Hero Glamour: 10 వేలకే హీరో గ్లామర్ బైక్ మీ సొంతం! EMI ఎంతంటే? తక్కువ బడ్జెట్, అదిరిపోయే మైలేజ్!
Hero Glamour on Road Price in Hyderabad:హీరో గ్లామర్ మైలేజ్: బైక్ గరిష్ట వేగం 95 kmph, ARAI ప్రకారం 65 kmpl మైలేజ్ ఇస్తుంది. ఫుల్ ట్యాంక్ తో 880 కిమీ వరకు ప్రయాణించవచ్చు.

Hero Glamour on Road Price in Hyderabad: భారతీయ మార్కెట్‌లో తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ కలిగి ఉండే బైక్‌లను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. కంపెనీలు కూడా అలాంటి బైక్స్ తయారు చేసేందుకే మొగ్గు చూపిస్తుంటాయి. మీరు కూడా అలాంటి బైక్ కోసం చూస్తున్నట్లయితే Hero Glamour మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అంతేకాకుండా, మీరు హీరో బైక్‌ను ఐదు వేల రూపాయల డౌన్ పేమెంట్ చేసి ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. మిగా డబ్బులను నెలనెల చెల్లించవచ్చు. ఈ బైక్‌ను ఫైనాన్స్ చేస్తే ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలో తెలుసుకుందాం.
ఎంత డౌన్ పేమెంట్ చేస్తే ఈ బైక్ వస్తుంది?
హైదరాబాద్‌లో Hero Glamour బేస్ డ్రమ్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు 1 లక్ష రూపాయలకుపైన అవుతుంది. ఇందులో ఎక్స్-షోరూమ్ ధరతో పాటు RTO ఛార్జీలు, బీమా మొత్తం కూడా ఉన్నాయి. బైక్ ఆన్-రోడ్ ధర నగరాలు వేరియంట్‌లను బట్టి మారవచ్చు.
ఈ బైక్ కొనుగోలు చేయడానికి మీరు కేవలం ఐదు వేల మూడు వందల రూపాయల డౌన్ పేమెంట్ చేస్తే చాలు మిగతా అమౌంట్‌ను నెల నెల వాయిదాల వారిగా చెల్లించుకోవచ్చు. దీని కోసం బ్యాంకులు మీకు రుణాన్ని అందిస్తాయి. మీరు లక్షరూపాయలకు లోన్‌కు వెళ్లొచ్చు.
పది శాతం వడ్డీకి ఈ లక్ష రూపాయలను రెండేళ్ల టెన్యూర్‌కు లోన్ తీసుకుంటే మీరు నెలకు ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు మూడేళ్ల టెన్యూర్‌తో లోన్ తీసుకుంటే 3,630 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి. నాలుగు ఏళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 2,932 కిస్తీ కట్టాలి. ఐదేళ్లకు తీసుకుంటే కేవలం 2,513 రూపాయలు చెల్లిస్తే చాలు. ఇది మీరు ఎంచుకునే బ్యాంకును, ఫైనాన్స్ కంపెనీ బట్టి వడ్డీ రేటు ఆధార పడి ఉంటుంది. వడ్డీ రేటు తగ్గితే మీకు ఈఎంఐలో కూడా మార్పు వస్తుంది. మీరు మొత్తంగా ఏడేళ్ల వరకు బ్యాంకు లోన్ తీసుకోవచ్చు.
Hero Glamour ఫీచర్లు అండ్ మైలేజ్
హీరో గ్లామర్ 125 ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇందులో LED హెడ్‌లైట్‌లతోపాటు హెజార్డ్ లైట్ ఉపయోగించారు. బైక్‌ను స్టార్ట్ చేయడానికి లేదా ఆపడానికి ఒక స్విచ్ ఇచ్చారు. ఈ బైక్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. బైక్‌లో USB ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా మీ మొబైల్‌కు ఛార్జింగ్ చేసుకోవచ్చు.
హీరో గ్లామర్ బైక్‌లో 124.7 cc, సింగిల్-సిలిండర్, ఎయిర్ కూల్డ్ OBD2B కంప్లైంట్ ఇంజిన్ ఉంది. బైక్ ఇంజిన్ 7500 rpm వద్ద 10.53 PS పవర్, 10.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హీరో ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. బైక్ టాప్ స్పీడ్ 95 kmph అండ్ ARAI-సర్టిఫైడ్ మైలేజ్ 65 kmpl. ఈ బైక్ ట్యాంక్ ఫుల్ చేస్తే 880 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.
హిరో గ్లామర్‌బైక్‌లోనే ఇంకో వేరియెంట్ ఉంది. అది డిస్క్‌బ్రేక్‌తో వస్తోంది. ఇప్పుడు చెప్పిన బైక్ కంటే దాని ఖరీదు ఐదారువేలు ఎక్కువ ఉంటుంది. బ్రేక్‌లలో తేడా మినహాయిస్తే మిగతా ఫీచర్స్ అంతా ఒకేలా ఉంటాయి. వెయిట్‌లో మాత్రం తేడా వస్తుంది.





















