నెలకు 500km తిరగడానికి ₹8 లక్షల్లో సీనియర్ సిటిజన్లకు సరైన బడ్జెట్ కారు ఇదేనా?
నెలకు సుమారు 500 కిలోమీటర్ల ప్రయాణం చేసే సీనియర్ సిటిజన్లకు ₹8 లక్షల లోపు సరైన కారు ఏది? కంఫర్ట్, మైలేజ్, సేఫ్టీ కలిసిన ఈ మారుతి కారు మంచి ఆప్షన్ అవుతుంది.

Best budget car for senior citizens India: సీనియర్ సిటిజన్‌లు పాత కారును మార్చాలని అనుకుంటున్నప్పుడు, లేదా మొదటిసారి కొత్త కారు తీసుకోవాలని భావిస్తున్నప్పుడు... కారు ఎంపికలో కొన్ని అంశాలు చాలా కీలకంగా మారుతాయి. ఎక్కువ వేగం లేదా స్పోర్టీ డ్రైవింగ్ కంటే కంఫర్ట్, ఈజీ డ్రైవింగ్, నమ్మకమైన ఇంజిన్, తక్కువ నిర్వహణ ఖర్చు ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది. నెలకు సగటున 500 కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే ఉంటే, అధిక శక్తిమంతమైన ఇంజిన్ అవసరం ఉండదు. అదే సమయంలో బడ్జెట్ ₹8 లక్షల లోపు ఉంటే, సరైనది ఎంపిక చేసుకోవడం మరింత అవసరం. ఈ అన్ని అవసరాలను కలిపి చూసుకుంటే, Maruti Suzuki Swift 1.2 పెట్రోల్ VXi AMT ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.
ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చే సౌకర్యం
సీనియర్ సిటిజన్లకు ట్రాఫిక్‌లో క్లచ్, గేర్ మార్చడం కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతుంది. స్విఫ్ట్‌లో ఉన్న AMT గేర్‌బాక్స్ నగర డ్రైవింగ్‌ను చాలా సులభం చేస్తుంది. స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో కాళ్లు, చేతులపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. డ్రైవింగ్ మరింత రిలాక్స్‌గా మారుతుంది.
నగరానికి సరిపడే 1.2 లీటర్ ఇంజిన్
స్విఫ్ట్‌లో ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ నగర వినియోగానికి బాగా సరిపోతుంది. ట్రాఫిక్‌లో స్మూత్‌గా నడుస్తుంది. హైవే ప్రయాణాలకూ ఇది సరిపడా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అధిక వేగం అవసరం లేకుండా, నమ్మకంగా డ్రైవ్ చేయాలనుకునే వారికి ఇది సరైన ఇంజిన్.
కంఫర్ట్ & డ్రైవింగ్ ఈజ్
స్విఫ్ట్ సీటింగ్ పొజిషన్ సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ఉంటుంది. కారు లోపలికి ఎక్కడం, దిగడం సులభంగా ఉంటుంది. స్టీరింగ్ తేలికగా ఉండటంతో మలుపులు తిప్పడం, పార్కింగ్ చేయడం పెద్ద కష్టం కాదు. రోజువారీ చిన్న ప్రయాణాల్లో డ్రైవింగ్ స్ట్రెస్ తగ్గుతుంది.
అవసరమైన అన్ని ఫీచర్లు
aruti Suzuki Swift VXi AMT వేరియంట్‌లో రోజువారీ వినియోగానికి అవసరమైన అన్ని ఫీచర్లు ఉన్నాయి. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో పాటు Apple CarPlay, Android Auto సపోర్ట్ ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వల్ల డ్రైవింగ్ చేస్తూనే ఆడియో, కాల్స్‌ను నియంత్రించవచ్చు. ప్రోజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ రాత్రి డ్రైవింగ్‌లో స్పష్టమైన విజిబిలిటీ ఇస్తాయి. ముఖ్యంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండటం సేఫ్టీ పరంగా పెద్ద ప్లస్ పాయింట్.
మైలేజ్ & నిర్వహణ ఖర్చు
నిజ జీవిత మైలేజ్ పరీక్షల్లో స్విఫ్ట్ AMT నగరంలో సుమారు 12.7 కిలోమీటర్లు, హైవేపై సుమారు 19.1 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది. నెలకు 500 కిలోమీటర్ల వినియోగానికి ఇది సరిపడే స్థాయి. మారుతి సుజుకి బ్రాండ్ నమ్మకం, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్, తక్కువ నిర్వహణ ఖర్చు దీర్ఘకాలిక యాజమాన్యంలో లాభం ఇస్తాయి. అయితే, కొనుగోలు ముందు ఒకసారి టెస్ట్ డ్రైవ్ తీసుకుని మీకు సరిపోతుందో, లేదో చూసుకోవడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















