అన్వేషించండి

కొత్త Honda Dio 110లో ఏం మారింది? - కొనే ముందు తెలుసుకోవాల్సిన 7 ఆసక్తికర విషయాలు

కొత్త Honda Dio 110 ఇప్పుడు మరింత స్పోర్టీగా, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. GST 2.0 తర్వాత ధర తగ్గింది కూడా. ఈ స్కూటర్‌ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన 7 ముఖ్య విషయాలు ఇవే.

New Honda Dio 110 Features Price: యూత్‌కి ఫేవరెట్‌గా నిలిచిన హోండా డియో ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, ఫీచర్లతో రీ-ఎంట్రీ ఇచ్చింది. యాక్టివా 110లో ఉపయోగించిన ఇంజిన్‌ను పంచుకుంటూ.. తన షార్ప్‌ డిజైన్‌, ఫంకీ కలర్స్‌తో యువతను ఆకట్టుకుంటోంది. ఇపుడు GST 2.0 తర్వాత దీని ధర తగ్గడంతో స్కూటర్‌ బయ్యర్స్‌కి మరింత అట్రాక్టివ్‌ ఆప్షన్‌గా మారింది. 

హోండా డియో 110 కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన 7 కీలక విషయాలు ఏంటి?:

1. ట్యూబ్‌లెస్‌ టైర్లు    
హోండా డియో 110 ముందు 12-అంగుళాల, వెనుక 10-అంగుళాల ట్యూబ్‌లెస్‌ టైర్లతో వస్తుంది. ఇవి మంచి గ్రిప్‌, కంఫర్ట్‌ రైడ్‌ అందిస్తాయి. పంక్చర్‌ అయినా వెంటనే గాలి లీక్‌ కాకుండా సేఫ్‌గా మీ రైడ్‌ కొనసాగించవచ్చు.

2. ఆటో స్టార్ట్‌/స్టాప్‌ సిస్టమ్‌     
ఈ స్కూటర్‌లో ఇంజిన్‌ ఆటో స్టార్ట్‌/స్టాప్‌ ఫీచర్‌ ఉంది. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్‌ ఆటోమేటిక్‌గా ఆగి, యాక్సిలరేటర్‌ తిప్పగానే తిరిగి స్టార్ట్‌ అవుతుంది. ఇది మైలేజ్‌ను మెరుగుపరుస్తుంది.

3. సైడ్‌ స్టాండ్‌ కటాఫ్‌   
సేఫ్టీ పరంగా హోండా డియో 110 ని సూపర్‌గా డిజైన్‌ చేశారు. సైడ్‌ స్టాండ్‌ కిందకు ఉంటే ఇంజిన్‌ ఆన్‌ అవ్వదు, ఆ స్టాండ్‌ను మూసేస్తేనే ఇంజిన్‌ స్టార్ట్‌ అవుతుంది, ప్రమాదాలను నివారిస్తుంది. ఇది కొత్త రైడర్స్‌కి బాగానే ఉపయోగపడే సేఫ్టీ ఫీచర్‌.

4. బ్లూటూత్‌ TFT డ్యాష్‌      
హోండా డియో 110లో 4.2 అంగుళాల బ్లూటూత్‌ ఎనేబుల్డ్‌ TFT డిస్‌ప్లే ఉంది. దీనిలో కాల్స్‌, మ్యూజిక్‌, నావిగేషన్‌ ఇన్ఫర్మేషన్‌ కనిపిస్తుంది. ఇది స్కూటర్‌కి ప్రీమియం టచ్‌ ఇస్తుంది.

5. కలర్‌ ఆప్షన్స్‌     
ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో, ఐదు ఆకర్షణీయ రంగుల్లో లభిస్తోంది, అవి - ఎరుపు, నీలం, గ్రే, డార్క్‌ గ్రే-బ్లాక్‌, బ్లాక్‌. ఈ కలర్‌ కాంబినేషన్స్‌ అన్నీ కూడా యువత అభిరుచికి తగ్గట్టుగానే ఉన్నాయి.

6. ఇంజిన్‌ పవర్‌      
హోండా డియో 110లో 109.5cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 7.9 హెచ్‌పీ పవర్‌, 9Nm టార్క్‌ ఇస్తుంది. ఈ ఇంజిన్‌ యాక్టివా 110లో ఉన్నదే. కానీ, డియోలో రైడింగ్‌ ఫీల్‌ మరింత లైవ్లీగా ఉంటుంది.

7. కొత్త ధరలు (జీఎస్టీ 2.0 తర్వాత)       
జీఎస్టీ 2.0 రివిజన్‌ తర్వాత డియో 110 ధరలు తగ్గాయి. ప్రస్తుతం, రూ. 72,589 నుంచి రూ. 83,467 వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉన్నాయి. పాత ధరతో పోలిస్తే ఎక్స్‌-షోరూమ్‌ రేటు దాదాపు రూ.7,5000 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర రూ. 91,195 నుంచి రూ. 1,03,633 వరకు ఉంది.

హోండా డియో 110 ఇప్పుడు స్పోర్టీ లుక్స్‌, టెక్నాలజీ ఫీచర్లు, ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీతో నయా జనరేషన్‌కి పర్ఫెక్ట్‌ పార్ట్‌నర్‌ అవుతుంది. యాక్టివా కన్నా స్టైలిష్‌గా, డైలీ యూజ్‌కి సూట్‌ అయ్యేలా దీనిని చక్కగా డిజైన్‌ చేశారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

RE Hunter 350 ఫైనాన్స్‌ ఆప్షన్లు - తెలుగు రాష్ట్రాల్లో హంటర్ 350 ధర, బెస్ట్‌ EMI ప్లాన్స్ ఇవే!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 EMI ఆప్షన్లు - తక్కువ EMI కోసం ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి?
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
సుజుకి e-యాక్సెస్ రోడ్ టెస్ట్: రేంజ్, స్పీడ్, స్టోరేజ్‌ వంటివన్నీ రూ.1.92 లక్షల ధరకు తగ్గట్లుగానే ఉన్నాయా?
సుజుకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1.92 లక్షల పెట్టి కొనడం సరైన నిర్ణయమేనా?
ఫాసినో 125 కొనబోతున్నారా? రూ.78,000-రూ.99,000 రేంజ్‌లో మారే ఫీచర్లు ఏంటో తెలుసా?
యమహా ఫాసినో 125లో 3 వేరియంట్లు - కేవలం రూ.21,000 వ్యత్యాసంలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Embed widget