Hyundai Tucson కంటే తక్కువ రేటులోనే 11 బెస్ట్ SUVలు - మీ లైఫ్‌స్టైల్ లెవెల్‌ను పెంచే కార్లు
Hyundai Tucson ధర కంటే తక్కువ ఖర్చుతో లభించే 11 SUVల లిస్ట్ ఈ కథనంలో ఉంది. ఫీచర్లు, మైలేజ్, పనితీరు పరంగా ఆకట్టుకునే బెస్ట్ కార్లు ఇవి.

Hyundai Tucson alternatives: SUVల క్రేజ్ ఎప్పటికీ తగ్గదేమో. హ్యుందాయ్ టూసాన్ ధర పెరిగిన తర్వాత చాలా మందికి అది బడ్జెట్ దాటిపోయిందని అనిపిస్తుంది. కానీ దానికి సమానంగా ఫీచర్లు, పనితీరు కలిగి ఉండే SUVలు తక్కువ ధరకే మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు టూసాన్ కంటే తక్కువ ధరలోనే ఉండి & స్టైల్, టెక్నాలజీ, కంఫర్ట్‌లో తగ్గని 11 SUVలు ఇవే. ప్రస్తుతానికి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.
1. 2026 Nissan Rogue
1.5 లీటర్ టర్బో 3-సిలిండర్ ఇంజిన్ - 201 హెచ్‌పీ, 225 ఎల్‌బీ-ఫీట్ టార్క్.
ఫ్రంట్ వీల్ డ్రైవ్‌లో 33 MPG మైలేజ్.
ఎక్స్-షోరూమ్ ధర సుమారు $28,790.
2. 2026 Kia Sportage
టూసాన్‌తో సేమ్ ప్లాట్‌ఫామ్ షేర్ చేసుకున్నప్పటికీ డిజైన్, ఫీచర్లలో భిన్నంగా నిలుస్తుంది.
187 హెచ్‌పీ, 178 ఎల్‌బీ-ఫీట్ టార్క్.
12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇంటీరియర్ హైలైట్.
ధర సుమారు $28,690.
3. 2025 Subaru Crosstrek
స్టాండర్డ్ ఆల్‌వీల్ డ్రైవ్ (AWD) తో వస్తుంది.
9.3 అంగుళాల గ్రౌండ్ క్లియరెన్స్.
152 హెచ్‌పీ బేస్ వెర్షన్, 182 హెచ్‌పీ ప్రీమియం వెర్షన్.
ధర $26,560 - $27,180 మధ్య.
4. 2026 Buick Encore GX
కంఫర్ట్ పై దృష్టి పెట్టిన కాంపాక్ట్ SUV.
1.2 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ - 137 హెచ్‌పీ, 162 ఎల్‌బీ-ఫీట్.
లెదర్ సీట్లు, ప్రీమియం ఇంటీరియర్.
ధర $26,495.
5. 2026 Honda HR-V
2.0 లీటర్ ఇంజిన్ - 158 హెచ్‌పీ, 138 ఎల్‌బీ-ఫీట్.
సివిక్ ప్లాట్‌ఫామ్‌పై డిజైన్ చేశారు.
9 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ CarPlay / Android Auto.
ధర $26,200.
6. 2026 Mazda CX-30
డ్రైవింగ్ ఫీల్ & పవర్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది.
186 హెచ్‌పీ, స్టాండర్డ్ AWD.
మంచి హ్యాండ్లింగ్‌తో ఆకట్టుకుంటుంది.
ధర $25,975.
7. 2025 Volkswagen Taos
1.5 లీటర్ TSI ఇంజిన్ - 174 హెచ్‌పీ, 184 ఎల్‌బీ-ఫీట్.
IQ.DRIVE సేఫ్టీ టెక్నాలజీ ఉంది.
ధర $25,495.
8. 2026 Hyundai Kona
2.0 లీటర్ ఇంజిన్ - 147 హెచ్‌పీ.
12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, మోడ్రన్ డిజైన్.
సిటీ SUVగా సరిపోయే డైనమిక్ మోడల్.
ధర $25,350.
9. 2026 Toyota Corolla Cross
2.0 లీటర్ ఇంజిన్ - 169 హెచ్‌పీ, 151 ఎల్‌బీ-ఫీట్.
మైలేజ్ సుమారు 32 MPG.
టయోటా నాణ్యత, విశ్వసనీయత.
ధర $24,635.
10. 2026 Chevrolet Trailblazer
1.2 లీటర్ టర్బో - 137 హెచ్‌పీ లేదా 1.3 లీటర్ టర్బో, 155 హెచ్‌పీ.
11 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే.
ధర $24,995 - $25,390.
11. 2026 Chevrolet Trax
టూసాన్ కంటే చాలా తక్కువ ధరలో లభిస్తుంది.
1.2 లీటర్ టర్బో - 137 హెచ్‌పీ.
25.6 క్యూబిక్ ఫీట్ బూట్ స్పేస్.
ధర $20,500.
ఈ SUVలు అన్ని హ్యుందాయ్ టూసాన్ కంటే తక్కువ ధరకే లభిస్తాయి. కానీ, వాటి పనితీరు, సేఫ్టీ, కంఫర్ట్ విషయంలో మాత్రం వెనుకబడవు. మీరు మీ బడ్జెట్, ప్రాధాన్యతలకు అనుగుణంగా వీటిలోని ఒక SUVని ఎంచుకుంటే, టూసాన్ స్థాయి అనుభవాన్ని తక్కువ ఖర్చుతో పొందవచ్చు.




















