అన్వేషించండి

BMW F 450 RR వేరియంట్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? టాప్‌ మోడల్‌లో స్పెషల్‌ ఏంటి?

BMW F 450 RR నాలుగు వేరియంట్ల ఫీచర్లు, రైడింగ్‌ మోడ్‌లు, సస్పెన్షన్‌, క్లచ్‌ టెక్నాలజీ, 420 సీసీ ఇంజిన్‌ వివరాలను తెలుసుకోండి.

BMW F 450 RR variants: ప్రీమియం స్పోర్ట్స్‌ బైక్‌ కొనాలనుకునేవారికి బీఎండబ్ల్యూ మోటరాడ్‌ మరో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. అదే.. BMW F 450 RR. 450 ప్లాట్‌ఫామ్‌పై ఈ కంపెనీ తీసుకొచ్చిన మూడో మోటార్‌సైకిల్‌ ఇది. ఇప్పటికే F 450 GS, F 450 R మోడళ్లను పరిచయం చేసిన BMW.. ఇప్పుడు స్పోర్టీ లుక్‌, ఆధునిక రైడింగ్‌ టెక్నాలజీతో F 450 RRను తీసుకొచ్చింది.

ఈ బైక్‌ నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది, అవి.. బేస్‌, ఎక్స్‌క్లూజివ్‌, ఎం స్పోర్ట్‌, ఇన్నోవేషన్‌ ప్యాకేజీతో కూడిన ఎం స్పోర్ట్‌. వీటిలో ఎన్ని వేరియంట్లు భారత మార్కెట్‌లోకి వస్తాయి? వాటి ధరలు ఎంత ఉంటాయి? అనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రతి వేరియంట్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Base వేరియంట్‌: అవసరమైన ఫీచర్లతో..

బీఎండబ్ల్యూ ఎఫ్‌ 450 ఆర్ఆర్‌ బేస్‌ వేరియంట్‌ కాస్మిక్‌ బ్లాక్‌ రంగులో మాత్రమే లభిస్తుంది. ఇందులో భద్రతకు సంబంధించిన కీలక ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌, కార్నరింగ్‌ ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, వీలీ కంట్రోల్‌ అందించారు. స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌ కూడా ఉంది.

ఇందులో 6.5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంటుంది. రైన్‌, రోడ్‌, రేస్‌ అనే మూడు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. చల్లని వాతావరణంలో ఉపయోగపడే హీటెడ్‌ గ్రిప్స్‌ కూడా ఇచ్చారు. డైనమిక్‌ బ్రేక్‌ కంట్రోల్‌, ఇంజిన్‌ డ్రాగ్‌ టార్క్‌ కంట్రోల్‌ వంటి వ్యవస్థలు అదనపు భద్రతను అందిస్తాయి.

సస్పెన్షన్‌ విషయానికి వస్తే, వెనుక మోనోషాక్‌లో ప్రీలోడ్‌, రీబౌండ్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. ముందు యూఎస్‌డీ ఫోర్క్‌లో మాత్రం సర్దుబాటు సౌకర్యం లేదు.

ఇది కూడా చదవండి: RE Bear 650 Review: ఇంటర్‌సెప్టర్ 650 ఉండగా బేర్ 650 ఎందుకు కొనాలి? మూడు నెలల వాడకంలో తెలిసిన ఆసక్తికర విషయాలివే!

Exclusive: మెరుగైన సస్పెన్షన్‌తో..

రెండో వేరియంట్‌ ఎక్స్‌క్లూజివ్‌. ఇది రేసింగ్‌ రెడ్‌ రంగులో లభిస్తుంది. బేస్‌ వేరియంట్‌లోని అన్ని ఫీచర్లు ఇందులోనూ ఉంటాయి. అదనంగా రెండు దిశల్లో పనిచేసే క్విక్‌షిఫ్టర్‌ ఇచ్చారు. దీంతో క్లచ్‌ లీవర్‌ను ప్రతిసారీ ఉపయోగించకుండానే గేర్లు మార్చుకోవచ్చు.

ఈ వేరియంట్‌లో స్పోర్ట్‌ సస్పెన్షన్‌ ప్రత్యేకత. ముందు యూఎస్‌డీ ఫోర్క్‌లో కంప్రెషన్‌, రీబౌండ్‌ సెట్టింగులను సర్దుబాటు చేసుకోవచ్చు. రైడింగ్‌ అవసరాలకు అనుగుణంగా సస్పెన్షన్‌ను మార్చుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.

M Sport: అదనపు రైడింగ్‌ మోడ్‌..

మూడో వేరియంట్‌ ఎం స్పోర్ట్‌. ఇది స్నేఫెల్‌ వైట్‌ అండ్‌ ఎం మోటార్‌స్పోర్ట్‌ రంగుల కలయికలో వస్తుంది. ఇందులో రేస్‌ ప్రో అనే నాలుగో రైడింగ్‌ మోడ్‌ను అందించారు.

ఈ మోడ్‌ ద్వారా ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి వ్యవస్థలను రైడర్‌ తన అవసరాలకు అనుగుణంగా విడివిడిగా మార్చుకోవచ్చు. బైక్‌ నియంత్రణ వ్యవస్థలపై మరింత వ్యక్తిగత నియంత్రణ కోరుకునే వారికి ఈ వేరియంట్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon

M Sport with Innovation Package: టాప్‌ వేరియంట్‌ ప్రత్యేకత ఇదే!

ఈ సిరీస్‌లో అగ్రస్థానంలో ఉన్న వేరియంట్‌ ఎం స్పోర్ట్‌ విత్‌ ఇన్నోవేషన్‌ ప్యాకేజీ. ఇందులోనూ స్నేఫెల్‌ వైట్‌ అండ్‌ ఎం మోటార్‌స్పోర్ట్‌ రంగులే ఉంటాయి. అయితే దీని ప్రత్యేకత ఈజీ రైడ్‌ క్లచ్‌ (ఈఆర్‌సీ) వ్యవస్థ.

ఈ టెక్నాలజీని తొలిసారిగా ఎఫ్‌ 450 జీఎస్‌ జీఎస్‌ ట్రోఫీ వేరియంట్‌లో పరిచయం చేశారు. దీని వల్ల గేర్లు పైకి, కిందికి మార్చేటప్పుడు క్లచ్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అంటే క్లచ్‌ వినియోగాన్ని ఐచ్ఛికంగా మార్చుకోవచ్చు. గేర్లు మార్చడం మరింత సులభం కావడం ఈ ఫీచర్‌ ప్రధాన ప్రయోజనం.

అన్ని వేరియంట్లలో ఒకే ఇంజిన్‌..

బీఎండబ్ల్యూ ఎఫ్‌ 450 ఆర్ఆర్‌ నాలుగు వేరియంట్లలోనూ 420 సీసీ ట్విన్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8,750 ఆర్‌పీఎం వద్ద 48 హెచ్‌పీ పవర్‌, 6,750 ఆర్‌పీఎం వద్ద 43 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. సస్పెన్షన్‌ కోసం 43 మి.మీ. కేవైబీ యూఎస్‌డీ ఫోర్క్‌, వెనుక మోనోషాక్‌ ఇచ్చారు. బ్రేక్‌, క్లచ్‌ లీవర్లను సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంది. టైప్‌-సీ యూఎస్‌బీ పోర్ట్‌ కూడా అందించారు.

బ్రేకింగ్‌ వ్యవస్థలో ముందు 310 మి.మీ. బ్రెంబో డిస్క్‌తో నాలుగు పిస్టన్ల మోనోబ్లాక్‌ కాలిపర్‌ ఉంది. వెనుక 240 మి.మీ. బైబ్రే డిస్క్‌తో సింగిల్‌ పిస్టన్‌ కాలిపర్‌ ఇచ్చారు.

మొత్తంగా చూస్తే, బేస్‌ వేరియంట్‌లోనే కీలక భద్రత ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన సస్పెన్షన్‌ కావాలంటే ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌ను పరిశీలించవచ్చు. రైడింగ్‌ సెట్టింగులపై మరింత నియంత్రణ కోసం ఎం స్పోర్ట్‌ ఉపయోగపడుతుంది. క్లచ్‌ లేకుండానే గేర్లు మార్చుకునే సౌకర్యం కావాలంటే టాప్‌ వేరియంట్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే.. భారత మార్కెట్‌లో వేరియంట్లు, ధరలు ప్రకటించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Car Diwali Offers: మారుతి కార్లపై నవంబర్ ఆఫర్లు.. Wagon R, Alto K10 సహా చాలా మోడళ్లపై రూ.1.51 లక్షల వరకు డిస్కౌంట్లు!
మారుతి కార్లపై భారీగా పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.51 లక్షల వరకు ప్రయోజనాలు!
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget