EV of The Year: ‘ఈవీ ఆఫ్ ది ఇయర్’ ఇదే - ఏ కారుకు అవార్డు వచ్చిందంటే?
ABP Auto Awards 2024: ఏబీపీ ఆటో అవార్డ్స్ 2024లో ఈవీ ఆఫ్ ది ఇయర్ అవార్డును హ్యుందాయ్ అయోనిక్ 5 గెలుచుకుంది.
Hyundai Ioniq 5 EV: ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న ట్రెండ్‌ను చూసి హ్యుందాయ్ మోటార్ ఇండియా గత సంవత్సరం మనదేశంలో అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఈవీ ఎస్‌యూవీని లాంచ్ అచేసింది. అదే హ్యుందాయ్ అయోనిక్ 5. ఇది అనేక ఆధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. భారత మార్కెట్లో ఇది కియా ఈవీ6, వోల్వో ఎక్స్‌సీ40 రీఛార్జ్, బీఎండబ్ల్యూ i4తో పోటీపడుతుంది. ఏబీపీ ఆటో లైవ్ అవార్డ్స్ రెండో ఎడిషన్‌లో అయోనిక్ 5 కారు ‘ఈవీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది.
ధర ఎంత?
హ్యుందాయ్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయోనిక్ 5 ఎక్స్ షోరూమ్ ధర రూ. 45.95 లక్షలుగా ఉంది. ఇది కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఐదుగురు కూర్చునే సీటింగ్ కెపాసిటీతో వస్తుంది.
హ్యుందాయ్ అయోనిక్ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇది వెనుక యాక్సిల్‌పై మౌంట్ చేసిన సింగిల్ రియర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పెయిర్ అయింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 217 పీఎస్ పవర్, 350 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 631 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. హ్యుందాయ్ అయోనిక్ 5 కేవలం 21 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని రీఛార్జ్ చేయగల 150 కేడబ్ల్యూ ఛార్జర్, ఒక గంటలో 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని రీఛార్జ్ చేయగల 50 కేడబ్ల్యూ ఛార్జర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
హ్యుందాయ్ లాంచ్ చేసిన ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో డ్యూయల్ 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్‌ప్లే ఉన్నాయి. అలాగే సెక్యూరిటీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ADAS), 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.