(Source: ECI/ABP News)
Car Maintenance Tips: కారు మెయింటెనెన్స్‌లో ఈ టిప్స్ పాటిస్తే మీ జేబుకు చిల్లు పడదు.. భారీ రిపేర్ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి సింపుల్ గైడ్!
కారు యజమానులు ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్స్, వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేల రూపాయల రిపేర్ ఖర్చులను ఆదా చేసుకోవచ్చు.

Car Maintenance Tips to Avoid Expensive Repairs: సొంత కారు ఉండటం అనేది ఒక కంఫర్ట్. అయితే మన దేశంలో కారును నడపడం, దాన్ని సేఫ్ గా ఉంచుకోవడం అనేది ఒక ఆర్ట్. రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ జామ్స్, దుమ్ము, ధూళి వెహికల్ పార్ట్స్ ను త్వరగా డ్యామేజ్ చేస్తాయి. చాలామంది కారులో ఏదైనా చిన్న సౌండ్ వస్తే లైట్ తీసుకుంటారు. కానీ అదే తర్వాత వేల రూపాయల బిల్లుకు కారణం అవుతుంది. అందుకే అసలు మన కార్లలో ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా అడ్డుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం.
సస్పెన్షన్ డ్యామేజ్ - రోడ్ల పరిస్థితి..
మన రోడ్ల మీద గుంతలు, స్పీడ్ బ్రేకర్లు కామన్. వీటి వల్ల కారు సస్పెన్షన్ పార్ట్స్ త్వరగా అరిగిపోతాయి. కారు నడిపేటప్పుడు ఏవైనా శబ్దాలు వస్తున్నా లేదా జర్క్స్ ఎక్కువగా అనిపిస్తున్నా వెంటనే చెక్ చేయించాలి. సస్పెన్షన్ లో ఏదైనా చిన్న పార్ట్ పోయినప్పుడు మార్పిస్తే తక్కువలో అయిపోతుంది. అలా కాకుండా మొత్తం సెటప్ మార్చాల్సి వస్తే మాత్రం జేబుకు భారీ చిల్లు పడుతుంది.
టైర్ల అరుగుదల..
అలైన్మెంట్ సరిగ్గా లేకపోయినా లేదా రఫ్ రోడ్లపై ఎక్కువగా తిరిగినా టైర్లు అడ్డదిడ్డంగా అరిగిపోతాయి. దీనివల్ల గ్రిప్ తగ్గిపోవడమే కాకుండా, టైర్లను త్వరగా మార్చాల్సి వస్తుంది. రెగ్యులర్ గా వీల్ అలైన్మెంట్ చేయించడం వల్ల టైర్ల లైఫ్ పెరుగుతుంది.
ట్రాఫిక్ లో బ్రేక్ ప్యాడ్ల గోల..
సిటీ డ్రైవింగ్ అంటేనే మాటిమాటికీ బ్రేకులు వేయడం. దీనివల్ల బ్రేక్ ప్యాడ్లు అరిగిపోతాయి. ఒకవేళ బ్రేక్ వేసినప్పుడు కిర్రుమని సౌండ్ వచ్చినా లేదా బ్రేక్ సరిగ్గా పడకపోయినా వెంటనే మెకానిక్ కు చూపించాలి. ప్యాడ్లు సకాలంలో మార్చకపోతే బ్రేక్ డిస్క్ లు కూడా పాడవుతాయి. డిస్క్ లు మార్చడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని.
వేసవిలో ఇంజిన్ వేడి..
మన దగ్గర ఎండలు ఎలా ఉంటాయో తెలిసిందే. ట్రాఫిక్ లో కారు నెమ్మదిగా వెళ్తున్నప్పుడు ఇంజిన్ త్వరగా హీట్ అవుతుంది. కూలెంట్ లెవల్స్ తక్కువగా ఉన్నా లేదా రేడియేటర్ ఫ్యాన్ సరిగ్గా తిరగకపోయినా ఈ ప్రాబ్లం వస్తుంది. రెగ్యులర్ గా కూలెంట్ చెక్ చేస్తూ ఉండాలి. ఇంజిన్ ఓవర్ హీట్ అయితే లోపల పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
క్లచ్ ప్లేట్ల జాగ్రత్త..
ట్రాఫిక్ లో క్లచ్ ను ఎక్కువగా వాడటం వల్ల క్లచ్ ప్లేట్లు త్వరగా అరిగిపోతాయి. క్లచ్ హార్డ్ గా అనిపించినా లేదా గేర్ మార్చినప్పుడు కారు స్లో గా వెళ్తున్నా క్లచ్ ప్లేట్లలో ఇష్యూ ఉన్నట్లే. వీటిని టైమ్‌కు మార్చడం వల్ల మైలేజ్ కూడా బాగుంటుంది.
బ్యాటరీ - ఎయిర్ ఫిల్టర్లు..
విపరీతమైన వేడి, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. అప్పుడప్పుడు బ్యాటరీ టెర్మినల్స్ క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే దుమ్ము వల్ల ఎయిర్ ఫిల్టర్లు జామ్ అవుతాయి. దీనివల్ల కారు పికప్ తగ్గిపోవడమే కాకుండా ఏసీ కూలింగ్ కూడా తగ్గిపోతుంది. ఫిల్టర్లను క్లీన్ చేయడం లేదా మార్చడం అనేది చాలా తక్కువ ఖర్చుతో అయ్యే పని. మీ కారును పద్ధతిగా మెయింటెన్ చేస్తే అది మీకు ఎంతో కాలం తోడుగా ఉంటుంది. రెగ్యులర్ సర్వీసింగ్ చేయించడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ను వెంటనే సాల్వ్ చేయడం వల్ల భారీ ఖర్చుల నుండి తప్పించుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు






















