియర్‌లో ప్రీమియం & మోడ్రన్‌ టచ్
హోండా అమేజ్ క్యాబిన్ ఇప్పుడు ఎక్కువ ప్రీమియంగా అనిపిస్తుంది, మెరుగైన నాణ్యత ఉన్న విడిభాగాలను ఉపయోగించారు. కారు లోపలికి ఎక్కి కూర్చోగానే, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ & పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లను కూడా చూడవచ్చు, ఇవి కారును ఆధునికంగా & సౌకర్యవంతంగా ఉంచుతాయి. ఈ కారులో పెద్ద 420-లీటర్ బూట్ స్పేస్‌ ఉంది, తగినంత సామాను పెట్టుకోవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు
భారతదేశంలో, ADAS (హోండా సెన్సింగ్) సూట్‌తో వచ్చిన అత్యంత తక్కువ ధర కారు హోండా అమేజ్ అని చెప్పవచ్చు. లేన్-కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ & కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను ఇది అందిస్తుంది. అదనంగా, ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా & ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ ఉన్నాయి. ఇది, అత్యంత సురక్షితమైన సెడాన్‌లలో ఒకటి.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌
కొత్త హోండా అమేజ్ 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది, ఇది 89 bhp & 110 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్ ఇప్పుడు E20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. కస్టమర్లు 5-స్పీడ్ మాన్యువల్ & 7-స్టెప్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మధ్య ఒకదానిని ఎంచుకోవచ్చు. కొన్ని వేరియంట్‌లు ఇప్పటికీ 1.5-లీటర్ i-DTEC డీజిల్ ఇంజిన్‌ను అందిస్తున్నాయి, ఈ ఇంజిన్‌ 100 PS పవర్ & 200 Nm టార్క్‌ను ఇస్తుంది.

మైలేజ్
హోండా అమేజ్ మంచి మైలేజ్ రేటింగ్‌ సాధించింది. దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 18 నుంచి 19 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. పెట్రోల్ CVT వేరియంట్ లీటరుకు 18 నుంచి 24 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. డీజిల్ వేరియంట్ 24.7 కిలోమీటర్ల అత్యధిక మైలేజీని అందిస్తుంది. 

హోండా అమేజ్ పోటీ కార్లు
Maruti Dzire, Hyundai Aura & Tata Tigor వంటి కాంపాక్ట్ సెడాన్‌లతో హోండా అమేజ్ పోటీ పడుతుంది. ముఖ్యంగా, మారుతి డిజైర్ ధర ఇప్పుడు ₹87,700 వరకు తగ్గింది, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹6.25 లక్షలకు చేరుకుంది. ఈ రెండు కార్లు ఇప్పుడు డబ్బుకు తగిన విలువను అందిస్తున్నాయి. తత్ఫలితంగా, కాంపాక్ట్ సెడాన్ విభాగంలో కస్టమర్లకు ఇప్పుడు మరింత మెరుగైన ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Hiluxలో వచ్చిన మార్పులేంటి? పాత మోడల్‌తో పోలిస్తే కీలక తేడాలు ఇవే
2026 టయోటా హైలక్స్‌ vs పాత హైలక్స్‌.. డిజైన్‌ నుంచి ఫీచర్ల వరకు పూర్తిగా మారిందా?
2026 Tata Punch EV కి 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో టాప్‌ మార్కులు
ప్రయాణీకుల భద్రతలో మరోసారి టాటా పంచ్‌ EV సత్తా.. భారత్ NCAPలో 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌
E20 Petrol Effect on BS3 Vehicles: మీది E20 పెట్రోల్‌కు అనుకూలమైన వాహనమేనా? ప్రభుత్వం ఏం చెప్పింది? ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి?
మీది E20 పెట్రోల్‌కు అనుకూలమైన వాహనమేనా? ప్రభుత్వం ఏం చెప్పింది? ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి?
మహీంద్రా BE 6కు షాకింగ్‌ అప్‌డేట్స్‌.. మూడు స్క్రీన్‌లు, కొత్త డ్యాష్‌బోర్డ్‌తో మరింత స్టైలిష్‌
కొత్త ఇంటీరియర్‌తో రాబోతున్న Mahindra BE 6 - XEV 9e తరహా కీలక మార్పులు, మిస్‌ కావద్దు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget