అన్వేషించండి

E85తో పరుగులు పెట్టే హీరో బైక్‌లు బాగా చౌక! భారీ తగ్గింపుతో బంపర్ ఆఫర్!

హీరో మోటోకార్ప్ తన కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ Splendor Plus, HF Deluxe బైక్‌లపై డిస్కౌంట్ ప్రకటించింది. E20 నుంచి E85 వరకు ఉండే ఇంధన రకాలతో నడిచే ఈ బైక్‌లపై ఈ ఆఫర్ జులై వరకు అందుబాటులో ఉంటుంది.

Hero Flex Fuel Bike Discount: భారత ఆటోమొబైల్ రంగంలో ఇథనాల్ ఆధారిత ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్న వేళ, హీరో మోటోకార్ప్ కూడా ఫ్లెక్స్‌ ఫ్యూయల్ టెక్నాలజీపై దూసుకెళ్తోంది. E85 ఇంధనానికి అనుకూలంగా రూపొందించిన Splendor Plus Flex, HF Deluxe Flex మోడళ్లను ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చిన హీరో, ఇప్పుడు ఈ బైక్‌లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

కంపెనీ ప్రకటించిన తాజా ఆఫర్ ప్రకారం, రెండు మోడళ్లపై రూ.4,000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ల ధరలు మరింత ఆకర్షణీయంగా మారాయి.

స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ధర ఎంత?

డిస్కౌంట్ తర్వాత హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఎక్స్‌షోరూమ్ ధర (Hero Splendor Plus Flex Price) రూ.78,710 గా నిర్ణయించారు. సాధారణ E20 కంప్లైంట్ స్ప్లెండర్ ప్లస్‌తో పోలిస్తే ఈ మోడల్ ధర కేవలం రూ.1,153 మాత్రమే ఎక్కువ.

ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ, అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ధర వ్యత్యాసం చాలా తక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ మరింత చౌక

హీరో అందిస్తున్న మరో ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్. డిస్కౌంట్ తర్వాత ఈ బైక్ ధర (Hero HF Deluxe Flex Price) రూ.68,792 కు చేరింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ధర సాధారణ E20 కంప్లైంట్ HF Deluxe i3S Cast వేరియంట్ కంటే రూ.1,650 తక్కువగానే ఉంది. దీంతో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన బైక్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.

ఈ ఆఫర్స్‌ ఎప్పటి వరకు?

హీరో ప్రకటించిన ఈ ప్రత్యేక డిస్కౌంట్ వచ్చే నెల (జులై 2026‌) ముగింపు వరకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభ దశలో ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈ బైక్‌ల విక్రయాలు ప్రారంభమవుతాయి. అనంతరం దేశవ్యాప్తంగా ఇతర మార్కెట్లలో కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

E20 నుంచి E85 వరకు నడిచే ఇంజిన్

ఈ రెండు బైక్‌ల్లోనూ హీరోకు చెందిన విశ్వసనీయమైన 97.2 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ బిగించారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ అవసరాలకు అనుగుణంగా ఈ ఇంజిన్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. ఈ ఇంజిన్ E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమం ఉన్న ఇంధనంతో పనిచేస్తుంది. E85 మోడ్‌లో ఈ ఇంజిన్ 8.6 hp పవర్ & 8.3 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ప్రత్యేకంగా చేసిన మార్పులు

అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో సాఫీగా పనిచేయడానికి హీరో కొన్ని కీలక మార్పులు చేసింది. వాటిలో ప్రధాన మార్పులు:

* కొత్త ECU కాలిబ్రేషన్
* అప్‌గ్రేడ్ చేసిన ఫ్యూయల్ పంప్
* సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్
* మెరుగైన ఫ్యూయల్ సిస్టమ్ భాగాలు

హీరో అందిస్తున్న రూ.4,000 డిస్కౌంట్ ఆఫర్, ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ కొనాలనుకునే వారికి మంచి అవకాశంగా మారింది. ముఖ్యంగా స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్ వంటి మైలేజ్ బైక్‌లలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వినియోగదారుల్లో ఆసక్తి పెంచుతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget