News
News
వీడియోలు ఆటలు
X

New Car Care Tips: కొత్త కారు కొన్నారా - ఈ జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా షెడ్డుకి పోవడం ఖాయం!

కొత్త కారు కొన్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.

FOLLOW US: 
Share:

Car Maintenance Tips: ఇంట్లోకి కొత్త వాహనం రావడం కుటుంబంలో కొత్త ఆనందం రావడం లాంటిది. కానీ ఈ వాహనం కారు అయితే అది దానితో పాటు ఎక్కువ బాధ్యతలను కూడా తెస్తుంది. దీని కారణంగా కొంత ఆందోళన కూడా ఉంటుంది. మీరు కొత్త కారును కూడా కొనుగోలు చేసి ఉంటే దాని నిర్వహణ, డ్రైవింగ్, వారి రక్షణకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది.

వాహన మాన్యువల్ చదవాలి
కారు కొనుగోలు కస్టమర్లు చాలా మంది ఈ తప్పు చేస్తారు. ఈ కారణంగా కారును ప్రతి చిన్న, పెద్ద సమస్యకు మెకానిక్‌ దగ్గరకు తీసుకెళ్లాల్సి వస్తుంది. మీరు మాన్యువల్ చదివితే మీ వాహనంలో ఫ్యూజులు ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు సర్వీస్ చేయించాలి, ఏ ఫ్యూయల్‌ను ఉపయోగించాలి, టైర్‌లో ఎంత ఒత్తిడిని ఉంచాలి వంటి విషయాలు తెలుస్తాయి. వీటితో పాటు, మీ కారులో ఉన్న ఫీచర్లు, వాటి వినియోగం కూడా తెలుస్తుంది. ఇది మీకు ఎప్పుడైనా అవసరం కావచ్చు.

యాక్సెసరీలు ఆలోచించి కొనండి
కొత్త కారును కొనుగోలు చేసిన తరువాత చాలా మంది ప్రజలు దాన్ని కొత్త యాక్సెసరీలతో అప్‌గ్రేడ్ చేయడం ద్వారా వేరే రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఏదేమైనా వీటిలో చాలా యాక్సెసరీలను కారు కంపెనీలు కూడా అందిస్తాయి. అయితే బయట వ్యక్తుల దగ్గర యాక్సెసరీలు కొని మాడిఫై చేసేటప్పుడు ఎలక్ట్రిక్ ఉపకరణాల కోసం కారు వైరింగ్ మొదలైనవి కట్ చేయాల్సి ఉంటుంది. అలాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల కారుపై వారంటీని రద్దు చేసే అవకాశం ఉంది.

కారు పెయింట్ విషయంలో జాగ్రత్త తీసుకోండి
కారు కొత్తగా ఉన్నప్పుడు, దానిపై చిన్న గీతలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని నివారించడానికి మీరు మీ కారుకు సిరామిక్ కోటింగ్ వేయించవచ్చు. ఇది మీ కారును దుమ్ము, ధూళి నుంచి రక్షించడానికి కూడా పనిచేస్తుంది. ఇది కాకుండా పీపీఎఫ్ కూడా మంచి ఎంపిక అని తెలుసుకోవాలి. ఇది వాహనం రూఫ్ టాప్, బోనెట్‌పై చేయవచ్చు, ఇది పెయింట్‌ను చిన్న గీతల నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా బలమైన సూర్యకాంతి వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.

సర్వీస్ సమయానికి చేయించాలి
మీరు మీ కారును ఎక్కువసేపు ఉపయోగించాలనుకుంటే మీరు దాన్ని టైమ్ టు టైమ్ సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. అలాగే టైర్లు, ఇతర భాగాలను సమయానికి మారుస్తూ ఉండండి. ఈ కారణంగా మీ కారు చాలా కాలం పాటు మీకు సపోర్ట్ చేస్తుంది.

ఇది కాకుండా మీ కొత్త కారును వేగంగా నడపకండి. కొత్త వాహనాన్ని నడుపుతున్నప్పుడు చాలా సార్లు ప్రజలు ఉత్సాహంగా ఉంటారు. స్వల్ప పొరపాటు కారుతో పాటు అందులో ప్రయాణించే వారి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. డ్రైవింగ్ ఎల్లప్పుడూ నిదానంగా చేయాలి.

మీరు కొత్త కారును కొనుగోలు చేసి అందులో వెంటనే సీఎన్‌జీ కిట్‌ను ఇన్‌స్టాల్ చేయకండి. అలా అప్‌డేట్ చేస్తే వెంటనే వారంటీని కూడా కోల్పోతారు. కాబట్టి మీరు కంపెనీ అమర్చిన సీఎన్‌జీ కారుని కొనాలి లేదా కారు వారంటీ గడువు ముగిసే వరకు వేచి ఉండండి.

Published at : 26 Mar 2023 03:41 PM (IST) Tags: cars Car News Car Care tips

సంబంధిత కథనాలు

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?

Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?

Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?

Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?

మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!

మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!

బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !