వావ్ అనిపించే లుక్ తో సూపర్ లగ్జరీ కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ.. ధర ఎంతంటే?
దిగ్గజ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ మనదేశంలో కొత్త కార్లను లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్ స్పోర్ట్ ఎక్స్ ప్లస్ కొత్త వేరియంట్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది.
బీఎండబ్ల్యూ మనదేశంలో ఎక్స్5 ఎక్స్ డ్రైవ్ స్పోర్ట్ ఎక్స్ ప్లస్ కొత్త వేరియంట్లను మనదేశంలో లాంచ్ చేసింది. వీటిలో ఎక్స్ డ్రైవ్ 40ఐ పెట్రో వేరియంట్ ధర రూ.77.90 లక్షలుగానూ(ఎక్స్-షోరూం), ఎక్స్ డ్రైవ్ 30డీ డీజిల్ వేరియంట్ ధర రూ.79.50 లక్షలుగా(ఎక్స్-షోరూం) నిర్ణయించారు. ఈ రెండు వేరియంట్లూ బీఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్ లోనే తయారు అవుతున్నాయి.
అయితే లుక్ విషయంలో మాత్రం ఈ వేరియంట్ గతంలో లాంచ్ అయిన మోడళ్ల తరహాలోనే ఉంది. ముందువైపు ఎల్ఈడీ హెడ్ లైట్లు, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, 3డీ ర్యాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లను ఇందులో అందించారు.
క్యాబిన్ లేఅవుట్లో కూడా పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించలేదు. స్టీరింగ్ వీల్ ను లెదర్ ను కూడా ఇందులో చూడవచ్చు. మెమొరీ ఫంక్షన్ ఉన్న ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్ మెంట్,- వింగ్ మిర్రర్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెల్ కం లైట్ కార్పెట్, ఆరు డిమ్మబుల్ డిజైన్లు ఉన్న యాంబియంట్ లైటింగ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
దీంతోపాటు బీఎండబ్ల్యూ డిస్ ప్లే కీ, హెడ్ అప్ డిస్ ప్లే, వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బీఎండబ్ల్యూ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం 7.0ని సపోర్ట్ చేసే లైవ్ కాక్ పిట్ ప్రొఫెషనల్, 3డీ నేవిగేషన్ కూడా ఇందులో ఉన్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్ 30డీలో 3.0 లీటర్, 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్ ను అందించారు. 263 బీహెచ్ పీ, 620 ఎన్ఎం పీక్ టార్క్ ను ఈ ఇంజిన్ అందించనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి కేవలం 6.5 సెకన్లలోనే ఈ కారు చేరుకుంటుంది.
ఇక బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్ 40ఐ ఇంజిన్ 337 బీహెచ్ పీ, 450 ఎన్ఎం పీక్ టార్క్ ను అందించనున్నాయి. 0 నుంచి 100 కిలోమీటర్లకు కేవలం 5.5 సెకన్లలోనే చేరుకునే సామర్థ్యం ఈ ఇంజిన్ కు ఉంది.
ఇందులో ఇంటెలిజంట్ ఆల్-వీల్-డ్రైవ్(ఏడబ్ల్యూడీ) సిస్టం, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ ఆటోమేటిక్ డిఫరెన్షియల్ బ్రేకులు, లాకులు, ఎక్స్ టెండెడ్ డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్(డీటీసీ), హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోలో, అడాప్టివ్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: Affordable Cars: తక్కువ ధరలో కారు కొనాలనుకుంటున్నారా.. రూ.4 లక్షల్లో టాప్-3 ఇవే!
Also Read: Realme New Phone: రూ.10 వేలలోపే రానున్న రియల్ మీ కొత్త ఫోన్.. అదిరిపోయే కెమెరా!