అన్వేషించండి

BYD SEAL U: ఈ ‘సీల్’ని క్రియేట్ చేసింది బీవైడీ - కొత్త కారు లాంచ్ చేసిన చైనీస్ బ్రాండ్!

BYD New Car: ప్రముఖ చైనీస్ కార్ల కంపెనీ బీవైడీ తన కొత్త కారును మార్కెట్లో లాంచ్ చేసింది. అదే బీవైడీ సీల్ యూ.

BYD SEAL U: బీవైడీ తన సీల్ యూ ఎస్‌యూవీని జెనీవా మోటార్ షో 2024లో లాంచ్ చేసింది. ఇది సీల్ సెడాన్ తర్వాత లైనప్‌లో రెండో మోడల్‌గా నిలిచింది. బీవైడీ అనేది 2022లో 1.8 మిలియన్ వాహనాలు, 2023లో మూడు మిలియన్లకు పైగా అమ్మకాలతో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (PHEV), ఈవీలకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద తయారీదారు.

బీవైడీ సీల్ యూ ఎస్‌యూవీ ఎలా ఉంది?
సీల్డ్ యూ ఎస్‌యూవీ ఇప్పటికే చైనాలో బీవైడీ సాంగ్‌గా అమ్మకానికి అందుబాటులో ఉంది. దాని జెనీవా మోటార్ షో షోకేస్ బీవైడీ కంపెనీ. దీనిని యూరోపియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఇది ఐరోపా కోసం బీవైడీ లాంచ్ చేసిన మొదటి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనం. సీల్ యూ ఎస్‌యూవీ 4,775 మిల్లీమీటర్లు పొడవు, 1,890 మిల్లీమీటర్లు వెడల్పు, 1,670 మిల్లీమీటర్లు ఎత్తుగా ఉంది. అంటే ఇది సీల్ సెడాన్ కంటే చాలా పెద్దదన్న మాట.

బీవైడీ సీల్డ్ యూ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్
చైనాలో సీల్డ్ యూ ఎలక్ట్రిక్, పీహెచ్‌ఈవీ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్లు ఇతర ప్రపంచ మార్కెట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఈవీ 71 కేడబ్ల్యూహెచ్, 87 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇవి వరుసగా 520 కిలోమీటర్లు, 605 కిలోమీటర్లు (చైనీస్ సీఎల్టీసీ టెస్టింగ్ సైకిల్) రేంజ్‌ను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. సీల్ యూ ఈవీలో రెండు పవర్ అవుట్‌పుట్‌లతో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇవి 207 హెచ్‌పీ, 221 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తాయి. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 175 కిలోమీటర్లుగా ఉంది.

అయితే పీహెచ్‌ఈవీ వేరియంట్ 107 హెచ్‌పీ, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్‌తో 197 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో అమర్చారు. దీని 18.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కేవలం 110 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రేంజ్‌ను అందిస్తుంది. దాదాపు 35 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది స్టాండర్డ్‌గా వెహికల్ టు లోడ్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తుంది.

బీవైడీ సీల్ యూ ఎస్‌యూవీ ఫీచర్లు
బీవైడీ సీల్ యూ 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, వేగన్ లెదర్ అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ సిస్టమ్, బ్రాండ్ 15.6 అంగుళాల రొటేటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ప్రామాణికంగా వస్తుంది. బీవైడీ ప్రస్తుతం భారతదేశంలో అటో 3 ఎస్‌యూవీ, ఈ6 ఎంపీవీలతో సహా రెండు ఈవీలను విక్రయిస్తుంది. అయితే బీవైడీ సెయిల్ సెడాన్ మార్చి 5వ తేదీన విడుదల కానుంది.

మరోవైపు బజాజ్ ఇప్పుడు భారతదేశంలో అప్‌డేట్ చేసిన పల్సర్ ఎన్‌ఎస్125ని కూడా విడుదల చేసింది. ఈ కొత్త పల్సర్ ఎన్ఎస్125 బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,04,922గా నిర్ణయించారు. దీని పాత మోడల్‌తో పోలిస్తే, కొత్త పల్సర్ ఇప్పుడు రూ. 5,000 ధర ఎక్కువ అయింది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?
హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget