Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్‌ను చవగ్గా కొనే ఫైనాన్షియల్ ప్లాన్ - డౌన్‌పేమెంట్, EMI ఎంతవుతుంది?
Toyota Fortuner Base Model: టయోటా ఫార్చ్యూనర్‌లో చవకైన మోడల్ 4x2 పెట్రోల్ వేరియంట్. ఈ కారును లోన్ తీసుకుని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఏ టెన్యూర్ ఆప్షన్‌లో ఎంత EMI కట్టాలో ముందు తెలుసుకోవాలి.

Buying Toyota Fortuner Base Model Down Payment and EMI: టయోటా ఫార్చ్యూనర్ అంటే టఫ్ మోడల్ మాత్రమే కాదు, స్టేటస్ సింబల్ కూడా. ఈ భారీ కార్‌లో తిరిగితే వచ్చే కిక్కే వేరబ్బా. టయోటా ఫార్చ్యూనర్ 7 సీట్ల కారు, దీని ఎక్స్-షోరూమ్ ధర (Toyota Fortuner ex-showroom price) రూ. 35 లక్షల 37 వేల (బేస్ మోడల్) నుంచి ప్రారంభమై రూ. 51 లక్షల 94 వేల వరకు (హై-ఎండ్ మోడల్) ఉంటుంది. ఈ కారు పెట్రోల్ & డీజిల్ రెండు వేరియంట్లలోనూ మార్కెట్లో అందుబాటులో ఉంది, మీకు ఇష్టమైన ఫ్యూయల్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.
టయోటా ఫార్చ్యూనర్ బేస్ మోడల్ "4x2 పెట్రోల్ వేరియంట్" (Toyota Fortuner 4x2 petrol base model). మీరు ఈ 7 సీట్ల టయోటా కారును చవగ్గా తీసుకోవాలనుకుంటే, బేస్ వేరియంట్ కొనవచ్చు. మీరు పూర్తి ధర ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు, మీకు బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో, టయోటా ఫార్చ్యూనర్ బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర (Toyota Fortuner Base Model On-Road Price) రూ. 43.99 లక్షలు. దీనిలో, ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్ (TRO) ఖర్చులు రూ. 6,61,660, బీమా (Insurance) రూ. 1,64,002, ఇతర ఛార్జీలు రూ. 36,370 కలిసి ఉన్నాయి.
బ్యాంక్ లోన్ కోసం ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?
టయోటా ఫార్చ్యూనర్‌ను బ్యాంక్ లోన్‌పై కొనడానికి మీరు రూ. 5 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఇంత కంటే ఎక్కువ డబ్బును కూడా డౌన్ పేమెంట్ చేయవచ్చు, దీనివల్ల మీ EMI తగ్గుతుంది. మీరు రూ. 5 లక్షలు డౌన్ పేమెంట్ చేశారని అనుకుందాం, మిగిలిన రూ. 39 లక్షలు మీకు లోన్‌గా లభిస్తాయి. బ్యాంక్ 9.5 శాతం వడ్డీ రేటుతో ఈ రుణం మంజూరు చేసిందని అనుకుందాం.
9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం....
- నాలుగు సంవత్సరాల (48 నెలలు) కాల పరిమితితో మీరు రూ. 39 లక్షలు రుణం తీసుకుంటే, 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం, ప్రతి నెలా రూ. 97,980 EMI చెల్లించాలి.
- ఐదు సంవత్సరాల టెన్యూర్‌తో (60 నెలలు) లోన్ తీసుకుంటే, నెలనెలా రూ. 81,907 బ్యాంక్‌లో జమ చేయాలి.
- ఆరు సంవత్సరాల కాలానికి (72 నెలలు) రుణం మంజూరు అయితే, EMI రూ. 71,271 అవుతుంది.
- ఏడు సంవత్సరాల కాల పరిమితితో (84 నెలలు) రుణం తీసుకుంటే, నెలకు రూ. 63,742 బ్యాంక్‌కు కట్టాలి.
మీ సిబిల్ స్కోర్ భేషుగ్గా ఉండి, బ్యాంక్ ఆఫర్ కూడా కలిసి మీకు 9 శాతం వడ్డీతో రూ. 39 లక్షల లోన్ మంజూరు అయితే, EMI లెక్క ఇది:
9 శాతం వడ్డీ రేటు ప్రకారం....
- నాలుగు సంవత్సరాల (48 నెలలు) కాల పరిమితికి 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, ప్రతి నెలా రూ. 97,052 EMI చెల్లించాలి.
- ఐదు సంవత్సరాల టెన్యూర్‌తో (60 నెలలు) లోన్ తీసుకుంటే, నెలనెలా రూ. 80,958 బ్యాంక్‌లో జమ చేయాలి.
- ఆరు సంవత్సరాల కాలానికి (72 నెలలు) రుణం మంజూరు అయితే, EMI రూ. 70,300 అవుతుంది.
- ఏడు సంవత్సరాల కాల పరిమితితో (84 నెలలు) రుణం తీసుకుంటే, నెలకు రూ. 62,747 బ్యాంక్‌కు కట్టాలి.
టయోటా ఫార్చ్యూనర్ కొనడానికి లోన్ తీసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవాలి. మీ సిబిల్ స్కోర్, వివిధ బ్యాంక్‌ల విధానాల ప్రకారం వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చు.





















