అన్వేషించండి

Citroen Aircross vs Honda Elevate - ₹14 లక్షల్లో రిటైర్డ్ ఆఫీసర్లకు హుందాగా ఉండే SUV ఏది?

Best SUVs India: సిటీ డ్రైవింగ్‌ & అప్పుడప్పుడు లాంగ్ ట్రావెల్స్ కోసం ₹14 లక్షల బడ్జెట్‌లో రిటైర్డ్ ఆఫీసర్లకు Citroen Aircross, Honda Elevateలో ఏ SUV బెస్ట్? - పూర్తి వివరణ.

Citroen Aircross vs Honda Elevate Comparison: సిటీ రోడ్లపై రోజువారీ ప్రయాణాలు చేసుకుంటూ, అవసరమైతే అప్పుడుప్పుడు దూర ప్రయాణాలకు వెళ్లేందుకు సరిపోయే SUV కోసం చూస్తున్న రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఎక్కువగా Citroen Aircross & Honda Elevate మోడళ్లను ఎంచుకుంటున్నారు. అయితే, ఈ రెండింటి మధ్య ఏది కొనాలన్న విషయంలో కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. ఈ రెండు కార్లు తమవైన ప్రత్యేకతలతో మార్కెట్లో జెండా ఎగరేశాయి. అయితే... వాడకంలో సౌలభ్యం, ఇంజిన్‌ పనితీరు, ప్రయాణ సౌకర్యం, నిర్వహణ, భవిష్యత్‌ విలువ వంటి విషయాలలో ఏ SUV మరింత సమర్థవంతంగా ఉంటుందో, ఆ కారును ఎంచుకోవడం తెలివైన పని.

ఇంజిన్‌ పనితీరు - సిటీకి ఏది సూట్?
సిటీ ట్రాఫిక్‌లో ఆగుతూ, పోతూ నడిపే సందర్భాల్లో వాహనం సాఫ్ట్‌గా కదలాలి, శబ్దం లేకుండా నడవాలి. Honda Elevateలో ఉన్న 1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ ఈ విషయంలో చాలా మెరుగ్గా పనిచేస్తుంది. యాక్సిలేటర్‌ను సున్నతంగా నొక్కగానే అందించే స్పందన మృదువుగా ఉంటుంది. రద్దీ రోడ్లలో వినియోగించే ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టమ్‌ మరింత సౌకర్యంగా ఉంటుంది. వాహనం వేగంలోని చిన్నపాటి మార్పులకు సైతం సాఫ్ట్‌గా స్పందించడం వల్ల, రిటైర్డ్‌ ఉద్యోగులు/ పెద్దవారికి ఈ కారు మరింత అనుకూలంగా ఉంటుంది.

Honda Elevate తో పోలిస్తే Citroen Aircross ఇంజిన్‌ కూడా నాణ్యమే అయినా, వేగం పెంచే సమయంలో ఇవ్వాల్సిన బలం కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. దాంతో సిటీ వాడకం ఉన్నవారికి Elevate ఇచ్చే తేలికపాటి, ఇబ్బంది లేని ప్రయాణం స్పష్టంగా బెటర్‌గా ఉంటుంది.

ప్రయాణ సౌకర్యం & రైడ్‌ క్వాలిటీ
Citroen Aircrossలో మృదువైన సస్పెన్షన్‌ ఉండడం వలన రోడ్డు గుంతలు, చిన్న చిన్న బంప్స్‌ ఉన్నా కూడా చాలా సాఫ్ట్‌గా ప్రయాణం సాగుతుంది. ఇదే ఈ వాహనానికి ఉన్న ప్రధాన మెరుగైన లక్షణం. కానీ Honda Elevateలో సస్పెన్షన్‌ కొంచెం కట్టుదిట్టంగా ఉండడం వలన అన్ని రోడ్లపై స్థిరత్వాన్ని ఇస్తుంది. సిటీ రోడ్లు, వంతెనలు, సర్వీస్‌ రోడ్లు - ఎక్కడ నడిపినా ఒక సురక్షిత అనుభూతి వస్తుంది. అప్పుడప్పుడు దూర ప్రయాణాలకు వెళ్లే వారికి ఈ స్థిరత్వం మరింత నమ్మకాన్ని అందిస్తుంది.

దూర ప్రయాణాలు - ఏ కారు మేలు?
సెలవుల్లో లేదా అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే Honda Elevate మరింత విశ్వసనీయంగా ఉంటుంది. ఎక్కువ వేగంతో నడిపినా వాహనం చాలా స్థిరంగా ఉంటుంది. స్టీరింగ్‌ వ్యవస్థ చేతికి బలం ఇచ్చినట్లు కచ్చితత్వంతో పని చేస్తుంది, వాహనం ఒణుకుతున్న భావన రాదు. Aircross కూడా మంచి ప్రయాణ సౌకర్యం ఇస్తుంది కానీ హైవే స్థిరత్వంలో Elevate మించినది కాదు.

ఫీచర్లు & ప్రాక్టికల్‌గా ఉపయోగకరమైన అంశాలు
Honda Elevateలో వినియోగదారులకు పనికొచ్చే అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. పార్కింగ్‌ సౌలభ్యం కోసం కెమెరా, పెద్ద తెరతో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, సేఫ్టీ ఫీచర్లు.. అన్నీ ప్రాక్టికల్‌గా పనికొస్తాయి. Citroen Aircrossలో కూడా ప్రయోజనకరమైన ఫీచర్లు ఉన్నప్పటికీ, కొన్ని వేరియంట్లలో కొన్ని ముఖ్యమైన అంశాలు మిస్సవుతాయి. పెద్ద వయస్సు డ్రైవర్లకు వేగంగా గమనించగలిగే, సులభంగా అందుకునే సెట్టింగులు ముఖ్యమైనవి, ఈ విషయంలో Honda స్పష్టంగా మెరుగ్గా ఉంటుంది.

సర్వీస్‌ సౌకర్యం & నిర్వహణ
Honda అనేది భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా విశ్వసనీయత సంపాదించిన బ్రాండ్. దాని సర్వీస్‌ సెంటర్లు విస్తృతంగా ఉన్నాయి, నిర్వహణ ఖర్చులు కూడా అంచనా వేసుకోగలిగే విధంగా ఉంటాయి. Citroen కొత్త బ్రాండ్ కావడంతో దాని సర్వీస్‌ సెంటర్ల సంఖ్య తక్కువగా ఉంది. అందువల్ల, గ్రామీణ ప్రాంతాల్లో లేదా చిన్న పట్టణాల్లో ఇది సమస్యగా మారే అవకాశం ఉంటుంది. తక్కువ ఇబ్బందులతో ఉపయోగించాలనుకునే వారికి Honda Elevate ఈ విషయంలో కూడా మెరుగైన ఎంపిక.

భవిష్యత్‌ విలువ
Honda వాహనాలు సెకండ్‌ హ్యాండ్‌ అమ్మకాల మార్కెట్లో మంచి విలువను నిలబెట్టుకుంటాయి. Citroen వాహనాలకు రీసేల్‌ విలువ అంత బలంగా ఉండదు. రిటైర్డ్‌ యూజర్లకు భవిష్యత్‌ విలువ కూడా చాలా ముఖ్యం.

ఫైనల్‌ నిర్ణయం
₹14 లక్షల బడ్జెట్‌లో, సిటీ డ్రైవింగ్‌తో పాటు అకేషనల్‌గా దూర ప్రయాణాలు చేసే రిటైర్డ్‌ ఉద్యోగులు/ సీనియర్‌ సిటిజన్లకు Honda Elevate అత్యుత్తమ ఎంపిక. సాఫ్ట్ ఇంజిన్‌, సిటీకి చక్కగా సరిపడే ఆటోమేటిక్‌ గేర్ సిస్టమ్‌, స్థిరమైన ప్రయాణ సౌకర్యం, విస్తృతంగా ఉన్న సర్వీస్‌ సెంటర్లు, మంచి రీసేల్‌ వాల్యూ - ఈ వాహనాన్ని మరింత నమ్మదగిన కారుగా నిలబెడతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!
గత నెల రోజుల్లో మిడిల్‌క్లాస్‌ వాళ్లు ఎక్కువగా కొన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget