అన్వేషించండి

Lamborghini: 3 సెకన్లలో 100km, వందే భారత్‌ కంటే డబుల్‌ స్పీడ్‌ - దీనిలో కూర్చుంటే 'ఫైటర్ జెట్‌'లో కూర్చున్నట్లే

Lamborghini Temerario Supercar: లంబోర్గిని, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హైబ్రిడ్ సూపర్‌కార్‌ను భారతదేశంలో లాంచ్‌ చేసింది, ఈ కార్‌లో డ్రిఫ్ట్ మోడ్‌ను మొదటిసారిగా పరిచయం చేసింది.

Lamborghini Temerario Price And Features: ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్లను తయారు చేసే లంబోర్గిని, తన Huracan సిరీస్‌ ఎక్స్‌టెన్షన్‌ మోడల్‌ 'టెమెరారియో'ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇది అత్యధిక పనితీరును ప్రదర్శించే హైబ్రిడ్ సూపర్‌కార్. లంబోర్గిని కార్‌లలో అమర్చే శక్తిమంతమైన ఇంజిన్ & అడ్వాన్స్‌డ్‌ ఫీచర్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ పాపులారిటీ వేరే లెవెల్‌లో ఉంటుంది. కోట్లు విలువైన లాంబోర్గిని కార్‌లను సంపన్నులు మాత్రమే భరించగరు, ఈ బ్రాండ్‌ను తమ గరాజ్‌లో పార్క్‌ చేశామని గర్వంగా చెప్పుకుంటారు. లాంబోర్గిని ఉండడం హోదాకు చిహ్నంగా భావిస్తారు.

నిజానికి, టెమెరారియో అంతర్జాతీయ మార్కెట్లో 9 నెలల క్రితమే లాంచ్‌ అయింది & ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర (Lamborghini Temerario Ex-show room price) దాదాపు రూ. 6 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. టెమెరారియో అనేది లంబోర్గిని పాపులర్‌ Huracan సిరీస్‌కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్. 

గరిష్ట వేగం ఎంత? 
ఈ సూపర్ కారులో 4-లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ ఉంది, ఇది 800 bhp పవర్‌ను & 730 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ టెక్నాలజీతో, ఇది 920 hp పవర్‌ను & 800 న్యూటన్ మీటర్ల టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. కారు గరిష్ట వేగం గంటకు 342 కిలోమీటర్లు. 

మొదటిసారి డ్రిఫ్ట్ మోడ్
మొదటిసారిగా, హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు డ్రిఫ్ట్ మోడ్ ఫీచర్‌ను లంబోర్గిని టెమెరారియోతో తీసుకొచ్చారు. డ్రైవర్లు కార్‌ మీద సంపూర్ణ నియంత్రణతో స్టైలిష్ స్లయిడ్స్‌ చేసేందుకు డ్రిఫ్ట్ మోడ్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఈ లంబోర్గిని కారులో 13 డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి, వీటిలో నాలుగు స్టాండర్డ్‌ డ్రైవ్ మోడ్స్‌ ఉన్నాయి - మొదటిది సిట్టా, ఇది ఎలక్ట్రిక్ మోడ్ మాత్రమే. రెండోది స్ట్రాడా, ఇది డైలీ డ్రైవ్ కోసం. మూడోది స్పోర్ట్, ఇది హై స్పీడ్ కోసం. నాలుగోది కోర్సా, ఇది రేస్ ట్రాక్ కోసం. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే - ముందు భాగంలో 410mm డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో 390mm డిస్క్ బ్రేక్‌లను ఏర్పాటు చేశారు. ఇవి కారును కేవలం 32 మీటర్లలోనే 100 కిలోమీటర్ల వేగం నుంచి 0 కిలోమీటర్ల వేగానికి తీసుకురాగలవు.

స్టైలిష్ & లైట్‌ వెయిట్‌ డిజైన్
టెమెరారియో డిజైన్ చాలా స్టైలిష్‌గా & లైట్‌ వెయిట్‌తో ఉంటుంది. ఈ మోడల్‌ను పూర్తిగా అల్యూమినియం ఫ్రేమ్‌తో డిజైన్‌ చేశారు, దీని బరువు కేవలం 1,715 కిలోలు మాత్రమే. అల్లెగ్గెరిటా ప్యాకేజీతో ఈ బరువు 1,690 కిలోలకు తగ్గుతుంది. కార్బన్ ఫైబర్ రియర్ వింగ్, స్పెషల్‌ అల్లాయ్ వీల్స్ & కొత్త బంపర్‌ను ఈ అప్‌డేటెడ్‌ మోడల్‌లో అందిస్తున్నారు. Huracan & Gallardo స్ఫూర్తితో దీనిని డిజైన్‌ చేశారు.

టెక్నాలజీ & ఫీచర్లు
కారు క్యాబిన్‌ ఫైటర్ జెట్ (యుద్ధ విమానం) లాగా కనిపిస్తుంది. ఇందులో 12.3-అంగుళాల డిజిటల్ క్లస్టర్, 8.4-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ & 9.1-అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే అందించారు.  హీటింగ్‌ & వెంటిలేషన్‌తో 18-వే పవర్ అడ్జస్టబుల్ సీట్స్‌ ఏర్పాటు చేశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్, ఆన్‌బోర్డ్ టెలిమెట్రీ & డాష్‌క్యామ్ కూడా ఉన్నాయి. 6.5 అడుగుల ఎత్తున్న డ్రైవర్ కూడా ఇందులో హాయిగా కూర్చోవచ్చు. షార్క్-నోస్ ఫ్రంట్ ఫాసియా, లోయర్ లిప్ స్పాయిలర్, ఫిజికల్ బటన్లతో మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌ దీని ప్రత్యేకతలు.

ఫెరారీ & మెక్‌లారెన్‌తో పోటీ
భారతదేశ మార్కెట్‌లో, ఈ సూపర్ కారు Ferrari 296 GTB & McLaren Artura కు కాంపిటీషన్‌ ఇస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!
టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!
మారుతి, హ్యుందాయ్‌ బాటలోనే టాటా.. సెప్టెంబర్‌ నుంచి ధరల మోత

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Embed widget