అన్వేషించండి

Hero Destini 125 కొనాలా? వద్దా? - కొనే ముందే తెలియాల్సిన ప్లస్‌లు, మైనస్‌లు

Hero Destini 125 స్కూటర్‌లో కంఫర్ట్‌, మైలేజ్‌ బలంగా ఉన్నా, ఇంజిన్‌ రిఫైన్‌మెంట్‌, బూట్‌ స్పేస్‌ విషయంలో లోపాలున్నాయి. కొనుగోలు ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు.

Hero Destini 125 review: భారతదేశంలో ఫ్యామిలీ స్కూటర్‌ అనగానే.... మైలేజ్‌, కంఫర్ట్‌, నమ్మకమైన బ్రాండ్‌ అన్నవి ప్రధానంగా గుర్తుకు వస్తాయి. ఇదే సెగ్మెంట్‌లో హీరో మోటోకార్ప్‌ నుంచి వచ్చిన Hero Destini 125 తాజాగా టాప్‌ టు బాటమ్‌ అప్‌డేట్‌తో మార్కెట్లోకి వచ్చింది. సుజుకి యాక్సెస్‌ (Suzuki Access), టీవీఎస్‌ జూపిటర్‌ (TVS Jupiter) లాంటి బలమైన ప్రత్యర్థులతో పోటీ పడుతున్న ఈ స్కూటర్‌ నిజంగా కొనదగ్గదా? లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

కొనడానికి కారణం 1: అద్భుతమైన కంఫర్ట్‌

హీరో అంటేనే కంఫర్ట్‌ అనే పేరు ఉంది. Destini 125 కూడా అదే పంథాలో సాగింది. సీటు చాలా మందంగా, సాఫ్ట్‌గా ఉండటంతో ఇద్దరు పెద్దవాళ్లు సులభంగా కూర్చోగలరు. రోజూ ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకు, కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఈ సీటింగ్‌ చాలా ఉపయోగపడుతుంది.

సస్పెన్షన్‌ సెటప్‌ కూడా మన రోడ్ల పరిస్థితులకు బాగా సరిపోతుంది. గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లు ఎదురైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. ముఖ్యంగా వయసు మీదపడిన వారు లేదా మహిళలు ప్రయాణించినప్పుడు ఈ కంఫర్ట్‌ స్పష్టంగా అనిపిస్తుంది.

కొనడానికి కారణం 2: ఆకట్టుకునే మైలేజ్‌

125cc స్కూటర్‌ అంటే మైలేజ్‌ విషయంలో కొంత రాజీ పడాల్సిందే అనుకుంటారు చాలామంది. కానీ Destini 125 ఈ విషయంలో ఆశ్చర్యపరుస్తుంది. హీరో కంపెనీ క్లెయిమ్‌ ప్రకారం ఇది 60 kmpl వరకు మైలేజ్‌ ఇస్తుంది. వాస్తవ వినియోగంలో కూడా సుమారు 55 kmpl వరకు రాబట్టగలగడం దీని పెద్ద ప్లస్‌ పాయింట్‌.

మన దేశంలో పెట్రోల్‌ ధరలు ఆకాశంలో ఉన్న ఈ సమయంలో, రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది ఖర్చు తగ్గించే అంశం అవుతుంది.

కొనకుండా వదిలేయడానికి కారణం 1: స్టాప్‌ స్టార్ట్‌ సిస్టమ్‌, ఇంజిన్‌ రిఫైన్‌మెంట్‌

Destini 125లో హీరో అందించిన i3s స్టాప్‌/స్టార్ట్‌ సిస్టమ్‌ మైలేజ్‌కు సహాయపడుతుంది. కానీ సిగ్నల్‌ వద్ద ఆగిన తర్వాత ఇంజిన్‌ మళ్లీ స్టార్ట్‌ కావడానికి 3-4 సెకన్లు పడటం నగర ట్రాఫిక్‌లో చిరాకు తెప్పించవచ్చు.

ఇంకా, ఇంజిన్‌ రిఫైన్‌మెంట్‌ విషయంలో హీరో కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సుజుకి యాక్సెస్‌తో పోల్చితే ఇంజిన్‌ శబ్దం, స్మూత్‌నెస్‌ అంత స్థాయిలో అనిపించదు.

కొనకుండా వదిలేయడానికి కారణం 2: చిన్న బూట్‌ స్పేస్‌

ఈ రోజుల్లో చాలా పెట్రోల్‌ స్కూటర్లు సుమారు 25 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌ ఇస్తున్నాయి. కానీ Destini 125లో మాత్రం కేవలం 19 లీటర్ల బూట్‌ స్పేస్‌ మాత్రమే ఉంది.

హెల్మెట్‌, చిన్న బ్యాగ్‌ పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ వినియోగంలో స్కూటర్‌ కొనేటప్పుడు బూట్‌ స్పేస్‌ కీలకం కావడంతో, ఇది పెద్ద మైనస్‌గా మారుతుంది.

మీకు కంఫర్ట్‌, మైలేజ్‌ ప్రధానంగా కావాలంటే Hero Destini 125 ఒక మంచి ఎంపిక. కానీ రిఫైన్‌మెంట్‌, ఎక్కువ బూట్‌ స్పేస్‌ కోరుకునేవారు అయితే ఇతర స్కూటర్లను కూడా పోల్చుకుని చూడటం మంచిది. కొనుగోలు చేసే ముందు టెస్ట్‌ రైడ్‌ తప్పనిసరిగా చేయడం ఉత్తమ నిర్ణయం అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget