అన్వేషించండి

Car Maintenance Tips: రోజూ ఇలా చెక్ చేస్తే మీ కారు పనితీరు మారిపోతుంది, కొత్త కారులా పరుగులు తీస్తుంది – ఇవి తప్పక గుర్తుపెట్టుకోండి!

Daily Car Checklist: కారు స్మూత్‌గా పరుగెత్తాలంటే ప్రతి రోజు చెక్ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన భాగాలున్నాయి. ఆ భాగాలేంటి, ఎలా చెక్ చేయాలి, అవి ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం.

Car Mileage Improvement Tips: భారతీయులకు కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది కూడా ఒక కుటుంబ సభ్యుడు. అయితే, ఎక్కువ మంది, ఇష్టంగా కారు కొనుగోలు చేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ విషయంలో అలసత్వం చూపుతుంటారు. అసలు, కారు సరిగ్గా పనిచేయాలంటే కేవలం సర్వీసింగ్ మాత్రమే చాలదు. రోజూ అతి కొద్ది సమయం కేటాయించి, కారులోని కొన్ని చిన్న భాగాలను చెక్ చేస్తే వాహనం పనితీరు మెరుగవుతుంది, మైలేజ్ పెరుగుతుంది, రిపేర్ల ఖర్చులు తగ్గుతాయి.

కారు మెరుగైన పనితీరు కోసం, నిత్యం కొన్ని ముఖ్యమైన భాగాల పరిస్థితిని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ భాగాలు చిన్నవి అనిపించవచ్చు కానీ ఇవి కారు పనితీరులో గుండె లాంటివి.

మీరు ప్రతి రోజు చెక్ చేయాల్సిన ముఖ్యమైన కారు భాగాలు:

1. ఇంజిన్ ఆయిల్ స్థాయి:
ఇది కారు "హార్ట్ బీట్" అని చెప్పొచ్చు. ఇంజిన్ ఆయిల్ తక్కువగా ఉండటం వల్ల ఫ్రిక్షన్ పెరుగుతుంది, ఇంజిన్ వేడెక్కుతుంది, చివరకు దెబ్బతింటుంది. కారు స్టార్ట్‌ అయ్యే ముందు డిప్ స్టిక్‌తో ఆయిల్ స్థాయిని చెక్ చేయాలి. అంతేకాదు, ఆయిల్ రంగు ముదురుగా మారితే, వెంటనే మార్చేయాలి.

2. టైర్ ప్రెషర్ & కండిషన్:
టైర్లు కారు పెర్ఫార్మెన్స్‌, మైలేజ్‌, బ్రేకింగ్ సిస్టమ్ అన్నింటికీ పునాదుల్లాంటివి. ప్రతి మూడు రోజులకు టైర్ ప్రెషర్ చెక్ చేయండి. ప్రెషర్ తక్కువగా ఉంటే మైలేజ్ తగ్గుతుంది. టైర్ ట్రెడ్ డెప్త్ కూడా పరిశీలించండి, టైర్లు మరీ మెత్తగా ఉంటే డ్రైవింగ్ ప్రమాదకరం.

3. కూలెంట్ లెవల్:
ఇంజిన్ వేడి నుంచి కాపాడే కూలెంట్ స్థాయిని చెక్ చేయడం కూడా చాలా ముఖ్యం. రేడియేటర్‌లో గరిష్ట, కనిష్ట గుర్తుల మధ్య కూలెంట్ ఉండాలి. అవసరమైతే, నమ్మకమైన కూలెంట్‌ను మాత్రమే యాడ్ చేయాలి.

4. బ్రేక్ ఆయిల్:
బ్రేకింగ్ రెస్పాన్స్ మీద దీని ప్రభావం బాగా ఉంటుంది. బ్రేక్ ఆయిల్ లెవల్ తక్కువగా ఉంటే, బ్రేక్స్ సరిగ్గా పని చేయకపోవచ్చు. ఇది డ్రైవింగ్ సమయంలో ప్రమాదకరం కావచ్చు.

5. బ్యాటరీ హెల్త్:
కారు వెంటనే స్టార్ట్ కావడం లేదా?, సోమరితనం ప్రదర్శిస్తోందా?, హెడ్‌లైట్లు డిమ్‌గా ఉన్నాయా? చెక్‌ చేయాలి. ఇవి, బ్యాటరీ వీక్ అయిందన్న సంకేతాలు. టెర్మినల్స్‌ను తడి లేకుండా ఉంచండి. వారం లోపు ఒకసారి వోల్టేజ్ చెక్ చేయించుకోవడం మంచిది.

6. విండ్‌షీల్డ్ క్లీనర్ లిక్విడ్ & వైపర్స్:
వాన చినుకులు లేదా పొడి ధూళి కారణంగా విండ్‌షీల్డ్ మసగ్గా మారుతుంది. అందుకే వాషర్ లిక్విడ్ సరైన లెవల్‌లో ఉండేలా చూసుకోవాలి. వైపర్ బ్లేడ్‌లు బాగా పనిచేస్తున్నాయా లేదా కూడా పరిశీలించండి.

7. లైట్ల పరిస్థితి:
హెడ్‌ లైట్స్, టెయిల్ లైట్స్, టర్న్ ఇండికేటర్లు అన్నీ సరిగా పని చేస్తున్నాయో, లేదో ప్రతిరోజూ ఒకసారి చూసుకోవాలి. రాత్రిపూట ప్రయాణాల్లో మీ భద్రతకు ఇది చాలా అవసరం.

8. ఇంధన స్థాయి (పెట్రోల్‌, డీజిల్‌ లేదా CNG):
కొన్ని సందర్భాల్లో, పాత కార్లలో ఫ్యూయెల్ గేజ్ సరిగ్గా చూపించకపోవచ్చు. కారు ఇంధనం కనీస స్థాయి కంటే ఎప్పుడూ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

కథనం చదువుతుంటే ఈ లిస్ట్‌ చాలా పెద్దది అనిపించవచ్చు. కానీ, వాస్తవంగా వీటన్నింటినీ చెక్‌ చేయడానికి 5 నుంచి 10 నిమిషాలు చాలు. రోజూ కారు స్టార్ట్ చేసే ముందు ఈ చిన్న చెకింగ్స్‌ చేస్తే, మీరు ఊహించని విధంగా కారును కొత్తదానిలా ఉంచుకోవచ్చు. ఇవి కేవలం మెయింటెనెన్స్‌కు మాత్రమే కాదు – మీ సురక్షిత డ్రైవింగ్‌కు కూడా కీలకం. ఒక్కసారి అలవాటు చేసుకుంటే, కారు జీవిత కాలాన్ని పెంచడం, మైలేజ్ మెరుగుపరచడం, ఆకస్మిక ఖర్చుల్ని తగ్గించడం వంటివన్నీ మీ కంట్రోల్‌లో ఉంటాయి. అంతేకాదు, కొత్త కారు తరహాలో మీ ప్రయాణం ప్రతి రోజు కొత్తగా, సురక్షితంగా మారుతుంది!.

టాప్ హెడ్ లైన్స్

2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?
పాత బలెనోకు కొత్త బలెనోకు తేడా ఇదే.. కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
నెలకు కేవలం రూ.10 వేలతో ఎలక్ట్రిక్‌ కారు సొంతం - పెట్రోల్ భారం నుండి విముక్తి పొందే ఐడియా
కేవలం రూ.10,000 EMIతో కొనగలిగే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు! పెట్రోల్‌ బిల్లుకు చెప్పండి గుడ్‌బై!
రూ.లక్ష లోపులో వచ్చే బజాజ్ బైక్‌లు, స్కూటర్లు.. ఈ 8 టూవీలర్లలో ఒకటి ఎంచుకోవచ్చు!
డైలీ జర్నీ నుంచి స్పోర్టీ రైడ్ వరకు.. రూ.లక్షలోపే వచ్చే ఈ బజాజ్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!
398cc Triumph Scrambler 400 X: నెలకు రూ.6600 కడితే ఈ బైక్ మీదే! డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్స్‌ ఇవే!
Triumph Scrambler 400 X: రూ.3.15 లక్షల అడ్వెంచర్ బైక్‌ కేవలం రూ.6600 EMIతో మీ సొంతమవుతుంది!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS AFG 1st T20 Result Update: అభిషేక్ వీర‌విహారం.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
అభిషేక్ ఊచకోత.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Embed widget