అన్వేషించండి

OTA అప్‌డేట్‌తో Ather 450Xలో క్రూయిజ్ కంట్రోల్‌ - సిటీ రైడింగ్‌లో కొత్త అనుభవం

Ather 450X ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు Infinite Cruise ఫీచర్‌ OTA అప్‌డేట్‌గా అందుబాటులోకి వచ్చింది. 10-90 kmph వేగంలో పని చేసే ఈ క్రూయిజ్ కంట్రోల్‌, మీ రైడింగ్‌ను మరింత కంఫర్టబుల్‌గా ఉంచుతుంది.

Ather 450X Infinite Cruise Feature: తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో Ather Energy, తన ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ Ather 450Xకు ఒక హై-ఎండ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఖరీదైన మోడళ్లలో మాత్రమే కనిపించే క్రూయిజ్ కంట్రోల్‌ ఫీచర్‌ను ఇప్పుడు ‘Infinite Cruise’ పేరుతో Ather 450X లోనూ పరిచయం చేసింది.

కొత్తగా అమ్ముడయ్యే అన్ని Ather 450X స్కూటర్లలోనూ ఈ ఫీచర్‌ స్టాండర్డ్‌గా ఉంటుంది. అలాగే, 2025 జనవరి 1 తర్వాత కొనుగోలు చేసిన 450X స్కూటర్లకు OTA అప్‌డేట్‌ ద్వారా ఈ ఫీచర్‌ను కంపెనీ అందిస్తోంది. తద్వారా, దాదాపు 44,000 మందికి పైగా Ather 450X యూజర్లకు ఈ అప్‌డేట్‌ చేరనుంది.

Infinite Cruise అంటే ఏమిటి?
Infinite Cruise అనేది సాధారణ క్రూయిజ్ కంట్రోల్‌లా కాకుండా కొంచెం అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌. రైడర్‌ బ్రేక్‌ వేస్తే ఇది తాత్కాలికంగా ఆగుతుంది. మళ్లీ యాక్సిలరేటర్‌ ఇస్తే, కొత్త వేగానికి అనుగుణంగా తిరిగి పని చేయడం మొదలుపెడుతుంది. అంటే ప్రతిసారి మళ్లీ ఆన్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే దీని ప్రత్యేకత.

సిటీ రైడింగ్‌కు ఎంతో ఉపయోగం
ఈ ఫీచర్‌ కేవలం 10 kmph నుంచే పని చేయడం మరో పెద్ద ప్లస్‌ పాయింట్‌. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌, విజయవాడ లాంటి నగరాల్లో నెమ్మదిగా కదిలే ట్రాఫిక్‌లో కూడా ఇది ఉపయోగపడుతుంది. లాంగ్‌ రైడ్స్‌తో పాటు రోజువారీ ఆఫీస్‌ ప్రయాణాల్లో కూడా రైడర్‌కు అలసట తగ్గుతుంది.

హిల్ కంట్రోల్‌ ఫంక్షన్‌
Infinite Cruise‌లో Hill Control అనే ఫీచర్‌ కూడా ఉంది. మెరక రోడ్లు, వాలు రోడ్లపై కూడా స్కూటర్‌ ఒకే వేగంతో దూసుకెళ్లేలా పవర్‌ డెలివరీ, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌ను ఈ సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఇది భద్రతతో పాటు కంఫర్ట్‌ను కూడా పెంచుతుంది.

డాష్‌బోర్డ్‌లో నోటిఫికేషన్‌
ఈ అప్‌డేట్‌కు అర్హులైన వినియోగదారులకు స్కూటర్‌ డిజిటల్‌ డాష్‌బోర్డ్‌పై నోటిఫికేషన్‌ కనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పూర్తయ్యాక ఫీచర్‌ యాక్టివేట్‌ అవుతుంది. సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

విజయవాడ, హైదరాబాద్‌లో Ather 450X ధరలు

Ather 450X - విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 1,47,841
RTO ఖర్చు: ₹ 785
ఇన్సూరెన్స్‌ (కాంప్రెహెన్సివ్‌): ₹ 7,372
క్యాష్‌ డిస్కౌంట్‌: ₹ 1,001
మొత్తం ఆన్‌రోడ్‌ ధర: ₹ 1,54,997

Ather 450X - హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధర
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 1,48,419
RTO ఖర్చు: ₹ 935
ఇన్సూరెన్స్‌ (కాంప్రెహెన్సివ్‌): ₹ 7,382
క్యాష్‌ డిస్కౌంట్‌: ₹ 1,001
మొత్తం ఆన్‌రోడ్‌ ధర: ₹ 1,55,735

మొత్తమ్మీద, Infinite Cruise ఫీచర్‌తో Ather 450X ఇప్పుడు మరింత ప్రీమియం, మరింత స్మార్ట్‌గా మారింది. సిటీ రైడింగ్‌, డైలీ కమ్యూట్‌, లాంగ్‌ డ్రైవ్స్‌... ఇలా ఏ పరిస్థితిలోనైనా రైడర్‌కు అదనపు కంఫర్ట్‌ అందించే ఫీచర్‌గా ఇది నిలుస్తుంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సెగ్మెంట్‌లో Ather మరోసారి తన టెక్నాలజీ బలాన్ని చాటిందని చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget