News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

మనదేశంలో అందుబాటులో ఉన్న టాప్-5 160 సీసీ బైక్స్ లిస్ట్. ఇందులో బజాజ్ పల్సర్ ఎన్160 నుంచి సుజుకి జిక్సర్ వరకు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Top 5 160 CC Bikes: ఒకప్పుడు మనదేశంలో బడ్జెట్ 100 సీసీ బైక్‌లకు డిమాండ్ ఎక్కువ ఉండేది. కానీ ప్రస్తుతం 125 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్‌లపై వినియోగదారులకు మక్కువ పెరిగింది. 150 సీసీ బైక్‌లు వాటి కంటే మంచి అప్‌గ్రేడ్ అయినప్పటికీ ప్రస్తుతం 160 సీసీ బైక్‌లకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. కొన్ని మోటార్ సైకిల్ కంపెనీలు వాటి మీదనే ఎక్కువ ఆధారపడ్డాయి. ప్రస్తుతం మనదేశంలో ఎక్కువ మంది దృష్టి సారించిన 160 సీసీ బైక్‌లు ఇవే.

బజాజ్ పల్సర్ ఎన్160
బజాజ్ పల్సర్ 250 సీసీ బైక్ అయిన ఎన్250 డిజైన్‌తో ఈ బైక్ రీ లాంచ్ అవ్వడం దీనికి ప్రధాన ప్లస్ పాయింట్. ఇది కొత్త ఫ్రెష్‌నెస్‌ను బైక్‌కు అందిస్తుంది. ఎన్ఎస్160 కంటే పూర్తిగా వేరు అయిన 160 సీసీ ఇంజిన్‌ను ఈ బైక్‌లో అందించారు. 16 బీహెచ్‌పీ, 14.7 ఎన్ఎం టార్క్‌ను ఇది అందించనుంది. లీటరు పెట్రోలుకు 30 నుంచి 35 కిలోమీటర్ల మైలేజ్‌ను ఈ బైక్‌ అందించనుంది.

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ
ప్రస్తుతం మనదేశంలో ఫీచర్లు ఎక్కువగా ఉన్న 160 సీసీ బైక్ ఇదే. బ్లూటూత్ కనెక్టివిటీ, వేర్వేరు రైడ్ మోడ్స్, పూర్తిగా అగ్రెసివ్‌గా కనిపించే హెడ్ లైట్ డిజైన్ ఇందులో ప్రధాన ప్లస్ పాయింట్లు. 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఈ బైక్‌లో అందించారు. 17.31 బీహెచ్‌పీ, 14.73 ఎన్ఎం పీక్ టార్క్‌ను టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ అందించనుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్
ఈ విభాగంలో స్పోర్ట్స్ లుక్ ఉండే బైక్ ఇదే. సిటీ కండీషన్స్‌లో దీని పనితీరు అద్భుతంగా ఉంటుంది. 160సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఈ బైక్‌లో అందించారు. 15 బీహెచ్‌పీ, 14 ఎన్ఎం పీక్ టార్క్‌ను హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ డెలివర్ చేయనుంది. దీని బరువు కేవలం 138.5 కేజీలు మాత్రమే. చాలా కంఫర్టబుల్‌గా ఈ బైక్ ఉండనుంది.

సుజుకి జిక్సర్
ఈ లిస్ట్‌లో ఉన్న అండర్ రేటెడ్ మోటార్ సైకిల్స్‌లో సుజుకి జిక్సర్ కూడా ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2019 నాటి మోడల్ డిజైన్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ తరహాలో ఉంటుంది. ఈ బైక్‌లో 155 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. 13.4 బీహెచ్‌పీ, 13.8 ఎన్ఎం టార్క్‌ను సుజుకి జిక్సర్ డెలివర్ చేయనుంది. దీని ఆన్ రోడ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది.

Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు విషయాలు చూసుకోకపోతే కష్టమే!

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్
ఇటీవలే లాంచ్ అయిన ఓబీడీ-II-కంప్లయింట్ యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉన్న ఏకైక బైక్ ఇదే. దీని డిజైన్, లుక్ కూడా చాలా బాగుంటుంది. ముందువైపు యమహా మోనో పోడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌ను అందించారు. నాన్ రెట్రో డిజైన్‌తో ఈ బైక్ లాంచ్ అయింది. 149 సీసీ ఇంజిన్‌ను యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌లో అందించారు. ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ ఛార్జర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Read Also: అదిరిపోయే ఫీచర్లు, సూపర్ స్టైలిష్ లుక్, టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Published at : 02 Jun 2023 04:52 PM (IST) Tags: Bajaj Pulsar Top 5 Sporty Commuters Suzuki Gixxer Hero Xtreme 160r Yamaha FZ X

ఇవి కూడా చూడండి

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!

2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Car Buying Tips: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి

Car Buying Tips: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి

Tata Motors: బ్యాడ్ న్యూస్ - ఈ టాటా వాహనాల ధరలు మూడు శాతం పెంపు!

Tata Motors: బ్యాడ్ న్యూస్ - ఈ టాటా వాహనాల ధరలు మూడు శాతం పెంపు!

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి