అన్వేషించండి

Diwali Car Offers: ఈసారి కారు ఆఫర్లు టెమ్ట్‌ చేస్తున్నాయా? ముందుగా ఈ 4 పాయింట్లు మిస్‌ అయితే పశ్చాత్తాపం తప్పదు

Car Buying Tips India: ఈ పండుగ సీజన్‌లో కారు కొనే ముందు, ఆఫర్లపై మాత్రమే దృష్టి పెట్టకండి. కొన్ని విషయాలను బాగా అర్ధం చేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి, లేకపోతే పశ్చాత్తాపం తప్పదు.

Diwali 2025 Discounts For Cars: భారతదేశంలో, దసరా & దీపావళి పండుగ సమయం ఎప్పుడూ పీక్‌ షాపింగ్ సీజన్‌. ఈ సమయంలో, అన్ని కంపెనీలతో పాటు, కారు కంపెనీలు & డీలర్లు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, సులభమైన రుణ పథకాలు & చాలా పండుగ ఆఫర్లు ప్రకటిస్తారు. అలాంటి టెమ్టింగ్‌ స్కీమ్‌లు చూసిన తర్వాత, చాలా మంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు & తర్వాత చింతిస్తారు. మీరు కూడా ఫెస్టివ్‌ సీజన్‌లో కారు కొనాలని ఆలోచిస్తుంటే, డిస్కౌంట్ లేదా ఇతర ఆఫర్లను చూసి మాత్రమే కారును ఎంచుకోకండి. మిస్‌ కాకుండా తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి.

కారు కొనే ముందు 4 ముఖ్యమైన విషయాలు

ముందు మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోండి
కారు కొనడానికి ముందు అతి ముఖ్యమైన దశ మీ బడ్జెట్‌ను స్పష్టంగా నిర్ణయించుకోవడం. చాలాసార్లు, ఆకర్షణీయమైన ఆఫర్‌లను చూసిన తర్వాత ప్రజలు తమ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. తర్వాత పెద్ద మొత్తం EMI చెల్లించలేక ఇబ్బంది పడతారు. కారు ఆన్-రోడ్ ధర మాత్రమే కాకుండా... బీమా, ఇంధనం, సర్వీస్ & నిర్వహణ వంటి పునరావృత ఖర్చులను కూడా మీరు అర్ధం చేసుకోవాలి. పండుగ డిస్కౌంట్ల కారణంగా ప్రారంభ ధర ఖచ్చితంగా తగ్గవచ్చు, కానీ దీర్ఘకాలిక ఖర్చులు అలాగే ఉంటాయి. కాబట్టి, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోండి.

మెరుగైన డీల్ పొందడానికి ఆఫర్లను ఎలా పోల్చాలి?
పండుగ సీజన్‌లో, దాదాపు ప్రతి కారు కంపెనీ & డీలర్ వేర్వేరు స్కీములు అందిస్తారు. కొన్నిసార్లు క్యాష్ డిస్కౌంట్‌లను అందిస్తారు, మరికొన్నిసార్లు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లేదా సీట్ కవర్లు & ఇన్ఫోటైన్‌మెంట్ అప్‌గ్రేడ్‌లు వంటి ఉచిత ఉపకరణాలను అందిస్తారు. కొందరు డీలర్లు వారంటీ పొడిగింపును ఉచితంగా అందిస్తారు. ఈ పరిస్థితిలో మొదటి ఆఫర్ చూసిన వెంటనే డీల్‌ ఖరారు చేయడం తెలివైన పని కాదు. వేర్వేరు షోరూమ్‌లకు వెళ్లడం, సరిపోల్చుకోవడం, బేరం చేయడం & ఎక్కడ ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నారో అర్ధం చేసుకోవడం మంచిది. కొన్నిసార్లు, మీ నగరంలోని డీలర్ల కంటే సమీప నగరాల్లోని డీలర్లు మెరుగైన డిస్కౌంట్లు అందించవచ్చు.

భద్రత విషయంలో రాజీ పడకండి
ఇప్పటికీ చాలా మంది ప్రజలు కారు సేఫ్టీ ఫీచర్లపై శ్రద్ధ చూపడం లేదు, ఇది మీ కుటుంబానికి చాలా ముఖ్యమైన విషయం. కారు కొనుగోలు చేసేటప్పుడు, కనీసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBDతో కూడిన ABS & రియర్‌ పార్కింగ్ సెన్సార్ వంటి లక్షణాల కోసం చూడండి. గ్లోబల్ NCAP రేటింగ్‌పై కూడా దృష్టి పెట్టండి, ఇది కారు భద్రతకు నిజమైన కొలమానం. చాలా కంపెనీలు పండుగల సమయంలో స్పెషల్ ఎడిషన్ కార్లను కూడా విడుదల చేస్తాయి, ఇవి మెరుగైన డిజైన్ & ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉండటమే కాకుండా మరిన్ని సేఫ్టీ ఫీచర్లతోనూ వస్తాయి.

లోన్ & EMI ఎంపికలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం
పండుగ సీజన్‌లో, బ్యాంకులు & నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) కారు కంపెనీలతో కలిసి ఆకర్షణీయమైన రుణ పథకాలను తీసుకువస్తాయి. తక్కువ వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు & ఫ్లెక్సిబుల్ EMI పథకాలు వంటివి ఆఫర్‌ చేస్తాయి. కొన్ని బ్యాంకులు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తాయి. కాబట్టి, ఒకే ఆఫర్‌ను చూసి లోన్‌ తీసుకోవడం సరైన నిర్ణయం అవ్వదు. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చండి. ఎందుకంటే, కేవలం 0.5 శాతం తేడా కూడా దీర్ఘకాలంలో వేల రూపాయలు ఆదా చేస్తుంది. అంతేకాదు, మొదటి కొన్ని నెలలు EMIలను వాయిదా వేసే స్కీములను కూడా ఎంచుకోవద్దు, వీటివల్ల వడ్డీ భారం పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget