అన్వేషించండి

Hyundai Creta: వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్.. స్పై షాట్‌లలో ప్రీమియం లుక్

హ్యుందాయ్ క్రెటా నెక్స్ట్ జనరేషన్ (2027) మోడల్ సరికొత్త K3 ప్లాట్‌ఫామ్‌తో ప్రస్తుత మోడల్ కంటే పెద్దదిగా, మరింత ప్రీమియం డిజైన్‌తో రాబోతోంది.

Hyundai Creta 2027 | వచ్చే ఏడాది హ్యుందాయ్ క్రెటా కొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. ఈ పాపులర్ SUV కంపెనీ నుంచి నెక్ట్స్ జనరేషన్ విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. కొత్త తరం క్రెటా ప్రస్తుత మోడల్ కంటే చాలా పెద్దదిగా ఉండటంతో పాటు సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటుంది. ఈ కొత్త క్రెటా సరికొత్త K3 ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. ఇది మెరుగైన రైడ్, హ్యాండ్లింగ్‌తో పాటు మరింత సేఫ్టీని అందిస్తుంది. అలాగే ఇది హైబ్రిడ్ టెక్నాలజీకి కూడా అనువుగా ఉంటుందని సమాచారం.

వాహనం సైజ్, టెక్నాలజీ

హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్ ప్రస్తుత క్రెటాతో మాత్రమే కాకుండా, కొత్త సెల్టోస్ కంటే కూడా పెద్దదిగా ఉండనుంది. కొత్త క్రెటా పొడవు సుమారు 4.5 మీటర్లు ఉండవచ్చు. ఇందులో బ్రాడ్ షోల్డర్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, సన్నని DRLలతో పాటు హెడ్‌ల్యాంప్స్ రానున్నాయి. స్పై షాట్స్ ఆధారంగా చూస్తే, దీని లుక్ చాలా ప్రీమియంగా, టాప్ క్లాస్ కారులా కనిపిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా డిజైన్ ఎలా ఉంటుంది?

కొత్త క్రెటాలో హెల్తీ క్లాడింగ్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, స్టాండర్డ్ మోడల్‌లో కూడా 18 అంగుళాల వరకు ఉండే పెద్ద వీల్స్ వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీ విషయానికి వస్తే, ఇందులో 12.3 అంగుళాల స్క్రీన్‌లతో పాటు క్లైమేట్ కంట్రోల్ కోసం అదనపు స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. అయితే బటన్స్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. వెన్యూ (Venue)లో ఉన్న సరికొత్త హ్యుందాయ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను మరిన్ని కొత్త ఫీచర్లతో ఇందులో చేర్చనున్నారు.

హ్యుందాయ్ కొత్త క్రెటాలో కొత్త స్టీరింగ్ వీల్, న్యూ బటన్స్, వెంటిలేషన్ సౌకర్యంతో కూడిన ట్విన్ పవర్డ్ సీట్లు, మరిన్ని వాయిస్ కమాండ్స్ ఉంటాయి. వీటితో పాటు వెనుక సీటు ప్రయాణికుల కోసం బాస్ మోడ్ (boss mode) ఇవ్వనున్నారు. మొత్తానికి కొత్త క్రెటా విలాసవంతంగా, పెద్దదిగా, విశాలంగా ఉండనుంది. ఇందులో 1.5 లీటర్ NA పెట్రోల్, టర్బో, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటు హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త క్రెటా వచ్చే ఏడాది భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఈ SUV కారులో 1.5 లీటర్ పెట్రోల్ (నేచురల్, టర్బో), డీజిల్ ఇంజిన్లు లభిస్తాయని భావిస్తున్నారు. వీటితో పాటు ఒక హైబ్రిడ్ వెర్షన్ కూడా ఇవ్వనున్నారు. మొత్తానికి, కొత్త క్రెటా మరింత ఎక్కువ స్పేస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లతో రాబోతోంది. ఈ నెక్స్ట్ జనరేషన్ క్రెటా  SUV సెగ్మెంట్‌లో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని కంపెనీ భావిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget