అన్వేషించండి

SUVs Under Rs 10 Lakhs: బడ్జెట్‌ ఆటోమేటిక్‌ SUVలు - ఆఫీస్‌ డ్రైవ్‌కు సూపర్‌గా సరిపోయే 5 స్టైలిష్‌ కార్లు, రూ.6 లక్షల నుంచి ప్రారంభం!

Automatic Cars For Office Travel: తెలుగు రాష్ట్రాల్లో, రూ.10 లక్షల కంటే తక్కువకే దొరికే 5 ఆటోమేటిక్ SUVలు ఉన్నాయి. రేటు తక్కువైనా, వాటిలోని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ప్రీమియం కారు ఫీల్‌ ఇస్తాయి.

Best Affordable Automatic SUVs 2025: భారతదేశంలో ఇప్పుడు SUV ట్రెండ్‌ నడుస్తోంది. కారు కొనేవాళ్లు మొదట SUV గురించే ఆలోచిస్తున్నారు, వాటిలోనూ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా, సులభంగా డ్రైవ్‌ చేయడానికి ఆటోమేటిక్ కార్లు చక్కగా ఉపయోగపడుతున్నాయి. మీ బడ్జెట్ రూ. 10 లక్షల వరకు ఉంటే, మీరు రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, ఫీచర్లు & పనితీరులో కూడా మెరుగ్గా ఉండే SUV మోడళ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Nissan Magnite
నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో అత్యంత చవకైన ఆటోమేటిక్ SUV. తెలుగు రాష్ట్రాల్లో దీని ఆటోమేటిక్ వేరియంట్‌ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.75 లక్షలు. Visia AMT వేరియంట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, 72 bhp శక్తిని & 96 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఇది 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంటుంది. మాగ్నైట్ డిజైన్‌ స్టైలిష్‌గా ఉంటుంది & ప్రాక్టికల్ క్యాబిన్‌తో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సంపాదించింది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా & పుష్-బటన్ స్టార్ట్ వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. కంపెనీ, నిస్సాన్ మాగ్నైట్‌ను ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అందిస్తోంది.

Renault Kiger
రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ ప్లాట్‌ఫామ్‌ మీదే తయారైంది & దీని ఆటోమేటిక్ వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 7.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). Emotion AMT వేరియంట్‌లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 72 bhp పవర్ & 96 Nm టార్క్ ఇస్తుంది. దీనికి 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఉంది. కిగర్ డిజైన్ బోల్డ్‌గా & మోడ్రన్‌గా ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్‌లు, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లతో కూడిన కారును కోరుకునే వారికి ఈ SUV సరైనది.

Tata Punch
టాటా పంచ్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.77 లక్షలు. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి ఉంది, ఇది 86 bhp పవర్ & 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో స్మూత్‌గా పని చేస్తుంది. పంచ్ డిజైన్ రగ్డ్‌ & స్పోర్టీగా ఉంటుంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ & రఫ్-టఫ్ లుక్స్‌లో కనిపిస్తుంది. దీని టాప్ వేరియంట్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్ & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, దీనికి రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉన్నాయి, ఇది భద్రత పరంగా కొంచెం తక్కువ.

Hyundai Exter
మైక్రో SUV విభాగంలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక పాపులర్‌ వెహికల్‌. దీని AMT వేరియంట్ ధర రూ. 8.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది, ఇది 83 bhp పవర్‌ & 114 Nm టార్క్‌ ఇస్తుంది. ఎక్స్‌టర్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగులు, LED హెడ్‌ల్యాంప్‌లు & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని మైలేజ్ లీటరుకు దాదాపు 19.2 కిలోమీటర్లు.

Maruti Suzuki Fronx
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒక స్టైలిష్ క్రాస్ఓవర్ SUV. దీని AMT వేరియంట్ ధర రూ. 8.95 లక్షల నుంచి మొదవుతుంది. ఇది కూడా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఈ ఇంజిన్‌ 90 bhp శక్తిని & 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & LED లైటింగ్ వంటి మోడ్రన్‌ ఫీచర్లు దీని సొంతం. ఇది టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్ కంటే దాదాపు రూ. 40,000 చవకగా వస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget