అన్వేషించండి

Hypersonic Aeroplane: ప్రపంచంలో ఎక్కడికైనా గంటలోనే.. 2025 నాటికి చైనా హైపర్‌సోనిక్ ఫ్లైట్.. దీని ప్రత్యేకతలు ఇవే!

గంటకు ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ విమానాన్ని చైనాకు చెందిన ఒక కంపెనీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా విమానాలు గంటకు 740 నుంచి 930 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే చైనాకు చెందిన స్పేస్ ట్రాన్స్‌పొర్టేషన్ అనే కంపెనీ గంటలకు ఏడువేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ ప్లేన్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా కేవలం గంటలోనే ప్రయాణం చేయగలగడం ఈ ప్లేన్ స్పెషాలిటీ.

వెబ్‌సైట్ తెలుపుతున్న దాని ప్రకారం.. ఇందులో చిన్న పోడ్ ఉండనుంది. అవసరమైన ఎత్తుకు చేరాక పోడ్ డిటాచ్ అయిపోయి.. పైకి తీసుకెళ్లిన రాకెట్ భూమికి చేరుకుంటుంది. ఈ ప్లేన్‌ను కంపెనీ గత కొన్ని సంవత్సరాల నుంచి రూపొందిస్తుంది. 2025 నాటికి దీన్ని పూర్తి స్థాయిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

దీనికి సంబంధించిన యానిమేషన్ వీడియోలను కంపెనీ తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది. ఈ వీడియోలో ఇన్ఫోగ్రాఫిక్ ప్రకారం.. గంటకు 6,400 కిలోమీటర్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది. దీనికి టియాక్సింగ్ I అని పేరు పెట్టారు. ‘దీని కోసం ఒక వింగ్డ్ రాకెట్‌ను కంపెనీ రూపొందిస్తుందని కంపెనీ తెలిపింది. శాటిలైట్లను మోసుకెళ్లే రాకెట్ల కంటే తక్కువ ధరకే దీన్ని రూపొందించవచ్చు. సాధారణ విమానం కంటే ఎంతో వేగంతో ఇది ప్రయాణిస్తుంది.’ అని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

వినిపిస్తున్న కథనాల ప్రకారం.. దీనికి సంబంధించిన టెస్ట్ ఫ్లైట్లు వచ్చే సంవత్సరం గాల్లోకి ఎగరనున్నాయి. సిబ్బంది లేకుండా 2024లో, పూర్తి సిబ్బందితో 2025లో ఈ విమానం లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన ఆర్బిటల్ వెర్షన్‌ను కూడా కంపెనీ 2030 లోపు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే అంతరిక్షంలోకి కూడా వెళ్లే అవకాశం ఉందన్న మాట.

ఈ స్పేస్ క్రాఫ్ట్ అయితే గంటకు 10 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ తన వెబ్‌సైట్లో ప్రకటించింది. అయితే హైపర్ సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కేవలం చైనా మాత్రమే రూపొందిండచం లేదు. అమెరికా ఎయిర్ ఫోర్స్ కూడా హెర్మియస్ అనే కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ భాగస్వామ్యం విలువ 60 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాలకు ఇవి అప్‌గ్రేడెడ్ వెర్షన్లు అనుకోవచ్చు.

View this post on Instagram
 
A post shared by Zachary Burnette (@catlovingtreklover)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
Kiara Advani: 'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్‌లో కియారా - అరెరే ఏముందిరా!?
'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్‌లో కియారా - అరెరే ఏముందిరా!?
Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం
తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం
Embed widget