Honda New Cars: మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైన హోండా - అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కొత్త కార్లు రానున్నాయ్!
Honda Upcoming Cars: హోండా ఇండియా త్వరలో భారతదేశంలో కొత్త EV & హైబ్రిడ్ కార్‌లను లాంచ్ చేయబోతోంది. 22 KMPL మైలేజ్, 6 ఎయిర్ బ్యాగులు & అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కొత్త కార్లు రాబోతున్నాయి.

Honda Electric SUV And Upcoming Cars 2025: హోండా ఇండియా, ఇండియన్ కార్ మార్కెట్‌ను షేక్ చేయడానికి ఇప్పుడు పూర్తి సన్నద్ధతతో ఉంది. 1998లో, హోండా సిటీ సెడాన్ ఫస్ట్ జనరేషన్ లాంచ్ చేసి మార్కెట్‌లో హీట్ సృష్టించిన హోండా, ఆ తర్వాత కూడా వివిధ మోడళ్లతో అదే ఊపును కంటిన్యూ చేసింది. గత కొన్ని నెలలుగా హోండా కార్ల అమ్మకాలు పెరిగాయి. అదే ఉత్సాహంతో హోండా ఇప్పుడు అనేక కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ & హైబ్రిడ్ విభాగంలో కొత్త కార్‌లు తీసుకొచ్చి, ఆ సెగ్మెంట్లలోనూ తన ఉనికిని బలంగా చాటబోతోంది. హోండా తీసుకురానున్న కొత్త మోడళ్ల లిస్ట్‌లో 'హోండా ఎలివేట్ EV' & 'న్యూ జనరేషన్ హోండా సిటీ' ఉన్నాయి.
హోండా ఎలివేట్ ఈవీ
హోండా ఎలివేట్ ఈవీ (Honda Elevate EV) ఈ కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) అవుతుంది, దీనిని 2026 ప్రథమార్థంలో భారతదేశంలో విడుదల చేయవచ్చు. ఈ SUV డిజైన్ ప్రస్తుత ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వెర్షన్‌ను పోలి ఉంటుందని సమాచారం. క్లోజ్డ్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ & ఫ్యూచరిస్టిక్ టచ్ వంటి EV-స్పెసిఫైడ్ డిజైన్‌తో ఈ కార్ తయారవుతోంది.
బ్యాటరీ & రేంజ్
హోండా కొత్త ఎలక్ట్రిక్ SUV కి 40 kWh నుంచి 60 kWh బ్యాటరీ ప్యాక్‌ను యాడ్ చేస్తారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోర్‌వీలర్ 400 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వగలదని తెలుస్తోంది. ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) సిస్టమ్‌తో ఈ కార్ లాంచ్ కావచ్చు.
హోండా ఎలివేట్ EV ఫీచర్లు
హోండా ఎలివేట్ EV ఫీచర్ల విషయానికి వస్తే... 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు & 360 డిగ్రీస్ పార్కింగ్ కెమెరా ఉండవచ్చు. ఈ కారు, ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ Kona EV & Tata Curvv EV వంటి ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీ ఇవ్వగలదు.
న్యూ-జెన్ హోండా సిటీ
తన పాపులర్ సెడాన్ మోడల్ 'సిటీ'కి ఎక్స్‌టెన్షన్‌గా, నెక్ట్ జనరేషన్ వెర్షన్ (New-gen Honda City Sedan) విడుదల చేయడానికి కూడా హోండా సన్నాహాలు చేస్తోంది, దీనిని 2025 చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఈ కారు పెట్రోల్ & హైబ్రిడ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
న్యూ-జెన్ హోండా సిటీ మైలేజ్
ఈ కొత్త హోండా సిటీ 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ & e:HEV హైబ్రిడ్ సిస్టమ్ ఆప్షన్లతో యూజర్లకు అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 18 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని సమాచారం. హైబ్రిడ్ వెర్షన్ 22 కిలోమీటర్లకు పైగా కవర్ చేయగలదు. ప్రయాణీకుల భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), లేన్ అసిస్ట్ & బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లను యాడ్ చేశారు. ఇంకా.. కార్ క్యాబిన్‌లో పెద్ద టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ & ప్రీమియం అప్‌హోల్‌స్టెరీ వంటి మోడర్న్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నారు. కొత్త జనరేషన్ హోండా సిటీ, సెడాన్ విభాగంలో Hyundai Verna & Skoda Slavia వంటి కార్లకు టైట్ కాంపిటీషన్ ఇవ్వగలదని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.





















