అన్వేషించండి

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. డ్రైవింగ్ పరీక్షలో 75% అర్హత మార్కులు, 30 నిమిషాల శిక్షణ, కొన్ని ఆన్‌లైన్ సేవలకు ఫీజు మినహాయింపు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

Driving licence new rules 2026: మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. ఇకపై డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధించాలంటే గతం కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సి రావచ్చు. ప్రస్తుతం 60%గా ఉన్న అర్హత మార్కులను 75%కు పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు కొత్త నిబంధనలకు అనుగుణంగా పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

అయితే, ఇవి ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. కొత్త నిబంధనలపై ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

30 నిమిషాల శిక్షణ తప్పనిసరి!

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో భాగంగా సురక్షిత డ్రైవింగ్ పాఠ్యాంశాల శిక్షణకు కనీస సమయాన్ని కూడా నిర్ణయించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ శిక్షణ కనీసం 30 నిమిషాల పాటు కొనసాగాలి. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షితంగా వాహనాలు నడపడం వంటి అంశాలపై దరఖాస్తుదారులకు అవగాహన కల్పించడం ఈ విధానం ఉద్దేశంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఉన్న 60% అర్హత మార్కులను 75%కు పెంచే ప్రతిపాదన అమల్లోకి వస్తే, పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అయితే, పరీక్ష నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలపై తుది నిబంధనల్లో స్పష్టత వస్తుంది.

లైసెన్స్ వివరాల మార్పునకు 15 రోజుల గడువు

డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకునేవారికి కూడా కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. ఇలాంటి దరఖాస్తులపై లైసెన్సింగ్ అధికారులు 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దరఖాస్తును ఆమోదిస్తారా? తిరస్కరిస్తారా? అనే విషయాన్ని నిర్ణీత గడువులోగా తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను కూడా స్పష్టంగా వెల్లడించాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లోగా ఏ నిర్ణయం తీసుకోకపోతే, ఆ దరఖాస్తు ఆమోదం పొందినట్లు భావించాలి. ఈ నిబంధన అమల్లోకి వస్తే దరఖాస్తుదారులు తమ దరఖాస్తుల స్టేటస్‌ను స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: స్పోర్టీ లుక్‌తో వచ్చిన ఏప్రిలియా SXR GT 175 మ్యాక్సీ స్కూటర్.. ఇంజిన్‌, ఫీచర్లు, సౌకర్యం ఎలా ఉన్నాయి?

పేరు, చిరునామా మార్పునకు ఫీజు ఉండదా?

డ్రైవింగ్ లైసెన్స్‌లో వ్యక్తిగత వివరాలను మార్చుకునేవారికి మరో ఊరట కల్పించే ప్రతిపాదనను కూడా కేంద్రం తీసుకొచ్చింది. పేరు, చిరునామా వంటి వివరాల మార్పునకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజ్‌లను తొలగించాలని ప్రతిపాదించింది. అలాగే, ఆధార్ ధ్రువీకరణతో పూర్తి చేసే కొన్ని ఆన్‌లైన్ లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని సూచించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అర్హత కలిగిన సేవలను ఆన్‌లైన్‌లో పొందేవారికి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, ఏయే సేవలకు మినహాయింపు వర్తిస్తుంది? ఏ నిబంధనల ప్రకారం ఈ సదుపాయం అందుతుంది? అనే వివరాలు తుది నిబంధనల్లో స్పష్టమవుతాయి.

గుర్తింపు పత్రాల జాబితాలో ఇవి కూడా!

డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు సమర్పించాల్సిన తమ గుర్తింపు, వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాల గురించి కూడా ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, ఈ-రేషన్ కార్డు, జనన ధ్రువపత్రం వంటి పత్రాలను సంబంధిత అవసరాలకు అనుగుణంగా సమర్పించవచ్చు. ఈ జాబితాలో ఇతర పత్రాలు కూడా ఉన్నాయి. దరఖాస్తుదారులు తమ అవసరానికి సరిపోయే ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

లైసెన్స్ కార్డు రూపంలోనే జారీ!

డ్రైవింగ్ లైసెన్స్ జారీ, పునరుద్ధరణ విషయంలోనూ కేంద్రం మార్పులను ప్రతిపాదించింది. లైసెన్సింగ్ అధికారులు జారీ చేసే లేదా పునరుద్ధరించే ప్రతి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఫారం 7 ప్రకారం లామినేటెడ్ కార్డు లేదా పాలీవినైల్ క్లోరైడ్ (PVC) కార్డు రూపంలో అందించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదన ద్వారా లైసెన్స్ జారీ విధానంలో ఒక నిర్దిష్ట కార్డు రూపాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఇది కూడా చదవండి: 39hp పవర్.. ట్విన్ సిలిండర్ ఇంజిన్.. కేటీఎం డ్యూక్‌కు పోటీ.. Kawasaki Z300 గురించి ఇంకా మీకేం తెలుసు?

30 రోజుల్లో అభిప్రాయాలు తెలియజేయాలి

కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మార్పులను కేంద్ర మోటారు వాహనాల నిబంధనలకు సంబంధించిన ముసాయిదా సవరణల్లో పొందుపరిచింది. ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలు తమ అభ్యంతరాలు, సూచనలను తెలియజేయడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. అప్పటివరకు ఈ మార్పులను అమల్లోకి వచ్చిన నిబంధనలుగా భావించకూడదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి
ఇటలీ నుంచి వస్తున్న Italjet Dragster 300.. ఈ స్కూటర్ గురించి 6 ఆసక్తికర విషయాలు
Electric Car Sales: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు
జోరుగా హుషారుగా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌.. అప్పుడే 3 లక్షల మార్క్ దాటిన అమ్మకాలు
రెట్రో లుక్‌, మోడ్రన్‌ టచ్‌తో Vespa ఆల్‌-న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు
Vespa నుంచి మూడు గ్లోబల్‌ రేంజ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తాయంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget