Best Used Cars in India: రూ.10 లక్షల్లోపు బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు ఇవే - కళ్లు మూసుకుని కొనేయచ్చు!
Best Budget Used Cars in India: మీరు మంచి సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.10 లక్షల్లోపే ఉందా? అయితే ఈ ప్రైస్‌లో మార్కెట్లో కొన్ని అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Best Used Cars Under Rs 10 Lakh: కొత్త కారుకు ఎక్కువ ధర పెట్టడం కంటే తక్కువ డబ్బులు పెట్టి మంచి కండీషన్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారు కొనడం మంచిదని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ దానికి బాగా రీసెర్చ్ చేయడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం మనదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ మంచి బూమ్‌లో ఉంది. రూ.10 లక్షల ధరలో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.10 లక్షల్లోపు ధరలో మీకు కింద చెప్పిన కార్లు మంచి కండీషన్‌లో దొరికితే కళ్లు మూసుకుని కొనేసుకోవచ్చు.
1. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో మనదేశంలో హ్యుందాయ్ క్రెటాకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఫస్ట్ జనరేషన్ మోడల్ కారు చూడటానికి కూడా చాలా స్మార్ట్‌గా ఉంటుంది. ఇప్పటికీ అప్‌డేటెడ్‌గా అనిపించే ఫీచర్లు ఇందులో చాలా ఉన్నాయి. ఈ కారులో 1.6 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది. సాధారణంగా ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లలో ఏదైనా సమస్య తలెత్తితే దాన్ని రిపేర్ చేయించడం అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఈ కారులో ఆ సమస్య ఉండదు. 1.4 లీటర్ డీజిల్ వేరియంట్ పవర్ కాస్త తక్కువగా ఉంటుంది. 1.6 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఉన్న వేరియంట్లు రూ.8 లక్షల ధరలో అందుబాటులో ఉంటే కండీషన్ చూసుకుని తీసుకోవచ్చు. కుదిరితే టాప్ ఎండ్ వేరియంట్లు అయిన ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(వో) మోడల్స్ కూడా కొనవచ్చు. వీటిలో బెస్ట్ ఫీచర్లు ఉంటాయి.
2. హోండా సిటీ ఫోర్త్ జనరేషన్ (Honda City 4th Generation)
హోండా సిటీ కారుకు మనదేశ మార్కెట్లో మంచి రెస్పెక్ట్ ఉంది. ఇందులో వీటెక్ వెర్షన్‌కు అయితే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. నాలుగో తరం హోండా సిటీలో 1.5 లీటర్ ఐ-వీటెక్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. 5 స్పీడ్ మాన్యువల్, సీవీటీ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ కూడా అందించారు. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఇది అందుబాటులో ఉంది. హోండా సిటీ అనేది చాలా కంఫర్టబుల్ కారు. సర్వీసింగ్‌కు కూడా ఎక్కువ ఖర్చు కాదు. హోండా సిటీ నాలుగో తరం కారు రూ.6 లక్షల రేంజ్‌లో మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉండవచ్చు. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్
3. మారుతి సుజుకి ఎస్-క్రాస్ (Maruti Suzuki S-Cross)
మారుతి సుజుకి మనదేశంలో విక్రయిస్తున్న బెస్ట్ కార్లలో ఎస్-క్రాస్ కూడా ఒకటి. కానీ దీని సేల్ ఎక్కువగా ఉండవు. కారణం ఏంటంటే ఒక హ్యాచ్ బ్యాక్ కారుకు అంత ఎక్కువ ధర పెట్టడం అన్నది బెడిసికొట్టింది. ఇందులో 1.3 లీటర్ డీజిల్, 1.6 లీటర్ డీజిల్, 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ కే-సిరీస్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. దీని రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రాక్టికల్ క్యాబిన్‌తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. రూ.10 లక్షల్లోపు ధరలో సెకండ్ హ్యాండ్ ఎస్-క్రాస్ కారు మిడ్ వేరియంట్ లేదా టాప్ వేరియంట్ వస్తే అది మంచి డీల్ అనుకోవచ్చు.
4. టయోటా ఫార్ట్యూనర్ (Toyota Fortuner)
భారతీయ మార్కెట్లో టయోటా ఫార్ట్యూనర్ ఒక లెజెండరీ వాహనం అని చెప్పవచ్చు. ఇందులో మొదటి జనరేషన్ మోడల్ 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వచ్చింది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆప్షనల్ ఫుల్ టైమ్ 4 వీల్ డ్రైవ్ సిస్టం అందుబాటులో ఉంది. ఇది చాలా సామర్థ్యం ఉన్న సిస్టం. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో ఎక్కువ మైలేజీని అందించే కార్లలో ఇది కూడా ఒకటి. పెద్ద కుటుంబం ఉన్నవారు ఎక్కడికైనా వెళ్లాలంటే ఇది వారికి ఉపయోగపడుతుంది. ఒకవేళ టయోటా ఫార్ట్యూనర్ కారు రూ.10 లక్షల ధరలో అందుబాటులోకి వస్తే కారు కండీషన్ చెక్ చేసుకుని, మీ ఫ్యామిలీ పెద్దది అయితే దీన్ని తీసుకోవడం బెస్ట్.
5. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford Ecosport)
భారత మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2013లో లాంచ్ అయింది. సబ్ 4 మీటర్ ఎస్‌యూవీల్లో ఉన్న మంచి కార్లలో ఇది కూడా ఒకటి. ఫోర్డ్ కార్లలో ఎక్కువగా అమ్ముడుపోయిన మోడల్ ఇదే. ఎన్నో ఇంజిన్,ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఈ కారులో ఉన్నాయి. మొదట 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది అందుబాటులోకి వచ్చింది. 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు తర్వాత డిస్‌కంటిన్యూ అయిపోయాయి. వీటిలో స్థానంలో 1.5 లీటర్ త్రీ సిలిండర్ డ్రాగన్ పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకువచ్చారు. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఈ కారులో ఉన్నాయి. ఫోర్డ్ మనదేశంలో డిస్‌కంటిన్యూ అయినా దీనికి సర్వీస్ సులభంగా లభిస్తుంది. వేరియంట్, కారు ఏజ్, మైలేజ్‌ని బట్టి ఫోర్డ్ ఎకో స్పోర్ట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ ధర రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి