అన్వేషించండి

Used Toyota Glanza: సెకండ్‌ హ్యాండ్‌ టయోటా గ్లాంజా కొంటున్నారా?, ఖచ్చితంగా గమనించాల్సిన 5 ముఖ్య విషయాలు

Buying Used Toyota Glanza: టయోటా గ్లాంజా వాడిన కారు కొనాలని అనుకుంటున్నారా?, చెక్‌పాయింట్లు & జాగ్రత్తలు గురించి తెలుసుకోండి. మీ డబ్బు వృథా కాకుండా ఈ గైడ్‌ చదవండి.

Second Hand Car Buying Guide 2025: టయోటా గ్లాంజా అంటే సాదాసీదా కారు కాదు, ఇది ఒరిజినల్‌ "Maruti Suzuki Baleno” కి కాపీ క్యాట్‌. అయినా, టయోటా బ్రాండ్‌తో మరింత నమ్మకం కలిగించే కారు. అందుకే, వాడిన/సెకండ్‌ హ్యాండ్‌ గ్లాంజా కొనాలా అని ఆలోచిస్తున్నవారికి ఇది ఒక సూపర్‌ చాయిస్‌.

గ్లాంజా ఎందుకు ప్రత్యేకం?
మారుతి సుజుకి బాలెనో ఆధారంగా తయారైన టయోటా గ్లాంజా ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌. ఇందులో పెద్ద స్పేస్‌, మంచి ఫీచర్లు, మైలేజ్‌, కంఫర్ట్‌ అన్నీ ఉన్నాయి. కొత్త జనరేషన్‌ గ్లాంజా 2022 మార్చిలో లాంచ్‌ అయ్యింది. ముందు ఉన్న మోడల్‌తో పోలిస్తే ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. కెమ్రీ లాంటి గ్రిల్‌, స్పోర్టీ బంపర్‌, కొత్త అలాయ్స్‌, LED హెడ్‌ల్యాంప్స్‌ ఇవన్నీ దీని లుక్‌ను షార్ప్‌గా మార్చాయి. లోపల బ్లాక్‌ అండ్‌ బీజ్‌ టోన్‌ కాంబినేషన్‌తో ఉన్న కేబిన్‌ ఫ్యామిలీ యూజ్‌కి బాగుంటుంది.

ఇంజిన్‌ & మైలేజ్‌
గ్లాంజాలో 1.2 లీటర్‌, 4-సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 90హెచ్‌పీ పవర్‌, 113ఎన్‌ఎం టార్క్‌ ఇస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్‌ AMT ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు ఉన్నాయి. CNG వెర్షన్‌ కూడా ఉంది, అది 77హెచ్‌పీ పవర్‌ ఇస్తుంది. పెట్రోల్‌ వెర్షన్‌ లీటరుకు 22 కి.మీ.ల మైలేజ్‌ ఇస్తే, CNG వెర్షన్‌ కిలోకు 30.61 కి.మీ. ఇస్తుంది. రోజూ ఎక్కువ డ్రైవ్‌ చేసే వాళ్లు CNG వెర్షన్‌ తీసుకోవచ్చు కానీ బూట్‌ స్పేస్‌ కొంత తగ్గుతుంది.

వేరియంట్లు & ఫీచర్లు
గ్లాంజాలో E, S, G, V అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి. V అనేది టాప్‌ మోడల్‌, దీనిలో 360° కెమెరా, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌, ఆటో LED హెడ్‌ల్యాంప్స్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి హై-ఎండ్‌ ఫీచర్లు ఉన్నాయి. మధ్య వేరియంట్‌ G కూడా అవసరాలకు సరిపోతుంది. మీది బడ్జెట్‌ తక్కువ అయితే S మోడల్‌ కూడా బేసిక్‌ అవసరాలు నెరవేరుస్తుంది.

టయోటా వారంటీ అదనపు ప్రయోజనం
గ్లాంజా తీసుకోవడానికి ఒక పెద్ద కారణం దాని వారంటీ. టయోటా, 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ. (ఏది ముందయితే అది) వారంటీ ఇస్తుంది. ఈ వారంటీని 5 సంవత్సరాలు/2,20,000 కి.మీ. వరకూ పొడిగించుకోవచ్చు. బాలెనోలో మాత్రం కేవలం 2 సంవత్సరాలు/40,000 కి.మీ. మాత్రమే ఉంది. అంటే మీరు సెకండ్‌ హ్యాండ్‌ గ్లాంజా కారు తీసుకున్నా, దాని వారంటీ ఇంకా మిగిలుండే అవకాశం ఉంది.

కొనుగోలు ముందు గమనించాల్సినవి

AMT గేర్‌బాక్స్‌ చెక్‌ చేయండి - టెస్ట్‌ డ్రైవ్‌లో కారు సాఫీగా నడుస్తుందా, షిఫ్ట్స్‌ స్మూత్‌గా ఉన్నాయా అని చూసుకోండి.

టచ్‌స్క్రీన్‌ పని చేస్తుందా చూడండి - ల్యాగ్‌, ఫ్రీజ్‌, మొబైల్‌ కనెక్ట్‌ సమస్యలు ఉన్నాయా అన్నది పరిశీలించండి.

రీకాల్‌ హిస్టరీ చెక్‌ చేయండి - 2022 డిసెంబర్‌ 8 నుంచి 2023 జనవరి 12 వరకు తయారైన కొన్ని కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ ఇష్యూలు వచ్చాయి. ఆ రీప్లేస్‌ జరిగిందో, లేదో సర్వీస్‌ రికార్డులు చూడండి.

ధర & రీసేల్‌ విలువ
వాడిన గ్లాంజా ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఇది ఇంకా సేల్స్‌లో ఉంది. మార్కెట్లో ₹6.5 లక్షల నుంచి ₹8 లక్షల వరకు దొరుకుతుంది. కానీ ₹8 లక్షలకు మించి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొత్త గ్లాంజా దాదాపు అదే ధరలో లభిస్తుంది.

కండిషన్‌లో ఉన్న యూజ్డ్‌ టయోటా గ్లాంజా కారు తీసుకోవడం ఒక తెలివైన నిర్ణయం అవుతుంది - మంచి మైలేజ్‌, స్మూత్‌ డ్రైవ్‌, శక్తిమంతమైన ఇంజిన్‌ & టయోటా వారంటీ కలసి మీకు మంచి విలువ ఇస్తాయి. కొనుగోలు ముందు ఈ చెక్‌లిస్ట్‌ పాటిస్తే, సేఫ్‌ డీల్‌ ఖాయం!.

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget