అన్వేషించండి

Facelift of The Year: ‘ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచిన నెక్సాన్ - ప్రత్యేకతలు ఇవే!

ABP Auto Awards 2024: ఏబీపీ ఆటో అవార్డ్స్ 2024లో ఈవీ ఆఫ్ ది ఇయర్ అవార్డును టాటా నెక్సాన్ గెలుచుకుంది.

Facelift of the Year 2024: ఏబీపీ ఆటో లైవ్ అవార్డ్స్ రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. 2023లో విడుదల చేసిన అత్యుత్తమ కార్లు, బైక్‌లకు ఇక్కడ అవార్డులు అందించారు. ఇందులో ఎస్‌యూవీ నుంచి సూపర్‌కార్ వరకు అన్నీ ఉన్నాయి. ఈ క్రమంలో టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్
గత సంవత్సరం టాటా మోటార్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన నెక్సాన్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.15 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక దాని టాప్ వేరియంట్ కోసం రూ. 15.80 లక్షలకు చేరుకుంటుంది. ఇది మొత్తం 11 వేరియంట్‌లలో (స్మార్ట్, స్మార్ట్+, స్మార్ట్+ S, ప్యూర్, ప్యూర్ S, క్రియేటివ్, క్రియేటివ్+, క్రియేటివ్+ S, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ S, ఫియర్‌లెస్+ S), ఆరు రంగుల్లో లాంచ్ అయింది.

టాటా నెక్సాన్ డిజైన్
విజేతగా నిలవడంలో దాని డిజైన్‌దే ప్రధాన పాత్ర. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఎయిర్ డ్యామ్, కొత్త గ్రిల్, బంపర్, ఎల్-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్త రూఫ్ రెయిల్‌లతో అప్‌డేట్ దీన్ని మార్చారు. అలాగే దానికి రెండు వైపులా బ్లాక్ అవుట్ బి పిల్లర్లు అందించారు. దీని వెనుక ప్రొఫైల్‌ను రీడిజైన్ చేసిన బంపర్, నిలువుగా ఆకారంలో ఉన్న రివర్స్ లైట్, వై ఆకారపు ఎల్ఈడీ టైల్‌లైట్, ఎల్ఈడీ లైట్ బార్‌తో అప్‌డేట్ చేశారు.

టాటా నెక్సాన్ ఇంటీరియర్, ఫీచర్లు
కొత్త ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ ఫీచర్లలో కూడా చాలా పెద్ద మార్పులు చేశారు. అతిపెద్ద మార్పు గురించి చెప్పాలంటే... ఫేస్‌లిఫ్ట్ మోడల్ 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుందిజ దీని ద్వారా కొత్త ఏపీ ప్యానెల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాపిల్ కార్ ప్లేతో ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఉన్నాయి. ఇలా అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. ఇతర ఫీచర్లలో కొత్త గేర్ లివర్, మల్టీ లెవల్ డ్రైవింగ్ మోడ్ సెలెక్టర్ రోటరీ నాబ్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, సెల్ఫ్ డిమ్మింగ్ ఐఆర్వీఎం ఉన్నాయి.

కొత్త టాటా నెక్సాన్‌లో రెండు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ యూనిట్. ఇది 118 బీహెచ్‌పీ పవర్‌ని, 170 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ మాన్యువల్,  6 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ, 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రెండో ఇంజన్ ఎంపికగా ఇది 1.5 లీటర్ డీజిల్ యూనిట్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 113 బీహెచ్‌పీ పవర్‌ని, 260 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ మాన్యువల్ యూనిట్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి.

వీటితో పోటీ?
కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ దేశీయ విపణిలో ఇప్పటికే ఉన్న హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, మారుతి సుజుకి బ్రెజ్జాతో పోటీపడతాయి. అయితే మహీంద్రా ఎక్స్‌యూవీ400 దాని ఎలక్ట్రిక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో పోటీ పడటానికి ఇప్పటికే అందుబాటులో ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget