అన్వేషించండి

Myths About Fuel Saving: ఇలా చేస్తే మైలేజీ పెరుగుతుందని ఎవరైనా చెప్పారా? - అస్సలు నమ్మకండి!

Fuel Saving Myths: కారు మైలేజీ విషయంలో మనం ఎన్నో టిప్స్ వినే ఉంటాం. కానీ వాటిలో కొన్ని అపోహలు కూడా ఉంటాయి.

Fuel Saving: కారు ఎక్కువగా ఉపయోగించేవాళ్లు దాని విషయంలో ఆలోచించే విషయాల్లో మైలేజీ ముందంజలో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మైలేజీ సాధించగలిగితే తక్కువ పెట్రోలు ఖర్చవుతుంది. దాని ద్వారా మన జేబుకు పడే చిల్లు తక్కువగా ఉంటుంది. కాబట్టి మైలేజీ పెంచడానికి మనం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం. ఇలా చేస్తే మైలేజీ ఎక్కువ వస్తుంది? అలా చేస్తే మైలేజీ ఎక్కువ వస్తుంది? లాంటి విషయాలు మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. వీటిలో కొన్ని మాత్రమే నిజాలు ఉంటాయి. కొన్ని ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కానీ అవి బాగా జనాల్లోకి వెళ్లిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం.

ట్యాంక్ ఫుల్‌గా ఉండాలి...
కారు కానీ, బైక్ కానీ ట్యాంక్ ఫుల్‌గా ఉంటే పెట్రోల్/డీజిల్ ఆవిరి అయిపోకుండా ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మోడర్న్ కార్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ కూడా అందిస్తున్నారు. దీని వల్ల ఇంధనం ఆవిరి కాకుండా ఉంటుంది.

పెట్రోల్/డీజిల్ పొద్దున్న పూట పట్టించాలి...
ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇంధనం కాస్త చిక్కగా (ఎక్కువ డెన్సిటీతో) ఉంటుందని, దాని కారణంగా తెల్లవారు జామున పట్టిస్తే కాస్త ఎక్కువ క్వాంటిటీ వచ్చే అవకాశం ఉంటుందని కొందరు అపోహ పడతారు. కానీ నిజానికి పెట్రోల్/డీజిల్‌ను అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. అక్కడ ఉష్ణోగ్రత నిలకడగా ఉంటుంది.

ఎయిర్ ఫిల్టర్లను రెగ్యులర్‌గా మారుస్తూ ఉండాలి...
ఇది ఒకప్పుడు మంచి మైలేజీని అందిస్తుందేమో కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే పాత కార్లలో ఫిల్టర్ అయిన గాలి కార్బరేటర్లలోకి వెళ్లేది. కాబట్టి మైలేజీ పైన ఎయిర్ ఫిల్టర్ ప్రభావం చూపించేది. కానీ ప్రస్తుతం ఇంజిన్లలో ఫ్యూయల్ ఇంజక్టర్లు, ఇతర టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. ఇది ఎయిర్ టు ఫ్యూయల్ రేషియోను జాగ్రత్తగా రెగ్యులేట్ చేస్తుంది. ఓక్రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న వాహనాల్లో దుమ్ము పట్టిన ఎయిర్ ఫిల్టర్లు మైలేజీపై ప్రభావం చూపించబోవని తెలిపాయి. కానీ దాని కారణంగా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

టైర్లలో గాలి ఎక్కువగా ఉండాలి...
ఇది కూడా అపోహనే. ఎందుకంటే కారు తయారీ దారు కంపెనీ సూచించిన దాని కంటే గాలి ఎక్కువ పెట్టిస్తే అది  టైరు రోడ్డుకు తాకే చోట‘కాంటాక్ట్ ప్యాచ్’ను తగ్గిస్తుంది. అంటే ట్రాక్షన్ కూడా తగ్గుతుందన్న మాట. దీని వల్ల బ్రేకింగ్ డిస్టెన్స్ పెరుగుతుంది. అలాగే టైర్లు కూడా ఎక్కువగా అరిగిపోయే అవకాశం ఉంది. అలాగే మైలేజీ కూడా తగ్గుతుంది.

ఇంజిన్ ఆయిల్ తరచుగా మారుస్తూ ఉండాలి...
ఇంజిన్ ఆయిల్ మార్చడం వల్ల మైలేజీ పెరుగుతుంది అనేది పూర్తిగా నిజం కాదు. కారును మెయింటెయిన్ చేయడానికి ఇంజిన్ ఆయిల్ మార్చడం ముఖ్యమే కానీ దాని కారణంగా మైలేజీ ఎక్కువగా పెరుగుతుందని ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మహా అయితే మీ మైలేజీ రెండు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అది కూడా కారు తయారు చేసిన కంపెనీ తెలిపిన గ్రేడ్ ఆయిల్ ఉపయోగించినప్పుడు మాత్రమే.

ఫ్యూయల్ ఎకనమైజర్లు వాడుతున్నారా?
కొంతమంది ఎక్కువ మైలేజీ కోసం ఫ్యూయల్ ఎకనమైజర్లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వీటి కారణంగా ఉపయోగం ఉండదని తేల్చి చెప్పింది. 100కు పైగా ఫ్యూయల్ ఎకనమైజర్ ఉత్పత్తులను ఉపయోగించాక కూడా మైలేజీ పెరిగినట్లు కనిపించలేదని ఎఫ్‌టీసీ తెలిపింది.

Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!

Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. 204cc ఇంజిన్‌, 26.5hp పవర్‌.. Yamaha R2 రేటెంతో తెలుసా?
సూపర్‌స్పోర్ట్‌ బైక్‌ Yamaha R2 మార్కెట్‌లోకి వచ్చేసింది - 204cc ఇంజిన్‌తో రచ్చ రచ్చ
యమహా R15 V4 బైక్ లోన్ ఆఫర్లు: ఎంత డౌన్‌పేమెంట్ కడితే నెలకు ఎంత EMI పడుతుంది? పూర్తి క్యాలిక్యులేషన్‌!
Yamaha R15 V4 EMI Plan: కేవలం రూ.3,189 EMI & తక్కువ డౌన్‌పేమెంట్.. వివరాలు ఇవిగో!
TATA Cars: టాటా మోటార్స్, TATA.CARSగా మారనుందా? పూర్తి వివరాలు ఇవే!
టాటా మోటార్స్, TATA.CARSగా మారనుందా? పూర్తి వివరాలు ఇవే!
పాత కారు అమ్మి కొత్తది కొనాలా? లేక, పాత కారును కొత్త కారుతో ఎక్సేంజ్‌ చేయాలా? స్పిన్నీలో చాలా ఆప్షన్లు
సెకండ్‌హ్యాండ్‌ కారు అమ్మేవాళ్లకు, కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌.. స్పిన్నీలో మరిన్ని ఆప్షన్లు!

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Petrol, LPG Price Hike:పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
NCLT: ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
Embed widget