Hero HF 100 బైక్‌పై గ్రేట్ ఆఫర్ - కేవలం ₹2,000 EMIతో ఇంటికి తీసుకెళ్లండి, ఈ దీపావళి వెలిగిపోతుంది
Hero HF 100 Finance Plan: 2025 GST సంస్కరణల తర్వాత హీరో HF 100 కొనుగోలు చేయడం గతంలో కంటే సులభంగా మారింది. ఈ బైక్ చవకగా రావడమే కాదు, EMI భారం కూడా తగ్గింది.

Hero HF 100 Diwali 2025 EMI Offer: మన గ్రామాల్లో చూసినా, పట్టణాలు & నగరాల్లో చూసినా.. ప్రతి చోటా హీరో HF 100 కనిపిస్తుంది. ఇది మన ప్రాంతంలో ఒక ప్రసిద్ధ కమ్యూటర్ బైక్. అంటే, రోజువారీ వినియోగానికి చక్కగా పని కొచ్చే టూవీలర్. ఈ బైక్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పాపులర్ అయింది. జీఎస్‌టీ (GST 2025) తగ్గింపు తర్వాత, హీరో HF 100 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 60,489 కు తగ్గింది. మీరు, ఈ కామన్ మ్యాన్ టూవీలర్‌ను కొనడానికి ఒకేసారి డబ్బు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు, EMI స్కీమ్‌లో నెలకు కొంచం కొంచం జమ చేయపచ్చు.
ఆన్-రోడ్ ధర
తెలుగు రాష్ట్రాల్లో, ఈ కమ్యూటర్ మోటర్ సైకిల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 76,000. ఇందులో, ఎక్స్-షోరూమ్ ధర రూ. 60,489 + రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాదాపు రూ. 8,800 + బీమా దాదాపు రూ. 6,200 కూడా ఉన్నాయి. ఈ ఆన్-రోడ్ ధర నగరం & డీలర్‌షిప్‌ను బట్టి కొద్దిగా మారవచ్చు.
లోన్ కోసం ఎంత డౌన్ పేమెంట్ అవసరం?
హీరో HF100 కొనడానికి, మీరు ₹15,000 డౌన్ పేమెంట్ చేసినా సరిపోతుంది. మిగిలిన ₹61,000 కోసం బైక్ లోన్ తీసుకోవాలి. బ్యాంక్, మీకు ఈ రుణాన్ని సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో ఇచ్చిందని అనుకుందాం. ఇప్పుడు, ఫైనాన్స్ ప్లాన్ చూద్దాం.
3 సంవత్సరాల్లో బైక్ లోన్ తీర్చేయాలనుకుంటే నెలకు రూ. 2,132 EMI చెల్లించాలి.
2 సంవత్సరాల్లో బైక్ లోన్ తీర్చేయాలనుకుంటే నెలకు రూ. 2,972 EMI చెల్లించాలి.
1 సంవత్సరాల్లో బైక్ లోన్ తీర్చేయాలనుకుంటే నెలకు రూ. 5,490 EMI చెల్లించాలి.
బైక్ లోన్, వడ్డీ రేటు వంటివి మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ విధానాలపై ఆధారపడి ఉంటాయి.
హీరో HF 100 ఫీచర్లు
హీరో HF 100 బైక్... 97.2 cc, 4 స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OHC ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 5.9 kW శక్తిని & 8.05 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ టూవీలర్ గరిష్ట వేగం గంటకు 90 km. ఈ బండి మొత్తం బరువు 110 కిలోలు. దీని పొడవు 1965 mm, వెడల్పు 720 mm & ఎత్తు 1045 mm. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm, వీల్ బేస్ 1235 mm & కర్బ్ ఎత్తు 805 mm. హీరో HF 100 లో ముందు & వెనుక 130 mm డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కుల ద్వారా సస్పెన్షన్ & వెనుక భాగంలో టు-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లతో స్వింగ్‌ఆర్మ్ ఉంది.
హీరో హెచ్ఎఫ్ 100 ఎంత మైలేజ్ ఇస్తుంది?
ఈ టూవీలర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9.1 లీటర్లు. కంపెనీ డేటా ప్రకారం, ఈ హీరో బైక్ లీటరుకు 70 km మైలేజీ ఇస్తుంది. ఈ లెక్కన, ట్యాంక్ ఫుల్ చేస్తే 630 కిలోమీటర్లు వెళ్లిపోవచ్చు.
హీరో HF 100... బజాజ్ CT 100, TVS స్పోర్ట్, TVS రేడియన్ & హోండా షైన్ 100 వంటి ఎంట్రీ లెవల్ 100 cc కమ్యూటర్ బైక్‌లతో పోటీ పడుతుంది.





















