అన్వేషించండి

Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ మిస్టేక్ చేయవద్దు.. లేకపోతే నష్టపోతారు

Second Hand Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారును కొనేటప్పుడు అది ప్రమాదానికి గురైందో లేదో ఎలా నిర్ధారించుకోవాలో తెలుసుకోవాలి. బాడీ గ్యాప్స్, పెయింట్, గ్లాస్, సర్వీస్ రికార్డులను చెక్ చేయాలి.

Second Hand Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారును కొనేటప్పడు ఆ కారు గతంలో ఏదైనా పెద్ద ప్రమాదానికి గురైందా అని అందరిలోనూ డౌట్ ఉంటుంది. చాలా మంది కారు ఓనర్లు కారు అసలు కండీషన్‌ను దాచిపెట్టి విక్రయిస్తుంటారు. అలాంటి సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి, సరిగ్గా చెక్ చేయడం ద్వారా మీరు భవిష్యత్తులో ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. కొన్ని విషయాలపై ఫోకస్ చేయడం ద్వారా ఆ కారు గతంలో ఏమైనా ప్రమాదానికి గురైందో లేదో తెలుసుకోవచ్చు. ఇవి తెలుసుకుంటే మీకు పూర్తి అవగాహన వస్తుంది. 

బాడీ గ్యాప్స్‌ను చెక్ చేయండి
కంపెనీ నుంచి వచ్చిన కొత్త కారులో బోనెట్, డోర్స్, డిక్కీ మధ్య గ్యాప్ (ఖాళీ) అన్ని చోట్లా సమానంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా భాగంలో గ్యాప్ ఎక్కువ లేదా తక్కువగా కనిపిస్తే అనుమానించాలి. లేదా తలుపు సరిగ్గా మూతపడకపోతే, ఆ భాగానికి రిపేర్లు చేశారని గ్రహించాలి. చాలా సార్లు ప్రమాదం జరిగిన తర్వాత బాడీ పార్ట్స్ మారుస్తుంటారు. దీనివల్ల ఫిట్టింగ్ గతంలోలాగ ఉండదు.

పెయింట్ చెక్ చేయాలి

కారు పెయింట్‌ను జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కారులోని ఏదైనా భాగం రంగు లేదా షైనింగ్ మిగిలిన బాడీ కంటే భిన్నంగా కనిపిస్తే, ఆ భాగానికి మళ్లీ పెయింట్ వేశారని గ్రహించాలి. రబ్బరు లైనింగ్ లేదా అంచులపై పెయింట్ మరకలు కనిపించడం రిపేర్లకు సంకేతం కావచ్చు. కంపెనీ ఒరిజినల్ పెయింట్ సాధారణంగా స్మూత్‌గా ఉంటుంది. కానీ తర్వాత వేసిన పెయింట్ కొంచెం గరుకుగా అనిపిస్తుంది. 

బోనెట్, లోపలి భాగాలను చూడండి
బోనెట్ తెరిచి బోల్టులు, Hinges జాగ్రత్తగా గమనించండి. వాటిపై పనిముట్ల గుర్తులు ఉన్నా లేదా పెయింట్ ఊడిపోయి ఉన్నా, ఆ భాగాన్ని విప్పి రిపేర్ చేశారని గ్రహించాలి. ఇంజన్ చుట్టుపక్కల, డిక్కీ లోపల వెల్డింగ్ గుర్తులు లేదా వంగిన ఐరన్ కనిపిస్తే, కారు ప్రమాదానికి గురై ఉండవచ్చు. తక్కువ ధరకు వస్తుందని ఆశపడితే అది మనకు ఆర్థిక నష్టంతో పాటు కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు లేకపోలేదు.

టెస్ట్ డ్రైవ్ చేయడం మర్చిపోవద్దు
కారు కొనే ముందు తప్పనిసరిగా టెస్ట్ డ్రైవ్ చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజన్ శబ్దం, వైబ్రేషన్, స్టీరింగ్ పనితీరుపై దృష్టి పెట్టాలి. వేగంగా వెళ్తున్నప్పుడు కారు అసాధారణ శబ్దాలు చేసినా లేదా ఒక వైపుకు లాగుతున్నట్లు అనిపించినా, ఆ కారులో సమస్య ఉందని తెలిసిపోతుంది. 

అద్దాలు, రికార్డులను కూడా చెక్ చేయండి
కారులోని అన్ని అద్దాలపై తయారీ తేదీ రాసి ఉంటుంది. ఏదైనా ఒక అద్దంపై తేదీ భిన్నంగా ఉంటే, ఆ అద్దాన్ని మార్చారని తేలిపోతుంది. అదేవిధంగా కొత్త హెడ్‌లైట్లు కూడా యాక్సిడెంట్‌కు సంకేతం కావచ్చు. వీటితో పాటు సర్వీస్ రికార్డులు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వివరాలను తప్పకుండా చెక్ చేయాలి. అప్పుడే ఆ కారు ఏ ప్రమాదానికి గురైందో లేదో తెలుస్తుంది. అప్పుడు కారు కొనాలా వద్దా మీరు డిసైడ్ అవ్వొచ్చు. 

ఆటో సెక్షన్ సంబంధించి మరిన్ని ఆసక్తికర వార్తల కోసం క్లిక్ చేయండి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌
టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు, ఈ దసరా గుర్తుండిపోతుంది!
2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!
Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget