అన్వేషించండి

CNG Cars With Sunroof: సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - మీరైతే ఏది కొంటారు?

Best CNG Cars With Sunroof: మనదేశంలో కొన్ని బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఉన్నాయి. వీటిలో సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఇటువంటి ఆప్షన్లలో బెస్ట్ ఏవో చూద్దాం.

CNG Cars: భారతదేశంలో ప్రజలు ఎక్కువగా సీఎన్‌జీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన ఎంపిక ఇప్పుడు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలతో సహా ఖరీదైన కార్లకు కూడా చేరుకుంది. ఇప్పుడు సీఎన్‌జీ కార్లలో టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, సన్‌రూఫ్ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో వచ్చే నాలుగు బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఏవో చూద్దాం.

టాటా అల్ట్రోజ్ సీఎన్‌జీ (Tata Altroz CNG)
ఈ జాబితాలో ఉన్న ఏకైక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన టాటా అల్ట్రోజ్ 2023 మేలో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను పొందింది. సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో పాటు అల్ట్రోజ్ సింగిల్ పేన్ సన్‌రూఫ్‌ను కూడా పొందుతుంది. ఇది మిడ్ స్పెక్ ఎక్స్ఎం+ (ఎస్) ట్రిమ్‌లో లభిస్తుంది. దీని ధర రూ. 8.85 లక్షలతో ప్రారంభమవుతుంది. అల్ట్రోజ్ సీఎన్‌జీ ట్విన్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది 210 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్-సీఎన్‌జీ ఇంజిన్‌తో నడిచే ఈ కారు సీఎన్‌జీ మోడ్‌లో 73.5 పీఎస్, 103 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)
ఆల్ట్రోజ్ లాగానే టాటా పంచ్ కూడా సీఎన్‌జీ ఇంజిన్ వేరియంట్లో సన్‌రూఫ్‌ను అందిస్తుంది. అయితే సన్‌రూఫ్ పంచ్ సీఎన్‌జీ అకాంప్లిష్డ్ డాజిల్ ఎస్ వేరియంట్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.9.68 లక్షలుగా ఉంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు పంచ్ సీఎన్‌జీ అందుబాటులో ఉన్నాయి. దీని సెక్యూరిటీ ఫీచర్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ ఉన్నాయి.

Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?

హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ (Hyundai Exter CNG)
సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో లాంచ్ అయినప్పటి నుంచి అందుబాటులో ఉంది. ఎక్స్‌టర్ ఎస్ఎక్స్ సీఎన్‌జీ వేరియంట్ సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో వస్తుంది. దీని ధర రూ. 9.06 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈ వేరియంట్‌లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి.

మారుతి బ్రెజా సీఎన్‌జీ (Maruti Brezza CNG)
మారుతి బ్రెజా భారతదేశంలో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్, సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో వచ్చిన ఏకైక సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ. జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీ వేరియంట్‌లో ఇది అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 12 లక్షలుగా నిర్ణయించారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ ఆర్కమీస్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లతో మారుతి బ్రెజా సీఎన్‌జీని కలిగి ఉంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget