అన్వేషించండి

Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Hero Vida VX2 Plus KKR Edition: ఐపీఎల్ 2026 సందర్భంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) థీమ్‌తో హీరో వీడా విఎక్స్2 ప్లస్ స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వీడా VX2 ప్లస్ KKR లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ విడుదల.
  • KKR టీమ్ రంగులతో, లోగోతో ప్రత్యేక డిజైన్.
  • ఒకసారి ఛార్జింగ్‌తో 142 కి.మీ. రేంజ్, 80 కి.మీ. వేగం.
  • స్మార్ట్ ఫీచర్లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ అందుబాటులో ఉన్నాయి.

Hero Vida VX2 Plus KKR Edition: హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం 'వీడా' (Vida), ఐపీఎల్ 2026 క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. కేకేఆర్ (Kolkata Knight Riders) అభిమానుల కోసం ప్రత్యేకంగా 'వీడా విఎక్స్2 ప్లస్ కేకేఆర్ లిమిటెడ్ ఎడిషన్'ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కేకేఆర్ జట్టు ఛాంపియన్ లెగసీ, ఫియర్ లెస్ స్పిరిట్ ఆధారంగా దీనిని డిజైన్ చేశారు. పీఎమ్ ఈ-డ్రైవ్ సబ్సిడీతో కలిపి ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.16 లక్షలుగా ఉంది. క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేలా దీనికి అదిరిపోయే లుక్ ఇచ్చారు.

రింకూ సింగ్, అజింక్య రహానే చేతుల మీదుగా..

కేకేఆర్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్, అజింక్య రహానే ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. జట్టు జెర్సీ రంగులను ప్రతిబింబించేలా 'నైట్ పర్పుల్' షేడ్, గోల్డ్ కలర్ కాంబినేషన్‌తో దీనిని ముస్తాబు చేశారు. స్కూటర్ ముందు భాగంలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ పైన కేకేఆర్ లోగో (Emblem) ఉంటుంది. దీనికి 'లిమిటెడ్ ఎడిషన్' బ్యాడ్జ్ కూడా ఇచ్చారు. బాడీపై ఉన్న గోల్డ్ కలర్ డీకాల్స్ కారుకు ప్రీమియం అప్పీల్ ఇస్తున్నాయి. సీటు కింద ఉండే స్టోరేజ్ ఏరియాలో పర్పుల్ హైలైట్స్ ఇవ్వడం విశేషం. ఈ లిమిటెడ్ ఎడిషన్ కేవలం ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

వీడా విఎక్స్2 ప్లస్ పెర్ఫార్మెన్స్

సాంకేతిక పరంగా చూస్తే ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 142 కిలోమీటర్ల (IDC రేంజ్) వరకు వెళ్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్ ఉండటం వల్ల ఛార్జింగ్ చేయడం చాలా సులభం. కేవలం 62 నిమిషాల్లోనే సున్నా నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇంట్లో ఉండే ఏసీ ఛార్జర్‌తో ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 4 గంటల 13 నిమిషాల సమయం పడుతుంది.

స్మార్ట్ ఫీచర్లు

ఈ స్కూటర్ లో 4.2-అంగుళాల టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లే అమర్చారు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, రియల్ టైమ్ ట్రిప్ అనాలిసిస్ వంటి కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎడ్జ్ ప్యాక్ (Edge Pack) సాయంతో కాల్స్, ఎస్ఎంఎస్, మ్యూజిక్ కంట్రోల్స్ కూడా పొందవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడే ఎస్ఓఎస్ (SOS) అలర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ ఫ్యాన్స్ రైడింగ్‌ను ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Frequently Asked Questions

వీడా విఎక్స్2 ప్లస్ కేకేఆర్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ ధర ఎంత?

పీఎమ్ ఈ-డ్రైవ్ సబ్సిడీతో కలిపి ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.16 లక్షలుగా ఉంది.

ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ప్రత్యేకత ఏమిటి?

కేకేఆర్ జట్టు జెర్సీ రంగులను ప్రతిబింబించేలా 'నైట్ పర్పుల్' షేడ్, గోల్డ్ కలర్ కాంబినేషన్‌తో దీనిని రూపొందించారు. ముందు భాగంలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ పైన కేకేఆర్ లోగో ఉంటుంది.

వీడా విఎక్స్2 ప్లస్ కేకేఆర్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ బ్యాటరీ ఎంతసేపు వస్తుంది?

ఒకసారి ఛార్జ్ చేస్తే 142 కిలోమీటర్ల (IDC రేంజ్) వరకు వెళ్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు.

ఈ స్కూటర్ ఎంత సమయంలో ఛార్జ్ అవుతుంది?

62 నిమిషాల్లోనే సున్నా నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇంట్లో ఉండే ఏసీ ఛార్జర్‌తో ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 4 గంటల 13 నిమిషాల సమయం పడుతుంది.

వీడా విఎక్స్2 ప్లస్ స్కూటర్‌లో ఏ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి?

4.2-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, రియల్ టైమ్ ట్రిప్ అనాలిసిస్, కాల్స్, ఎస్ఎంఎస్, మ్యూజిక్ కంట్రోల్స్, ఎస్ఓఎస్ అలర్ట్స్ వంటి కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget