అన్వేషించండి

Car Insurance Tips: స్టాండర్డ్‌ ఇన్సూరెన్స్‌ vs జీరో డిప్రిసియేషన్‌; ఈ రెండింటిలో మీ కారుకి ఏది మేలు?

Car Standard insurance vs zero depreciation:సాధారణంగా ఏదైనా వస్తువును వాడుతున్న కొద్దీ దాని విలువ తగ్గుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్‌ పరిభాషలో దీనిని డిప్రిసియేషన్ అంటారు.

కారు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తారు. వాటికి సరైన సమాధానం లభించినప్పుడే కారు కొంటారు. అయితే అదే ఉత్సాహం మాత్రం అతి ముఖ్యమైన ఇన్సూరెన్స్‌పై పెట్టరు. ఈ విషయంలో చాలా మంది కంపెనీ చెప్పిందనో, లేదా స్నేహితులు చెప్పారనో ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల అవసరమైనప్పుడు చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి బిజీ రోడ్లపై తిరిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటకీ ఎదుటి వారి తప్పులు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కారు మెయింటెనెన్స్‌ చాలా ముఖ్యం. అందులో అతి ముఖ్యమైంది ఇన్సూరెన్స్. అయితే ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకునే సమయంలో స్టాండర్డ్‌, జీరో డిప్రిసియేషన్ మధ్య తేడాలను సరిగా అర్థం చేసుకోకపోతే, క్లెయిమ్‌ సమయంలో వేల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. 

డిప్రిసియేషన్ అంటే ఏంటీ?

సాధారణంగా ఏదైనా వస్తువును వాడుతున్న కొద్దీ దాని విలువ తగ్గుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్‌ పరిభాషలో దీనిని డిప్రిసియేషన్ అంటారు.  ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం, కారు విడిభాగాలకు నిర్ణీత తరుగుదల రేట్లు ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు మీరు క్లెయిమ్‌ చేస్తే, స్టాండర్డ్‌ పాలసీ కింద కంపెనీలు పాత భాగాలపై విలువపై తరుగుదలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారు. ఉదాహరణకు పెయింట్‌పై యాభై శాతం, బంపర్‌పై 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గింపు వర్తిస్తుంది. దీని వల్ల రిపేర్ బిల్లు పదివేలు వస్తే మీ చేతికి అందేది కేవలం ఐదు నుంచి ఏడు వేలు మాత్రమే. 

జీరో డిప్రిసియేషన్; మీ జేబుకు రక్షణ కవచం 

జీరో డిప్రిసియేన్ అనేది స్టాండర్డ్‌ కాంప్రెహెన్సివ్‌ పాలసీకి ఒక అదనపు యాడ్‌ఆన్‌గా జోడిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే క్లెయిమ్‌ సమయంలో విడి భాగాల తరుగుదలను కంపెనీ పరిగణలోకి తీసుకోదు. అంటే మీ కారుకు జరిగిన పూర్తి మరమ్మతు ఖర్చును ఇన్సూరెన్స్‌ కంపెనీ భరిస్తుంది. పదివేల రిపేర్‌ బిల్లుకు గాను పదివేల నష్టపరిహారంగా లభిస్తుంది. 

దీనికి ప్రీమియం లెక్కలేంటీ?

సహజంగానే ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే పాలసీకి ప్రీమియం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్టాండర్డ్‌ పాలసీతో పోలిస్తే జీరో డిప్‌ పాలసీ ప్రీమియం సుమారు 20 శాతం నుంచి 25 వరకు ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు ఒక కారు స్టాండర్డ్‌ పాలసీ ప్రీమియం 35 వేలు అయితే జీరో డిప్‌ యాడ్‌ ఆన్‌ కలిపితే 42 వేల నుంచి 45వేల వరకు పెరగొచ్చు. అయితే ఈ అదనపు పది వేల ఖర్చు అనేది ప్రమాదం జరిగినప్పుడు మీరు పొందే ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ఆదా చేసుకోవచ్చు. 

వ్యత్యాసాలు ఏంటంటే 

అంశం స్టాండర్డ్‌ పాలసీ     జీరో డిప్ పాలసీ
క్లెయిమ్‌ మొత్తం   తరుగుదల తగ్గించి చెల్లిస్తారు   పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు. 
ప్రీమియం    తక్కువ       ఎక్కువ
క్లెయిమ్‌ పరిమితి    అపరిమితం     సంవత్సరానికి సాధారణంగా 2-4 సార్లు మాత్రమే
ఎవరికి మంచిది   పాత కార్లు, తక్కువ ప్రయాణించే వారికి     కొత్త, ఖరీదైన కార్లకు 

ఎవరు ఏ పాలసీ ఎంచుకోవాలి?

మీ డ్రైవింగ్ అలవాట్లు, వెహికల్ ఏజ్‌ను బట్టి సరైన పాలసీ ఎంచుకోవాలి. మీరు మారుతి స్విఫ్ట‌ లేదా టాటా పంచ్‌ వంటి కొత్త కార్లు కొనుగోలు చేస్తే జీరో డిప్‌ పాలసీ తీసుకోవడం మంచిది. హైదరాబాద్ వంటి భారీ ట్రాఫిక్ ఉండే నగరాల్లో రోజువారీ 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసే వారు జీరో డిప్ పాలసీ తీసుకోడం ఉత్తమం. ఐదు సంవత్సరాల ఓనర్‌షిప్ కాలంలో స్టాండర్డ్ పాలసీ, జీరో డిప్ మధ్య ప్రీమియం తేడా సుమారు 50 వేల వరకు ఉండొచ్చు కానీ క్లెయిమ్‌ సమయంలో ఈ పాలసీ మీకు లక్షల రూపాయలను ఆదా చేస్తుంది. 

కారు ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక చట్టపరమైన బాధ్యత కాదు, అది మీ ఆస్తికి ఇచ్చే రక్షణ. పాలసీ తీసుకునేటప్పుడు కేవలం ప్రీమియం తక్కువగా ఉందని స్టాండర్స్‌పాలసీ వైపు మొగ్గు చూడం కంటే, క్లెయిమ్‌ సమయంలో ఎదురయ్యే ఆర్థిక భారాలను దృష్టిలో ఉంచుకొని జీరో డిప్రిసియేన్ తీసుకోవడమే తెలివైన పని. 

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌ లేదా విజయవాడ... Kawasaki Versys X 300ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఈజీ EMI ప్లాన్‌ ఉందిగా!
Kawasaki Versys X 300: రూ.4 లక్షల బండిని కేవలం రూ.7,685 EMI తో సొంతం చేసుకునే ప్లాన్‌
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్
రూ.2-5 లక్షల బడ్జెట్‌లో బ్రహ్మాండమైన అడ్వెంచర్ టూరర్‌ బైక్స్.. ఇవిగో 11 ఆప్షన్లు
Tata Aerisలో ఏ వేరియంట్‌ మీ బడ్జెట్‌కు సరిపోతుంది? వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరల వివరాలు
Tata Aerisలో 5 వేరియంట్లు.. ఏ వేరియంట్‌లో స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి, ఏది కొనాలి?

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget