అన్వేషించండి

Boman Irani Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S – బోమన్ ఇరానీ గ్యారేజీలోకి చేరిన సరికొత్త ఎలక్ట్రిక్ బీస్ట్! ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Boman Irani Mahindra XEV 9S: బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ మహీంద్రా XEV 9S ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఇది అత్యాధునిక ఫీచర్లు కలిగిన 7-సీటర్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు బోమన్ ఇరానీ పర్యావరణ హితమైన XEV 9S కారు తీసుకున్నారు.
  • ఈ 7-సీటర్ ప్రీమియం ఈవీ అత్యాధునిక టెక్నాలజీతో వస్తుంది.
  • స్టైలిష్ డిజైన్, లగ్జరీ ఇంటీరియర్‌తో కారు ఆకట్టుకుంటుంది.
  • అధునాతన భద్రతా ఫీచర్లు, ADAS టెక్నాలజీతో వస్తుంది.

Boman Irani Mahindra XEV 9S: ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ పర్యావరణ హితమైన జ‌ర్నీ వైపు అడుగులు వేశారు. మహీంద్రా సంస్థ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 'XEV 9S' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆయన తాజాగా డెలివరీ తీసుకున్నారు. ఇది 7-సీటర్ సౌకర్యంతో వస్తున్న ప్రీమియం ఫ్యామిలీ ఈవీ. లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలకు అనువుగా, ఆధునిక టెక్నాలజీతో ఈ కారును మహీంద్రా తీర్చిదిద్దింది. ఈ కారులో 59 kWh, 70 kWh, 79 kWh అనే మూడు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా 170 kW నుండి 210 kW వరకు గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తాయి. మహీంద్రాకు చెందిన 'INGLO' ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందిన ఈ వాహనం సిటీ ప్రయాణాలకు, హైవే డ్రైవింగ్‌కు అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.

స్టైలిష్ ఎక్స్‌టీరియర్ డిజైన్

డిజైన్ పరంగా XEV 9S సరికొత్త లుక్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో గ్రిల్ లేకుండా క్లోజ్డ్ డిజైన్, స్లీక్ ఎల్‌ఈడీ లైట్ బార్, ఎల్-షేప్ డీఆర్‌ఎల్‌లు (DRLs) ఉన్నాయి. వెర్టికల్ హెడ్ ల్యాంప్స్ కారుకు ఒక డిఫ‌రెంట్ లుక్ ని ఇస్తాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎరోడైనమిక్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ కారుకు ప్రీమియం అప్పీల్ ఇస్తాయి. వెనుక వైపు మహీంద్రా ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ ఈ కారు ప్రత్యేకతను చాటుతుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahindra NBS International (@nbs_international.mahindra)

లగ్జరీ ఇంటీరియర్, ఫీచర్లు

కారు లోపలి భాగం చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో 527 లీటర్ల బూట్ స్పేస్, ముందు భాగంలో 150 లీటర్ల ఫ్రంక్ (Frunk) సౌకర్యం ఉంది. రెండో వరుస సీట్లలో వెంటిలేషన్, రిక్లైన్, స్లైడ్ ఫంక్షన్లతో పాటు 'బాస్ మోడ్' (Boss Mode) ఫీచర్ కూడా ఉంది. డ్యాష్‌బోర్డ్‌పై మూడు భారీ 31.24 సెంటీమీటర్ల డిస్‌ప్లేలు ఉన్నాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసే 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ లవర్స్‌కు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 5G కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సేఫ్టీలో నంబర్ వన్

సెక్యూరిటీ విషయంలో మహీంద్రా రాజీ పడలేదు. ఇందులో ఏడు ఎయిర్ బ్యాగ్‌లు, లెవల్ 2+ అడాస్ (ADAS) టెక్నాలజీ ఉన్నాయి. డ్రైవర్ నిద్రమత్తును గుర్తించే సిస్టమ్, 360-డిగ్రీ మానిటరింగ్ కెమెరా వంటివి ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి. రూ. 19.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రస్తుతం మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. బోమన్ ఇరానీ వంటి సెలబ్రిటీలు ఈ కారును ఎంచుకోవడం దీని క్రేజ్‌ను మరింత పెంచుతోంది.

Frequently Asked Questions

బోమన్ ఇరానీ ఏ కొత్త కారును కొనుగోలు చేశారు?

ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ మహీంద్రా సంస్థకు చెందిన 'XEV 9S' ఎలక్ట్రిక్ ఎస్యూవీని తాజాగా కొనుగోలు చేశారు.

మహీంద్రా XEV 9S కారులో ఎన్ని సీట్లు ఉంటాయి?

ఈ ప్రీమియం ఫ్యామిలీ ఈవీ 7-సీటర్ సౌకర్యంతో వస్తుంది, ఇది లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.

XEV 9S ఎలక్ట్రిక్ కారులో ఎలాంటి బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి?

ఈ కారులో 59 kWh, 70 kWh, మరియు 79 kWh అనే మూడు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

XEV 9S కారులో ముఖ్యమైన ఇంటీరియర్ ఫీచర్లు ఏమిటి?

ఈ కారులో విశాలమైన ఇంటీరియర్, 527 లీటర్ల బూట్ స్పేస్, 150 లీటర్ల ఫ్రంక్, వెంటిలేషన్, రిక్లైన్, స్లైడ్ ఫంక్షన్లతో కూడిన రెండో వరుస సీట్లు, మరియు 31.24 సెం.మీ. మూడు డిస్ప్లేలు ఉన్నాయి.

XEV 9S కారులో భద్రతా ఫీచర్లు ఏమిటి?

భద్రత విషయంలో, ఈ కారులో ఏడు ఎయిర్ బ్యాగ్స్, లెవల్ 2+ ADAS టెక్నాలజీ, డ్రైవర్ నిద్రమత్తును గుర్తించే సిస్టమ్, మరియు 360-డిగ్రీ మానిటరింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget