Citroen 2024 Cars: వచ్చే సంవత్సరం మరిన్ని కార్లతో రానున్న సిట్రోయెన్ - మెల్లగా పుంజుకుంటున్న కంపెనీ!
Upcoming Citroen Cars: ప్రముఖ చైనీస్ కార్ల బ్రాండ్ సిట్రోయెన్ 2024లో అనేక కార్లను మార్కెట్లో లాంచ్ చేయనుంది.
Citroen in 2024: 2023 సంవత్సరం చైనీస్ కార్ల కంపెనీ సిట్రోయెన్‌కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంవత్సరం కంపెనీ ఈసీ3, సీ3 ఎయిర్‌క్రాస్ వంటి కార్లను విడుదల చేసింది. 2024లో సీ3ఎక్స్ హై రైడింగ్ సెడాన్, ఆల్ ఎలక్ట్రిక్ ఈసీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని లాంచ్ చేయాలని మరియు సీ3 హాచ్‌బ్యాక్, సీ3 ఎయిర్‌క్రాస్ కోసం 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేయాలని కంపెనీ ఆలోచిస్తోంది.
సిట్రోయెన్ సీ3, సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్స్
సిట్రోయెన్ భారతదేశంలోని సీ3 హ్యాచ్‌బ్యాక్, సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీల్లో ఐసిన్ సోర్స్డ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లను తీసుకురావచ్చు. ఇది సిట్రోయెన్ భారతీయ పోర్ట్‌ఫోలియోలోని ముఖ్యమైన ఖాళీలను పూరించడంలో కంపెనీకి సహాయపడుతుంది. టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఇప్పటికే ఉన్న 110 హెచ్‌పీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అధునాతన మూడో తరం మోడల్‌తో పెయిర్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని సిట్రోయెన్ స్థానికంగా, మనదేశంలోనే తయారు చేయనుంది.
సిట్రోయెన్ సీ3ఎక్స్
భారతదేశంలో సిట్రోయెన్ ఐదో ఆఫర్ మిడ్ సైజ్ సెడాన్ సీ3ఎక్స్. ఇది ఫాస్ట్‌బ్యాక్ స్టైల్, మరింత గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. అయితే ధర, సైజు పరంగా ఇది హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్ట్యూస్ తక్కువ వేరియంట్‌లతో పోటీపడుతుంది. ఈ కారు హై రైడింగ్, ఫాస్ట్‌బ్యాక్ సెడాన్ సెగ్మెంట్‌లో త్వరలో రానున్న టాటా కర్వ్‌తో పోటీపడుతుంది.
భారీగా లోకలైజ్ అయిన కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (సీఎంపీ) ఆధారంగా సీ3ఎక్స్ కూడా సీ3, ఈసీ3, సీ3 ఎయిర్‌క్రాస్‌ల తరహాలో అనేక ఫీచర్లను పొందే అవకాశం ఉంది. ఇది 110 హెచ్‌పీ 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తర్వాత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని 2024 చివరి నాటికి లాంచ్ చేయవచ్చు.
సిట్రోయెన్ ఈసీ3 ఎయిర్‌క్రాస్
2024 ముగిసేలోపు సిట్రోయెన్ ఈసీ3 ఎయిర్‌క్రాస్‌ను కూడా కంపెనీ మార్కెట్లోకి తీసుకురావచ్చు. ఇది ఇటీవల విడుదలైన సీ3 ఎయిర్‌క్రాస్ ఎలక్ట్రిక్ మోడల్. సాధారణ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొంది సీ3 ఎయిర్‌క్రాస్ ఎలక్ట్రిక్ వెర్షన్ దాని పెద్ద సైజు, బరువు కారణంగా పెద్ద బ్యాటరీ, మోటారు ఆప్షన్‌ను పొందవచ్చు. ప్రస్తుతం ఈసీ3 హ్యాచ్‌బ్యాక్‌లో 29.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 57 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ ఉండనుంది. పెట్రోల్ మోడల్ లాగానే ఈసీ3 ఎయిర్‌క్రాస్‌ను ఐదు, ఏడు సీట్ల లేఅవుట్‌లలో లాంచ్ చేసే అవకాశం ఉంది. భారతదేశంలో సిట్రోయెన్ బ్రాండ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లో రోడ్లపై విరివిగా సిట్రోయెన్ కార్లను చూడవచ్చు. సిట్రోయెన్ సరిగ్గా అడుగులు వేస్తే మనదేశంలో మంచి మార్కెట్‌ను సంపాదించే అవకాశం ఉంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!