New Cars Launching in May: మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేసేందుకు 4 కొత్త కార్లు రెడీ, కొంచం వెయిట్ చేస్తే మీకే బెనిఫిట్!
Upcoming Cars in May 2025: MG మోటార్, టాటా మోటార్స్, కియా, వోక్స్‌వ్యాగన్ వంటి పెద్ద కంపెనీలు ఈ నెలలో కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నాయి. కొంచం ఓపిక పడితే అది మీకే బెనిఫిట్ కావచ్చు.

Upcoming Cars In May 2025 In India: మీ పాత కారును కొత్త కారుతో రీప్లేస్ చేయాలని భావిస్తున్నా లేదా కొత్త కారును కొనాలని ప్లాన్ చేస్తున్నా మే 2025 మీకు మంచి ఆఫర్స్/ ఆప్షన్స్ అందించబోతోంది. ఈ నెలలో కియా, టాటా మోటార్స్, ఎంజీ మోటార్, వోక్స్‌వ్యాగన్ వంటి పెద్ద బ్రాండ్లు తమ కొత్త మోడళ్లను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నాయి.
అప్‌కమింగ్ ట్రాక్ మీద కొత్త MPV, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, లాంగ్ రేంజ్ EV & స్పోర్టీ GTI సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోర్ వీలర్ల లాంచింగ్ డేట్, ఇంజిన్ & ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. కియా క్లావిస్ (Kia Clavis)
కియా ఇండియా, తన పాపులర్ MPV కారెన్స్ (Carens)లో Clavis పేరుతో కొత్త వెర్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కారు డిజైన్‌ను మే 8, 2025న ఆవిష్కరించనున్నారు. ధరను జూన్ 2, 2025న వెల్లడిస్తారు. ఈ కొత్త MPVలో లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్‌లు, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ కన్సోల్ & పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. క్లావిస్ మూడు ఇంజిన్ ఆప్షన్స్‌తో లాంచ్ అవుతుంది, అవి - పెట్రోల్ ఇంజిన్, టర్బో పెట్రోల్ ఇంజిన్ & డీజిల్ ఇంజిన్. ఇది అటు ఫ్యామిలీ కస్టమర్లకు & ఇటు ఫీచర్-లవింగ్ కస్టమర్లకు అట్రాక్టివ్ ఆప్షన్ అవుతుంది.
2. టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ (2025 Tata Altroz Facelift)
టాటా ఆల్ట్రోజ్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఇప్పటికే భారతీయ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాబోతోంది, అది 21 మే 2025న లాంచ్ కానుంది. 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ & అప్‌డేటెడ్ ఇంటీరియర్‌తో పాటు చాలా కొత్త ఫీచర్లతో లాంచ్ అవుతుంది. మన దేశంలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో వచ్చే ఏకైక హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్. డబ్బుకు తగిన మైలేజీ (మెరుగైన ఇంధన సామర్థ్యం) కోరుకునే కస్టమర్లకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
3. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ (Volkswagen Golf GTI)
వోక్స్‌వ్యాగన్ నుంచి రెండో GTI ఆఫరింగ్ 'గోల్ఫ్ GTI' త్వరలో తెలుగు రాష్ట్రాల రోడ్లపై పరుగులు తీయవచ్చు. ఈ వెహికల్ లాంచ్ డేట్‌ను ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ, ఈ కారు మే 2025లో మార్కెట్లోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. గోల్ఫ్ GTI మోడల్ 261 bhp & 370 Nm టార్క్ జనరేట్ చేసే 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. స్పోర్టీ హ్యాండ్లింగ్, శక్తిమంతమైన పనితీరు & ప్రీమియం డిజైన్ కోరుకునే కస్టమర్ల కోసం ఈ కారు ఆకర్షణీయంగా ఉంటుంది.
4. MG విండ్సర్ EV లాంగ్ రేంజ్ వెర్షన్ (MG Windsor EV Long Range)
MG విండ్సర్ EV కూడా ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో జోరు చూపిస్తోంది. ఇప్పుడు ఈ వాహనం లాంగ్ రేంజ్ వెర్షన్ కూడా విడుదలకు కంపెనీ అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంది. కొత్త వేరియంట్‌లో 50.6 kWh బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 460 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అంటే, లాంగ్ రేంజ్ వెర్షన్ స్టీరింగ్ మీ చేతిలో ఉంటే ఛార్జింగ్ గురించి చింతించకుండా దూర ప్రయాణాలు చేయవచ్చు. లాంగ్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే కస్టమర్లను MG మోటార్ టార్గెట్ చేస్తోంది.





















