అన్వేషించండి

Car Airbag Safety Tips: కారులో ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నప్పటికీ ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. బీ అలర్ట్

Car Safety Tips: కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, తప్పుడు పొజిషన్‌లో కూర్చోవడం వంటి చిన్న తప్పుల వల్ల ప్రమాదం జరిగినప్పుడు మీ ప్రాణాలకే ముప్పు రావచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎయిర్‌బ్యాగ్ ఉన్న కార్లలో సీటు బెల్ట్ తప్పనిసరి, లేదంటే ప్రాణాపాయం.
  • కారు డాష్‌బోర్డ్‌పై వస్తువులు, పిల్లలు ముందు సీటులో కూర్చోరాదు.
  • క్రాష్ సెన్సార్లు, రసాయన చర్యతో ఎయిర్‌బ్యాగ్ వేగంగా తెరుచుకుంటుంది.
  • ప్రభుత్వం కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేస్తోంది.

Car Airbag Safety Tips | ప్రస్తుతం కొత్త కారు కొనేటప్పుడు వాహనదారులు ఇంజన్ మైలేజ్‌తో పాటు సేఫ్టీ రేటింగ్, ఎయిర్‌బ్యాగ్‌లకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కనుక రోడ్డుపై ఎలాంటి ప్రమాదం జరిగినా తమ ప్రాణాలకు ముప్పు ఉండదని ధీమాతో చాలా మంది ప్రయాణిస్తుంటారు. కానీ నిపుణుల ప్రకారం.. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. కారులో ఎయిర్‌బ్యాగ్ ఉండటం ఎంత ముఖ్యమో, అది ప్రమాదం జరిగినప్పుడు సరిగ్గా తెరుచుకుని మన ప్రాణాలను కాపాడాలంటే డ్రైవర్, సహ ప్రయాణికులు కొన్ని ప్రైమరీ రూల్స్ పాటించడం అంతే ముఖ్యమని చెబుతున్నారు. కొన్ని చిన్నపాటి తప్పుల వల్ల ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ తీవ్ర గాయాలై, తరువాత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా జరుగుతున్నాయి. 

సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం బిగ్ మిస్టేక్
ఎయిర్‌బ్యాగ్ ఉన్న కార్లలో ప్రయాణించేటప్పుడు చాలా మంది చేసే అతి పెద్ద తప్పు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం. ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ ఎప్పుడూ సీట్ బెల్ట్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ప్రమాదం జరిగి కారు వేగంగా ఆగిపోయినప్పుడు, సీట్ బెల్ట్ మనిషిని వెనక్కి లాగి పట్టి ఉంచి కాపాడుతుంది. అదే సీట్ బెల్ట్ లేకపోతే, ప్రయాణికుడు అంతే వేగంతో ముందుకు వెళ్లిపోతాడు.  ఆ సమయంలో గంటకు దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో ఎయిర్‌బ్యాగ్ నేరుగా వచ్చి ముఖానికి లేదా ఛాతికి బలంగా తాకడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అలాగే, చాలా మంది డ్రైవర్లు సీటును స్టీరింగ్ వీల్‌కు మరీ దగ్గరగా జరుపుకుని కూర్చుంటారు. దీనివల్ల ఎయిర్‌బ్యాగ్ విస్తరించే లోపే అది మన శరీరాన్ని బలంగా తాకుతుంది. కనీసం స్టీరింగ్ నుంచి 10 అంగుళాల దూరం ఉండేలా సీటును సర్దుబాటు చేసుకోవాలి.

Read Also: Top 5 Hybrid Cars Mileage: ఆఫీసుకు వెళ్లేవారికి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టాప్ 5 హైబ్రిడ్ కార్లు ఇవే

కార్ డాష్ బోర్డుపై ఉంచిన వస్తువులతో ప్రమాదం
కారు డ్యాష్‌బోర్డ్‌పై దేవుడి విగ్రహాలు, మొబైల్ హోల్డర్లు లేదా ఇతర వస్తువులను ఉంచడం ప్రమాదానికి కారణం అవుతుంది. ఎయిర్‌బ్యాగ్ ఓపెన్ అయినప్పుడు ఆ ఒత్తిడికి డ్యాష్‌బోర్డ్ పైనున్న వస్తువులు తుపాకీ బుల్లెట్లలా దూసుకొచ్చి ప్రయాణికులను గాయపరుస్తాయి. అలాగే చిన్న పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ ముందు సీట్లో కూర్చోబెట్టకూడదు. ఎయిర్‌బ్యాగ్స్ పెద్దల శరీర నిర్మాణాన్ని బట్టి డిజైన్ చేసి ఉంటాయి. కాబట్టి, వాటి తీవ్రతను చిన్న పిల్లలు తట్టుకోలేరు. కారు స్క్రీన్‌పై ఎప్పుడైనా ఎయిర్‌బ్యాగ్ (SRS) వార్నింగ్ లైట్ వెలిగితే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఎయిర్‌బ్యాగ్స్ కేవలం ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి కానీ ప్రమాదాలను నివారించలేవనే విషయాన్ని గుర్తుంచుకుని అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయాలి.

కారు భద్రతకు సంబంధించి మరికొన్ని కీలకమైన అంశాలు
ఎయిర్‌బ్యాగ్ పనిచేసే విధానం: కారు ఏదైనా వస్తువును బలంగా ఢీకొట్టినప్పుడు, ముందు భాగంలో ఉండే క్రాష్ సెన్సార్లు (Crash Sensors) క్షణంలో ఒకటో వంతు కాలంలోనే సిగ్నల్‌ను ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌కు పంపుతాయి. ఆ వెంటనే అందులోని సోడియం అజైడ్ అనే రసాయనం మండి నైట్రోజన్ గ్యాస్ విడుదలవుతుంది. ఈ గ్యాస్ వల్ల ఎయిర్‌బ్యాగ్ కేవలం 0.03 సెకన్లలోనే ఒక చిన్న పిల్లో (దిండు) లాగా ఉబ్బి ముందుకు వస్తుంది. 

Also Read: Five Best Electric SUVs: పెట్రోల్ డీజిల్ ధరల సెగ-  మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే

భారత ప్రభుత్వ కొత్త నిబంధనలు: రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు భారత ప్రభుత్వం కార్లలో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారయ్యే అన్ని ప్యాసింజర్ కార్లలో కనీసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్, కో-డ్రైవర్ కోసం) ఉండటాన్ని ప్రభుత్వం ఇప్పటికే తప్పనిసరి చేసింది. రాబోయే రోజుల్లో అన్ని కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా మార్చాలని ఆటోమొబైల్ సంస్థలకు సూచించింది. 

భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP): భారత్ సొంతంగా కార్ల భద్రతను పరీక్షించడానికి New Car Assessment Programme ను మొదలుపెట్టింది. ఇందులో కార్లను క్రాష్ టెస్ట్ చేసి 1 నుండి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇస్తారు. కారు కొనేటప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు సేఫ్టీ రేటింగ్‌ను కూడా గమనించాలి. 

Frequently Asked Questions

కారులో ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నా సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి?

ఎయిర్‌బ్యాగ్స్ సీట్ బెల్ట్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. సీట్ బెల్ట్ లేకపోతే, ఎయిర్‌బ్యాగ్ వేగంగా వచ్చి ముఖానికి లేదా ఛాతికి బలంగా తాకి ప్రాణాపాయం కలగవచ్చు.

కారు డ్యాష్‌బోర్డ్‌పై వస్తువులు ఉంచడం వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుంది?

ఎయిర్‌బ్యాగ్ తెరుచుకున్నప్పుడు, డ్యాష్‌బోర్డ్‌పై ఉన్న వస్తువులు తుపాకీ బుల్లెట్లలా దూసుకొచ్చి ప్రయాణికులకు గాయాలు కలిగించవచ్చు.

పిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టడం సురక్షితమేనా?

లేదు, చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు సీట్లో కూర్చోబెట్టకూడదు. ఎయిర్‌బ్యాగ్స్ పెద్దల కోసం డిజైన్ చేయబడ్డాయి, వాటి తీవ్రతను పిల్లలు తట్టుకోలేరు.

కారు స్క్రీన్‌పై ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ వెలిగితే ఏమి చేయాలి?

ఎయిర్‌బ్యాగ్ (SRS) వార్నింగ్ లైట్ వెలిగితే, వెంటనే కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
MG Motors and Spinny Partnership: ధైర్యంగా యూజ్డ్‌ ఈవీ కార్‌లు కొనవచ్చు! చేతులు కలిపిన రెండు కంపెనీలు! నచ్చకపోతే డబ్బులు వాపసు!
ధైర్యంగా యూజ్డ్‌ ఈవీ కార్‌లు కొనవచ్చు! చేతులు కలిపిన రెండు కంపెనీలు! నచ్చకపోతే డబ్బులు వాపసు!
Hybrid SUV Range: 1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
TVS ఎన్‌టార్క్ 125 పూర్తి వివరాలు - ధర, మైలేజ్, ఫీచర్లు, వేరియంట్లు ఎలా ఉన్నాయి?
TVS ఎన్‌టార్క్ 125 కొనేవాళ్లకు అలెర్ట్‌! ఇవి తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Hybrid SUV Range: 1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
Embed widget