BMW M 1000 RR: ఫార్ట్యూనర్ కంటే ఎక్కువ ధరతో లాంచ్ అయిన బైక్ - మూడు సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్!
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ సూపర్ బైక్ మనదేశంలో లాంచ్ అయింది.
BMW M 1000 RR Launched: బీఎండబ్ల్యూ తన మోస్ట్ అవైటెడ్ బైక్‌ను ఎట్టకేలకు మనదేశంలో లాంచ్ చేసింది. అదే బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్. ఇది ఇటీవల చాలాసార్లు రోడ్ల మీద కనిపించింది. దీని విడుదల కోసం మనదేశంలో ప్రీమియం బైక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సీబీయూ ద్వారా విక్రయాలు
బీఎండబ్ల్యూ ఈ బైక్‌ను భారతీయ మార్కెట్లో సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్స్) ద్వారా విక్రయించనుంది. ఇది భారత మార్కెట్లో కంపెనీ లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంటుంది. ఈ బైక్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే దీని డెలివరీలు నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి.
ఈ బైక్ బేస్ వేరియంట్ రెండు రంగులలో లభిస్తుంది. అవి లైట్ వైట్, ఎం మోటార్‌స్పోర్ట్. అదే సమయంలో దీని టాప్ ఎండ్ వేరియంట్ ‘కాంపిటీషన్’ బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, ఎం మోటార్‌స్పోర్ట్ ఆప్షన్‌తో రానుంది.
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ పవర్ ఎంత?
బీఎండబ్ల్యూ ఈ బైక్‌లో 999 సీసీ ఇన్‌లైన్ 4 సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఇది 212 హెచ్‌పీ పవర్‌ను, 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 3.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది.
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఫీచర్లు
ఈ బైక్ ఫీచర్ల గురించి చెప్పాలంటే దీనికి జీపీఎస్ డేటా లాగర్, 6.5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే అందిస్తున్నారు. రెయిన్, రోడ్, డైనమిక్, రేస్ వంటి రైడింగ్ మోడ్స్ కూడా ఈ బైక్‌లో ఉన్నాయి. కస్టమైజ్డ్ రేస్ ప్రో 1-3 ఫీచర్ కూడా అందించారు.
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ధర ఎంత?
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ బైక్‌ను రూ. 49 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. దీని టాప్ ఎండ్ వేరియంట్ కాంపిటీషన్‌ను రూ. 55 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ఫార్ట్యూనర్ కారు కంటే ఎక్కువ ధర.
దీనికి పోటీనిచ్చేవి ఏవి?
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్‌కు పోటీని ఇచ్చే బైక్‌ల జాబితాలో డుకాటి పానిగేల్ వీ4 ఎస్‌పీ2, ఇండియన్ మోటార్‌సైకిల్ పర్స్యూట్, ఇండియన్ మోటార్‌సైకిల్ రోడ్‌మాస్టర్, హోండా గోల్డ్ వింగ్ వంటివి ఉన్నాయి.
టయోటా కిర్లోస్కర్ మోటార్ 2022 సెకండాఫ్‌లో భారతదేశంలో దాని మిడ్ రేంజ్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కారును లాంచ్ చేసిన దగ్గర నుండి ప్రజలు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు. మొదట్లో ఈ కారుకు సంబంధించి కంపెనీ అంతా బాగానే చూసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం వినియోగదారులు దాని డెలివరీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది.
దీని కారణంగా ప్రజలు ఇప్పుడు హైరైడర్‌పై కాకుండా ఇతర ఆప్షన్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. దీని కారణంగా హైరైడర్ మార్కెట్‌కు దెబ్బ పడుతోంది. ఈ దెబ్బ వల్ల అతిపెద్ద ప్రయోజనం మారుతి సుజుకి గ్రాండ్ విటారాకు దక్కుతుంది. ఎందుకంటే ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తయారయ్యాయి. ఈ రెండిటి డిజైన్, లుక్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. మరోవైపు టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీలో కొన్ని వేరియంట్‌ల వెయిటింగ్ పీరియడ్ ఏకంగా ఒకటిన్నర సంవత్సరం కంటే ఎక్కువగా ఉంది. అంటే మీరు దీని కోసం చాలా కాలం వేచి ఉండాలన్న మాట.