First Flying Bike in the World: ప్రపంచంలోనే మొట్టమొదటి గాల్లో ఎగిరే బైక్ - బుకింగ్స్ ప్రారంభం - ధర కూడా గాల్లోనే!
ప్రపంచంలో మొట్టమొదటిసారి గాల్లో ఎగిరే బైక్‌లను జెట్‌ప్యాక్ ఏవియేషన్ రూపొందించింది.
World's First Flying Bike: ఇప్పటి వరకు రోడ్లపై నడిచే బైక్‌లు, త్వరలో ఆకాశంలో పరుగెత్తడం చూడవచ్చు. ఆకాశంలో ఎగిరే బైక్‌కు సంబంధించిన బుకింగ్ కూడా మొదలైంది. అమెరికన్ ఏవియేషన్ కంపెనీ జెట్‌ప్యాక్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. 30 నిమిషాల్లో 96 కిలోమీటర్ల ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ బైక్‌లో ఎనిమిది శక్తివంతమైన జెట్ ఇంజన్లను ఉపయోగించారు.
డిజైన్ ఎలా ఉందంటే?
దీని అసలు డిజైన్‌లో నాలుగు జెట్ ఇంజన్లు చూపించారు. అయితే లాంచ్ అయ్యే మోడల్లో ఎనిమిది జెట్ ఇంజన్లు ఉండనున్నాయి. అంటే నాలుగు మూలల్లో రెండేసి జెట్ ఇంజన్లు ఉంటాయన్న మాట. ఇది రైడర్‌కు రక్షణ కల్పిస్తుంది. ఈ బైక్ మొత్తంగా 250 కిలోల వరకు బరువును మోయగలదు.
గంటకు 400 కిలోమీటర్లు
ఈ గాలిలో ఎగిరే మోటార్‌సైకిల్ వేగం గరిష్టంగా గంటకు 400 కిలోమీటర్లు. అయితే ఈ వేగంతో ప్రయాణించడం కష్టంగా అనిపించవచ్చు. కాబట్టి రిస్క్‌ను అవాయిడ్ చేయడానికి కొంచెం తక్కువ వేగంతో వెళ్తే మంచిది.
16,000 అడుగుల ఎత్తు వరకు
కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ బైక్‌ను గాలిలో 16,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లవచ్చు. అయితే ఈ ఎత్తుకు వెళ్లినప్పుడు దాని ఇంధనం అయిపోతుంది. పైలట్, రైడర్ సురక్షితంగా నేలపైకి తిరిగి రావడానికి పారాచూట్ అవసరం అవుతుంది.
వీడియో గేమ్ లాగా ఉండే కంట్రోల్ సిస్టమ్
ఈ బైక్ రైడ్ చేయడానికి మాత్రమే కాకుండా, దాన్ని చూడటానికి కూడా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఈ బైక్‌ను గాలిలో ఎగిరేలా చేసేందుకు యుద్ధ విమానాల్లో ఉపయోగించే ఫ్లై-బై-వైర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీన్ని హ్యాండ్‌గ్రిప్‌లో ఉన్న బటన్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ఒక బటన్ టేకాఫ్, ల్యాండ్ అవ్వడానికి, మరొకటి దానిని ఎత్తుకు తీసుకెళ్లడం ద్వారా స్పీడ్ ఇవ్వడానికి ఉపయోగించవచ్చు.
యాక్సిడెంట్లను నియంత్రించే సెన్సార్లు
భద్రతను దృష్టిలో ఉంచుకుని, దాని నియంత్రణ యూనిట్‌లో సెన్సార్లు ఉపయోగించారు. ఇవి ఎగిరే సమయంలో ఫ్లైట్ దిశ గురించిన సమాచారాన్ని ఉంచడంతో పాటు, చెట్టు లేదా భవనం వంటివి ఏదైనా దాని ఎదురుగా వచ్చినప్పుడు దానిని ఢీకొనకుండా రక్షించగలదు.
View this post on Instagram