అన్వేషించండి

విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ ఇకపై కార్లలోకీ వస్తుంది! 2027 నుంచి వెహికల్‌ సేఫ్టీ రూల్స్‌ మరింత కఠినం

భారత్‌లో కార్లకు విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ తీసుకురానున్నారు. వేగం, బ్రేకులు, సీటు బెల్టు వివరాలతో ప్రమాదాల దర్యాప్తు సులభం కానుంది.

Cars To Get Black Box Just Like Aircraft: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు.. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? వాహనం ఎంత వేగంతో వెళ్తోంది? డ్రైవర్‌ బ్రేకులు వేశాడా? సీటు బెల్టు పెట్టుకున్నాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం ఇకపై సులభం కానుంది. విమానాల్లో ఉండే బ్లాక్‌బాక్స్‌ తరహాలో కార్లలోనూ ప్రత్యేక పరికరాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పరికరాన్ని "ఈవెంట్‌ డేటా రికార్డర్‌" (Event Data Recorder - EDR) అంటారు. ప్రమాదానికి ముందు, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని ఇది నమోదు చేస్తుంది.

కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వాహన భద్రతకు సంబంధించి కొత్త ప్రమాణాలను తీసుకొచ్చింది. పాదచారుల రక్షణ, వాహనాల్లో ప్రయాణించేవారి భద్రత, దొంగతనాల నివారణకు సంబంధించిన నిబంధనలకూ మార్పులు ప్రతిపాదించింది. వీటిని 2027 నుంచి 2032 వరకు దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించింది.

బ్లాక్‌బాక్స్‌ ఏం చేస్తుంది?

కార్లలోని ఎలక్ట్రానిక్‌ నియంత్రణ వ్యవస్థలో భాగంగా EDR పనిచేస్తుంది. సాధారణంగా తీవ్రమైన ప్రమాదం జరిగినప్పుడు లేదా ఎయిర్‌బ్యాగులు తెరుచుకున్నప్పుడు కీలక సమాచారాన్ని భద్రపరుస్తుంది. వాహనం వేగం, బ్రేకులు ఉపయోగించారా లేదా, సీటు బెల్టు ధరించారా, ఎయిర్‌బ్యాగులు ఎప్పుడు తెరుచుకున్నాయి వంటి వివరాలు ఇందులో నమోదవుతాయి. అయితే, విమానాల బ్లాక్‌బాక్స్‌లా ఇది ప్రయాణికుల సంభాషణలను రికార్డు చేయదు. ప్రమాదానికి ముందు, ఆ సమయంలో వాహనం ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు అవసరమైన సాంకేతిక సమాచారాన్ని మాత్రమే భద్రపరుస్తుంది.

ప్రమాదానికి ఎవరు కారణం?

ప్రమాదం జరిగినప్పుడు వాహనం వేగం ఎంత ఉంది? డ్రైవర్‌ బ్రేకులు వేశారా? ఢీకొన్న క్రమం ఎలా ఉంది? వంటి అంశాలను పరిశోధించేందుకు EDR సమాచారం ఉపయోగపడుతుంది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో పాటు ఈ వివరాలను పరిశీలిస్తే ప్రమాదం ఎలా జరిగిందో అంచనా వేయడం సులభమవుతుంది.

ఇది కూడా చదవండి: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన

అయితే, ఈ పరికరం ఒక్కటే ప్రమాదానికి ఎవరు కారణమో తేల్చలేదు. రహదారి పరిస్థితులు, వాతావరణం, ఇతర వాహనాల కదలికలు, సాక్ష్యాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. భారత్‌లో ఈ సమాచారాన్ని ఎవరు పొందవచ్చు? ఎలాంటి అనుమతులు అవసరం? అనే అంశాలపై స్పష్టత కీలకం కానుంది.

ప్రయాణికులు, పాదచారులకు మెరుగైన రక్షణ

ముందు నుంచి ఢీకొన్నప్పుడు, పక్క నుంచి ఢీకొన్నప్పుడు కార్లలోని ప్రయాణికులకు గాయాల భయం తగ్గించేలా కొత్త భద్రత ప్రమాణాలను కూడా కేంద్రం తీసుకొస్తోంది. కొత్త మోడళ్లకు కొన్ని నిబంధనలు 2027 అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని మోడళ్లకు వర్తించే గడువులు కొన్ని విభాగాల్లో 2028 అక్టోబరు 1గా నిర్ణయించారు.

సీటు బెల్టులు & వాటికి అనుసంధానమైన రక్షణ వ్యవస్థలకు సంబంధించిన ప్రమాణాలు కూడా కఠినం కానున్నాయి. కొత్త మోడళ్లకు 2029 అక్టోబరు 1 నుంచి, అన్ని మోడళ్లకు 2031 అక్టోబరు 1 నుంచి ఇవి వర్తించనున్నాయి.

పాదచారుల రక్షణ కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. కారు ఢీకొన్నప్పుడు కాళ్లకు కలిగే గాయాల ముప్పును ఫ్లెక్సిబుల్‌ పెడస్ట్రియన్‌ లెగ్‌ ఇంపాక్టర్‌ (FPLI) అనే పరికరంతో అంచనా వేస్తారు. ఈ ప్రమాణాలు కొత్త మోడళ్లకు 2028 అక్టోబరు 1 నుంచి, అన్ని మోడళ్లకు 2032 అక్టోబరు 1 నుంచి వర్తించనున్నాయి.

ఇది కూడా చదవండి: కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!

దొంగతనాలను అడ్డుకునే వ్యవస్థలు

వాహనాల భద్రతతో పాటు దొంగతనాల నివారణపైనా కేంద్రం దృష్టి పెట్టింది. సరైన తాళం లేకుండా లేదా అనుమతించిన విధానం లేకుండా వాహనాన్ని స్టార్ట్‌ చేయకుండా ఇమ్మొబిలైజర్‌ అనే వ్యవస్థ అడ్డుకుంటుంది. అలారం వ్యవస్థలకూ సంబంధించిన ప్రమాణాలను కొత్త నిబంధనల్లో చేర్చారు. M-1 కేటగిరీ వాహనాలకు ఇమ్మొబిలైజర్‌ నిబంధనలు 2027 అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇక, EDRకు సంబంధించిన నిబంధనలు అన్ని మోడళ్లకు 2029 అక్టోబరు 1 నుంచి వర్తించనున్నాయి. విద్యుత్‌ వాహనాల్లోనూ ప్రమాద సమయంలో విద్యుత్‌ వ్యవస్థ వల్ల ముప్పు కలగకుండా ప్రత్యేక భద్రత చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాణాలు అన్ని మోడళ్లకు 2029 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

భారత్‌ ఎన్‌క్యాప్‌లోనూ మార్పులు

భారత్‌ ఎన్‌క్యాప్‌ (Bharat NCAP) వెహికల్‌ సేఫ్టీ రేటింగ్‌ కార్యక్రమంలోనూ రెండో దశ మార్పులు రానున్నాయి. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దశ 2027 అక్టోబరులో ప్రారంభం కానుంది. మొత్తం 100 మార్కుల్లో 20 మార్కులను పాదచారులు & ఇతర ప్రమాదానికి గురయ్యే రహదారి వినియోగదారుల భద్రతకు కేటాయించే ప్రతిపాదన ఉంది.

ఈ మార్పులకు అనుగుణంగా కార్ల కంపెనీలు వాహనాలను రూపొందించాల్సి ఉంటుంది. ప్రమాదాలు జరగకుండా నివారించడం, ప్రమాదం జరిగినప్పుడు గాయాల తీవ్రతను తగ్గించడం, దర్యాప్తులో సాంకేతిక ఆధారాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి లక్ష్యాలతో ఈ చర్యలు చేపడుతున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
స్పోర్టీ లుక్‌తో వచ్చిన ఏప్రిలియా SXR GT 175 మ్యాక్సీ స్కూటర్.. ఇంజిన్‌, ఫీచర్లు, సౌకర్యం ఎలా ఉన్నాయి?
Aprilia SXR GT 175 ఫుల్‌ రివ్యూ.. ఈ బండిని కొనొచ్చా? ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
39hp పవర్.. ట్విన్ సిలిండర్ ఇంజిన్.. కేటీఎం డ్యూక్‌కు పోటీ.. Kawasaki Z300 గురించి ఇంకా మీకేం తెలుసు?
యూత్‌ఫుల్‌ బైక్‌ కవాసాకి Z300 గురించి 5 కీలక విషయాలు.. కొనే ముందే మీకివి తెలియాలి!
Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
YS Jagan Vs Sharmila: షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Embed widget