Tesla Upcoming Car: టెస్లా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ త్వరలో రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Tesla Car Teaser: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల నిర్వహించిన ఆటోమేకర్స్ 2023 వార్షిక సమావేశంలో భవిష్యత్తులో రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాల గురించి సమాచారం ఇచ్చారు. టెస్లా కొత్త డిజైన్ కారుపై పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ రెండు వాహనాలు సాంకేతికత పరంగా ప్రస్తుతం ఉన్న వాహనాల కంటే మెరుగ్గా ఉంటాయి. ఎలాన్ మస్క్ ఈ వాహనాల గురించి సమాచారం ఇస్తున్న సమయంలోనే అతని వెనుక స్క్రీన్‌పై ఒక వాహనం టీజర్ ప్రొజెక్ట్ చేశారు. ఇది హ్యాచ్‌బ్యాక్ అని భావిస్తున్నారు. దీని గురించి ఎలాన్ మస్క్ కొంతకాలం క్రితమే ప్రకటించారు.
ఎలాన్ మస్క్ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి బిల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించారు. దీని కారణంగా ఎలాన్ మస్క్ కంపెనీ ప్రస్తుతం ప్రొడక్షన్ వెర్షన్‌ను సిద్ధం చేయడం ద్వారా ప్రోటోటైప్‌ను సిద్ధం చేస్తుందని భావిస్తున్నారు.
మార్చిలో ఇన్వెస్టర్ డే సందర్భంగా కంపెనీ లైనప్‌లోని అన్ని వాహనాలతో పాటు రెండు కొత్త మోడళ్ల ఫోటోలను విడుదల చేయడం ద్వారా టెస్లా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో ఒక వాహనం డిజైన్ వ్యాన్ ఆకారంలో ఉంటుంది. మరొకటి సెడాన్ లేదా హ్యాచ్‌బ్యాక్ వంటిది. ఈ రెండు వాహనాలు చాలా పొదుపుగా ఉంటాయని భావిస్తున్నారు. తద్వారా కంపెనీ గరిష్ట యూనిట్లను విక్రయించగలదు. ఎలాన్ మస్క్ తెలుపుతున్న దాని ప్రకారం ఈ రెండు వాహనాలు ప్రతి సంవత్సరం ఐదు మిలియన్ యూనిట్లు తయారయ్యే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్ డే సందర్భంగా మెక్సికోలో గిగాను నిర్మించడానికి టెస్లా ఒక ప్రకటన కూడా చేసింది. టెస్లా అభిమానులు ‘మోడల్ 2’ అని పిలిచే ఈ ఫ్యాక్టరీలో కంపెనీ హ్యాచ్‌బ్యాక్ వాహనాలను ఉత్పత్తి చేస్తుందని ఊహాగానాలు చేస్తున్నారు. ఇంకో వాహనం రోబోటాక్సీ కావచ్చు. ఎలాన్ మస్క్ దీని గురించి ఇప్పటికే చర్చించారు. టెస్లా పూర్తి స్వీయ-డ్రైవింగ్‌కు దాదాపు దగ్గరగా ఉందని మస్క్ చాలాసార్లు పునరుద్ఘాటించారు.
ఇటీవలే న్యూజెర్సీలో టెస్లా లైట్ షో ‘నాటు నాటు’ పాటతో దుమ్మురేపింది. ఈ పాటకు లయబద్దంగా కార్ల లైట్లు వెలిగిస్తూ, ఆర్పేస్తూ ఆకట్టుకున్నారు. నాటు పాటకు సింక్ అయ్యేలా లైట్స్ వేస్తూ అదుర్స్ అనిపించారు. అక్కడున్న వాళ్లంతా పాటకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ లైట్ షో వీడియోను ‘RRR’ టీమ్ ఇన్ స్టాలో షేర్ చేసింది.
టెస్లా లైట్ షో ‘నాటు నాటు’ పాటతో హోరెత్తడంపై ఆ కంపెనీ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు. ‘RRR’ ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ మేరకు రెండు లవ్ ఎమోజీలను పెట్టారు. మస్క్ స్పందనపై ‘RRR’ టీమ్ స్పందించింది. ఆయన ట్వీట్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది. మీకు మా ప్రేమను చెల్లిస్తున్నామంటూ ట్వీట్ చేసింది.
అటు టెస్లా కంపెనీ సైతం ఈ లైట్ షోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసింది. దీపావళి పండుగ సృష్టించేందుకు ఒకే సమయంలో లెక్కకు మిక్కిలి వాహనాలతో లైట్ షో షెడ్యూల్ చేశామని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Read Also: దేశీయ మార్కెట్లోకి సరికొత్త BMW X1 లాంచ్, ధర రూ.45.90 లక్షల నుంచి షురూ!