Tata Motors: సఫారీ, హారియర్‌ల్లో రెడ్ ఎడిషన్లు లాంచ్ చేసిన టాటా - వావ్ అనిపించే ఫీచర్లు!
ఆటో ఎక్స్‌పో 2023లో టాటా సఫారీ, హారియర్‌ల్లో రెడ్ ఎడిషన్లు లాంచ్ అయ్యాయి.
Auto Expo 2023 India: టాటా మోటార్స్ దాని రెండు టాప్ ఎండ్ ఎస్‌యూవీలు అయిన సఫారీ, హారియర్‌లను ADAS భద్రతా వ్యవస్థ, పెద్ద టచ్‌స్క్రీన్‌తో సహా అనేక కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ప్రస్తుత సఫారీ, హారియర్‌ల్లో చాలా పెద్ద టచ్‌స్క్రీన్‌ను అందించారు.
ఈ కొత్త మార్పులన్నీ ఈ రెండు కార్ల కొత్త రెడ్ డార్క్ ఎడిషన్‌లో కనిపిస్తాయి. ఇందులో ADASతో కూడిన 360 డిగ్రీ కెమెరా ఫీచర్ మాత్రమే జోడించారు. ఇవన్నీ చాలా ఆధునికమైనవి, ముఖ్యమైనవి. ADAS సిస్టమ్ ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ అసిస్ట్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంది.
ఈ రెండు కార్లలో మీకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందిస్తారు. 360 డిగ్రీ కెమెరా ఫీచర్ పార్కింగ్‌లో సహాయపడుతుంది. అలాగే విజువల్స్‌ను ఉత్తమమైన రీతిలో బయటకు తీసుకొచ్చే టచ్ స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది.
ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 9-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్ ఉన్నాయి. సఫారీ రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్లు అందించారు. దాని సన్‌రూఫ్ చుట్టూ యాంబియంట్ లైటింగ్ కూడా ఉంది. హారియర్, సఫారీల్లో కంఫర్ట్ అనేది ముఖ్యమైన అంశం.
ఇంజన్ ఆప్షన్ల విషయానికొస్తే, డీజిల్ ఇంజన్ ఆప్షన్ రెండు కార్లకు ఒకే విధంగా ఉంటుంది. ఈ కొత్త ఫీచర్లతో ఈ రెండు SUVలను భారీగా అప్‌డేట్ చేశారు. దీని కారణంగా ఈ రెండు కార్లు తమ సెగ్మెంట్‌లోని ఇతర కార్లకు గట్టి పోటీనిస్తాయి.
View this post on Instagram
View this post on Instagram