అన్వేషించండి

చూడగానే ఆకట్టుకునే Honda 0 Alpha EV.. రెండు బ్యాటరీ ఆప్షన్లు, ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌తో రాబోతోంది!

హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV డిసెంబర్ 2న భారత్‌లో తొలిసారి పరిచయం కానుంది. బ్యాటరీ ఆప్షన్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్, ఇంటీరియర్, ప్రత్యర్థి కార్ల వివరాలు తెలుసుకోండి.

Honda 0 Alpha Electric SUV: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి మరో కొత్త SUV రాబోతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV ప్రొడక్షన్ వెర్షన్‌ను డిసెంబర్ 2న భారత్‌లో తొలిసారి ప్రదర్శించనుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో రూపొందించిన ఈ కారు, మన మార్కెట్‌లో ఈ కంపెనీకి తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం కానుంది. ఈ SUV కాన్సెప్ట్‌ను హోండా 2025 అక్టోబర్‌లో ప్రదర్శించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కారు తుది పేరును నవంబర్‌లో వెల్లడించే అవకాశం ఉంది.

ఇటీవల, ఈ SUV టెస్టింగ్‌ వెహికల్‌ భారతీయ రోడ్లపై కనిపించింది. అయితే, డిజైన్‌ లీక్‌ కాకుండా ఉండేందుకు ఈ కారును పూర్తిగా కవర్‌ చేసి (camouflaged) టెస్ట్‌ చేశారు. దీంతో ఈ బండి డిజైన్, ఫీచర్లపై మార్కెట్‌లో ఆసక్తి పెరిగింది.

హోండా 0 ఆల్ఫా బ్యాటరీ, రేంజ్ వివరాలేంటి?

ఈ ఎలక్ట్రిక్ SUVకి సంబంధించి పూర్తి సాంకేతిక వివరాలను హోండా ఇంకా వెల్లడించలేదు. అయితే ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ రెండు బ్యాటరీలు LFP కెమిస్ట్రీతో రూపొందే అవకాశం ఉంది. వీటి సామర్థ్యం 65kWh నుంచి 75kWh మధ్య ఉండొచ్చని అంచనా.

ప్రారంభంలో ఈ కారును సింగిల్ మోటార్ సెటప్‌తో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో ఫ్రంట్ వీల్ డ్రైవ్ వ్యవస్థ ఉండొచ్చని తెలుస్తోంది. అయితే మోటార్ పవర్, అధికారిక డ్రైవింగ్ రేంజ్, ఛార్జింగ్ సమయం వంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. వీటిపై స్పష్టత రావాలంటే కంపెనీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

డిజైన్‌లో ప్రత్యేకత ఇదే

హోండా 0 ఆల్ఫా SUV డిజైన్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హోండా కార్లకు భిన్నంగా ఉండనుంది. టెస్ట్ వెహికల్‌ ఫొటోలను పరిశీలిస్తే, కాన్సెప్ట్ మోడల్‌లోని ప్రత్యేక ఆకృతినే ప్రొడక్షన్ వెర్షన్‌లోనూ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఈ స్కూటర్‌ ఎక్కితే, కింద పడిపోతామనే భయం ఉండదు! స్టాండ్ అవసరం లేని BMW Vision CE ఎలక్ట్రిక్‌ స్కూటర్

ఈ SUV వెనుక భాగం దాదాపు నిలువుగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మందంగా ఉండే C-పిల్లర్ కారణంగా కారు వెనుక భాగం కొంతవరకు MPV తరహాలో కనిపిస్తుంది. వెనుకవైపు పెద్ద విండ్‌స్క్రీన్‌ను అందించే అవకాశం ఉంది. కింది భాగంలో బయటకు పొడుచుకొచ్చిన బంపర్‌తో పాటు డిఫ్యూజర్ తరహా డిజైన్ ఎలిమెంట్ ఉండొచ్చని అంచనా.

ముందు భాగంలో వెలిగే Honda లోగోను అందించే అవకాశం ఉంది. ఛార్జింగ్ పోర్టును కూడా ముందు భాగంలోనే ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన సమయంలోనే దాని డిజైన్ ప్రొడక్షన్ వెర్షన్‌కు దగ్గరగా ఉందని హోండా వెల్లడించింది.

ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్

గతంలో కనిపించిన టెస్ట్ వెహికల్‌ ద్వారా ఈ SUV ఇంటీరియర్‌కు సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. దాని కుడివైపు డ్రైవర్ కోసం చిన్న డిజిటల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది.

కారు లోపల 3-స్పోక్‌ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉండనుంది. ఇందులో ప్యాడిల్ షిఫ్టర్లు కూడా కనిపించాయి. సెంటర్ కన్సోల్‌పై పలు ఫిజికల్ బటన్లు ఉండే అవకాశం ఉంది. క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్ల వంటి ఫీచర్లను వీటి ద్వారా నియంత్రించవచ్చని అంచనా.

ఈ SUV వీల్‌బేస్ సుమారు 2,700 నుంచి 2,800mm మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. క్యాబిన్‌లో ఎక్కువ స్థలాన్ని అందించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు సమాచారం. నిలువుగా ఉండే టెయిల్‌గేట్ కారణంగా లగేజ్ పెట్టుకునేందుకు కూడా మంచి స్థలం లభించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌

భారత్‌లోనే తయారీ.. ప్రత్యర్థి కార్లు ఇవే

హోండా 0 ఆల్ఫా SUVని భారత్‌లోనే తయారు చేయనుంది. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్ ఈ వాహనం తయారీ కేంద్రంగా ఉండే అవకాశం ఉంది. స్థానికంగా ఉత్పత్తి చేయడం వల్ల భారత మార్కెట్‌కు అనుగుణంగా కారును అందించేందుకు కంపెనీకి అవకాశం ఉంటుంది.

మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఈ SUVకి గట్టి పోటీ ఎదురుకానుంది. మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా సియెర్రా EV, మారుతి e విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా వంటి ఎలక్ట్రిక్ SUVలు దీనికి ప్రత్యర్థులుగా నిలవనున్నాయి.

హోండా 0 ఆల్ఫా ధర, అధికారిక రేంజ్, పూర్తి ఫీచర్లు, అమ్మకాలు ప్రారంభమయ్యే తేదీపై ఇంకా స్పష్టత లేదు. డిసెంబర్ 2న జరిగే ప్రదర్శనలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

స్కోడా కైలాక్, కుషాక్, స్లావియాపై ఫెస్టివ్‌ డిస్కౌంట్లు.. ఏ కారు కొన్నా రూ.వేలల్లో ఆదా చేయొచ్చు!
స్కోడా కారు కొనేవాళ్లకు బంపర్‌ డిస్కౌంట్లు.. రూ.90,000 వరకు మిగులుతుంది!
విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ ఇకపై కార్లలోకీ వస్తుంది! 2027 నుంచి వెహికల్‌ సేఫ్టీ రూల్స్‌ మరింత కఠినం
కార్లలోనూ విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌.. ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది!
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
స్పోర్టీ లుక్‌తో వచ్చిన ఏప్రిలియా SXR GT 175 మ్యాక్సీ స్కూటర్.. ఇంజిన్‌, ఫీచర్లు, సౌకర్యం ఎలా ఉన్నాయి?
Aprilia SXR GT 175 ఫుల్‌ రివ్యూ.. ఈ బండిని కొనొచ్చా? ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rachamallu Siva Prasada Reddy : ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
YS Jagan Vs Sharmila: షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
Baththa Movie OTT : ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
Embed widget