అన్వేషించండి

మెర్సిడెస్‌ నుంచి రేంజ్‌ రోవర్‌ వరకు - దిశా పటానీ లగ్జరీ కార్ల కలెక్షన్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!

బాలీవుడ్‌ నటి దిశా పటానీకి లగ్జరీ కార్లపై ఎంత ఇష్టం ఉందో తెలుసా? ఆమె గ్యారేజ్‌లో ఉన్న ఖరీదైన, లగ్జరీ కార్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Disha Patani Car Collection: బాలీవుడ్‌ సెలబ్రిటీలంటే సినిమాలే కాదు, వారి లైఫ్‌స్టైల్‌, ముఖ్యంగా ఖరీదైన కార్ల కలెక్షన్‌ కూడా ఫ్యాన్స్‌కు పెద్ద ఆసక్తే. అలాంటి యువ కథానాయికల్లో దిశా పటానీ ఒకరు. అందం, నటనతో పాటు లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల దిశా గ్యారేజ్‌లో చేరిన కొత్త కార్లతో ఆమె కార్ల కలెక్షన్‌ మరింత ఆకట్టుకునేలా మారింది.

దిశా పటానీ సినిమాల్లో ఎంత గ్లామర్‌గా కనిపిస్తుందో, ఆమె గ్యారేజ్‌లో ఉన్న కార్లు కూడా అంతే స్టైలిష్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఆమె వద్ద ఉన్న ప్రధానమైన లగ్జరీ కార్ల వివరాలు ఇవి.

రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ

దిశా పటానీ కార్ల కలెక్షన్‌లో మొదటిగా చెప్పుకోవాల్సింది రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ. ఇది ఆమెకు చాలా ఇష్టమైన SUVగా చెబుతారు. మ్యాట్‌ బ్లాక్‌ కస్టమైజ్డ్‌ పెయింట్‌లో ఈ కారు మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇందులో ఉన్న 3.0 లీటర్‌ P400 ఇంజీనియమ్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో వస్తుంది. ఇది 394 hp శక్తి, 550 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో అన్ని చక్రాలకు శక్తి చేరుతుంది. కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. భారత్‌లో దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర కోట్లలో ఉంటుంది.

మెర్సిడెస్‌ బెంజ్‌ S450

దిశా గ్యారేజ్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ S-క్లాస్‌ S450 కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీకి ప్రతీకగా నిలిచిన ఈ కారు సెలబ్రిటీలకు మొదటి ఎంపికగా ఉంటుంది. ఇందులో 3.0 లీటర్‌ 6 సిలిండర్‌ M256 పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. 48V మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌తో ఇది 362 hp శక్తి, 500 Nm టార్క్‌ను అందిస్తుంది. 4MATIC‌ ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌తో ఇది సూపర్‌ స్మూత్‌ డ్రైవింగ్‌ అనుభూతిని ఇస్తుంది. అంతర్గతంగా ఇది గల్జరీకి మరో పేరు.

BMW i7 ఎలక్ట్రిక్‌ కారు

పర్యావరణానికి అనుకూలంగా ఉండే BMW i7 ఎలక్ట్రిక్‌ కారు కూడా దిశా పటానీ కలెక్షన్‌లో ఉంది. ఇది BMW నుంచి వచ్చే ఫ్లాగ్‌షిప్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌. ఇందులో 101.7 kWh బ్యాటరీ ఉంటుంది. డ్యుయల్‌ మోటార్‌ సెటప్‌తో AWD సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. మొత్తం 544 hp శక్తి, 745 Nm టార్క్‌ ఇస్తుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ ఇస్తుంది. కేవలం 4.7 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది.

రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌

దిశా పటానీ మొదట్లో కొనుగోలు చేసిన లగ్జరీ SUVల్లో రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ ఒకటి. ఇందులో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 300 hp శక్తి, 400 Nm టార్క్‌ను ఇస్తుంది. 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, AWD సిస్టమ్‌తో ఇది స్టైల్‌, పనితీరు రెండింటినీ కలిపిస్తుంది.

మొత్తానికి, దిశా పటానీ కార్ల కలెక్షన్‌ ఆమె స్టార్‌ స్టేటస్‌ను స్పష్టంగా చూపిస్తుంది. లగ్జరీ, పవర్‌, టెక్నాలజీ అన్నీ కలిసిన కార్లు ఆమె గ్యారేజ్‌లో కనిపిస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Scorpio N, Tata Safari, XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల పూర్తి పోలిక!
Scorpio N వర్సెస్‌ Tata Safari వర్సెస్‌ XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీకు ఏది బెస్ట్?
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
Rodent Attacks: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? రూ.వేల రిపేర్‌ ఖర్చు తప్పించుకోవాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!
కారు ఇంజిన్‌లోకి ఎలుకలు వెళ్తున్నాయా? స్ప్రే నుంచి స్టీల్ మెష్ వరకు.. రక్షణకు 5 మార్గాలు!
Child Seat Mounts: ఫ్యామిలీ కార్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలోనే కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చే కార్ల లిస్ట్‌
కారు ప్రయాణంలో మీ పిల్లల భద్రతకు భరోసా.. తక్కువ ధరలోనే 6 ఎయిర్‌బ్యాగ్స్, ISOFIX ఉన్న కార్లు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ACB Raids: అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
Ramayana Collections : రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
Embed widget